Publish Date:Apr 30, 2012
చింతచెట్టు చిగురుచూడు ... చిన్నదాని సొగసు చూడు ... అన్నాడో సినీకవి. అయితే ఇప్పుడు పట్టాన ప్రజలు మాత్రం చింతచిగురు ధరలు చూసి బావురుమంతున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, వరంగల్ వంటి నగరాలు, పట్టణాల్లో కూరగాయల ధరలతో పాటు చింతచిగురు ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. కిలో చింతచిగురు ధర దాదాపు 200 రూపాయల వరకూ పలుకు తోంది. చింతచెట్లు తగ్గిపోవడం, చింతచిగురు సేకరించే ఓపిక లేకపోవడంతో ఈ ఏడాది చింతచిగురుకు కొరత ఏర్పడింది. ఓపిక ఉన్న కొంతమంది వ్యాపారులు చింతచిగురును సేకరించి పట్టణాలూ, నగరాల్లో విక్రయిస్తున్నారు. అయితే కిలో రెండొందల రూపాయలకు విక్రయిస్తే తమకు గిట్టుబాటుకావటం లేదని వారు అంటున్నారు. అయితే చింతచిగురు రుచికి అలవాటుపడ్డ ప్రాణాలు రేటెంతైనా కొనకతప్పాడు కదా అంటున్నారు. ఈ చింతచిగురులో పులుపు లక్షణాలు ఉండటంతో వంటకాలకు ఉపయోగిస్తున్నారు. వీటితో చేసే వంటకాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/tamrind-leaves-are-prececious-24-13730.html
సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన దళిత సంఘాలు..!
హైదరాబాద్ రోడ్డుపై మరమరాలు అమ్ముకుంటున్న బీఆర్ఎస్ మాజీ సర్పంచ్..!
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు చేసిన పోలీస్ కానిస్టేబుల్ కె. అనిల్‌పై హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు.
మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ నేతలది దారుణమైన ప్రవర్తన..!
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవమానకరమైన, అసభ్యకర మైన, ప్రతిష్టకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడిచినా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్లటి దుస్తులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు.
కూకట్‌పల్లి పరిధిలో ఉన్న ప్రశాంత్‌నగర్ పారిశ్రామిక వాడలోని ABC ప్రింటింగ్ పరిశ్రమలో భారీ అగ్నిప్ర మాదం చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ షాద్‌నగర్ ఎమ్మెల్యే కె. శంకరయ్య చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు
తెలంగాణ శాసనసభ వేదికగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న రాజకీయ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.
17 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లకు కొత్త పోస్టింగులు..!
క్షమాపణ చెప్పాల్సిందే!.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై అసెంబ్లీ తీర్మానం..!
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
మంచి భర్త.. చక్కని సంసారం.. ఆ ప్రేమకు గుర్తుగా ఓ చిన్నారి.. ఇలా సంతోషంగా సాగుతున్న ఆ కుటుంబంలో ఓ చిన్న అపార్థం తీవ్ర విషాదాన్ని నింపింది.