టార్గెట్ కేసీఆర్.. ఆ నాలుగు నియోజకవర్గాల్లో నిజామాబాద్ వ్యూహం

Publish Date:Oct 19, 2023

Advertisement

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హీట్ పీక్స్ కు చేరింది. ఎన్నికల షెడ్యూల్  విడుదలైన క్షణం నుంచీ క్షణ తీరిక లేకుండా మూడు ప్రధాన పార్టీలూ  ప్రచార వ్యూహాల ఖరారులో మునిగిపోయారు. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన విధంగానే అధికార పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రచార శంఖారావాన్నికూడ ముందే పూరించారు.  ఆ తరువాత కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని రాహుల్, ప్రియాంకల పర్యటనతో ఆరంభించింది. ఇక బీజేపీ  నేడో రేపే పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే అవకాశాలు  ఉన్నాయి.

తెలంగాణ సెంటిమెంట్ ను నమ్ముకుని గత  రెండు అసెంబ్లీ ఎన్నికలలోనూ విజయాన్ని సాధించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు ఆ  సెంటిమెంటే ప్రతిబంధకంగా మారినట్లు  కనిపిస్తున్నది. పార్టీ  పేరులోంచే  తెలంగాణను తొలగించి, అభివృద్ధి, సంక్షేమం  అజెండాగా ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని భావిస్తున్న కేసీఆర్ కు ఇప్పుడు తెలంగాణ అమరుల కుటుంబాలు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. అమరుల  త్యాగాలను స్మరించకుండా, వారి కుటుంబాలకు న్యాయం చేయకుండా  హ్యాట్రిక్ విజయాలపై గురిపెట్టారంటూ అమరుల కుటుంబాలు  ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో  కేసీఆర్ పోటీ  చేయాలని భావిస్తున్న గజ్వేల్ , కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు ఆయన కుమారుడు కేటీఆర్ పోటీ చేసే  సిరిసిల్ల, అలాగే  ఆయన మేనల్లుడు  హరీష్ రావు పోటీ చేయనున్నసిద్ధిపేట నియోజకవర్గాలలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు.

గత లోక్ సభ  ఎన్నికలలో నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు వ్యతిరేకంగా పసుపు రైతులు ఎలాగైతే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు  చేసి ఆమె ఓటమికి కారకులయ్యారో.. అదే  విధంగా ఈ అసెంబ్లీ   ఎన్నికలలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పోటీ చేసే  స్థానాలలో  పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని అమరుల కుటుంబాలు  నిర్ణయించాయి. 
 అమరుల త్యాగాలను నిచ్చెనగా చేసుకుని అధికారాన్ని అధిరోహించిన  కేసీఆర్ ఆ తరువాత ఉద్యమ కారుల కుటుంబాలకు న్యాయం చేయలేదనీ, న్యాయం చేస్తామంటూ ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపిస్తూ వారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవానికి  కూడా తాము ఆహ్వానానికి నోచుకోలేదని వారు చెబుతున్నారు.  అందుకే తమ ఆగ్రహాన్ని, నిరసనను చూపేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పోటీ చేసే స్థానాల్లో  అమరవీరుల కుటుంబాల నుంచి నామినేషన్లు వేయాలనే  నిర్ణయం తీసుకున్నా మంటున్నారు.   అమరవీరుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆ నాలుగు నియోజకవర్గాలలో ఒక్కో నియోజక వర్గంలో కనీసం 150 మందితో నామినేషన్లు వేయించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.  తెలంగాణ  ఉద్యమ సమయంలో అమరుల కుటుంబాలకు ఇంటికో  ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ తరువాత వాటిని పూర్తిగా విస్మరించారని, కనీస గౌరవం కూడా చూపలేదని అమరుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏరుదాటి తెప్ప తగలేసిన చందంగా కేసీఆర్ తమ పట్ల వ్యవహరించారని, అందుకే కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలనే లక్ష్యంతో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేసే నియోజకవర్గాలలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించినట్లు వివరిస్తున్నారు. అమరుల కుటుంబాలకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ప్రజలలో ఎండగట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

గతంలో పసుపు రైతులు వందకు పైగా నామినేషన్లు వేసి కవిత గెలుపును ఎలా అడ్డుకున్నారో  అదే విధంగా ఇప్పుడు గజ్వేల్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేటలలో కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.  

By
en-us Political News

  
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
20 వార్డుల్లో 17 స్థానాలు గెలుపు.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో పెను తుపాను ముప్పును ఎదుర్కొంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.