ఉల్లి, టమాటా ధరలూ.. రాజకీయాలు

Publish Date:Jul 1, 2023

Advertisement

మనిషి జీవితమన్నాక ఎత్తు పల్లాలు సహజం. అలా అయితేనే జీవితం.. జీవితం అలాగ ఉంటేనే అయిన వారు ఎవరో.. కానీ వారు ఎవరో ఎప్పుడో ఒక్కప్పుడు తెలుస్తోంది. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. జీవితంలో కింద పడినప్పుడే మనిషికి.. రూపాయి విలువ తెలుస్తోంది. అలాగే మనుషుల్లోని అసలు రంగు సైతం బహిర్గతమవుతోంది. ఆ పైవాడు సృష్టించిన మనిషి జీవితం ఎలా ఉంటుందో.. కూరగాయాల్లో టమాటా జీవితం కూడా దాదాపుగా అలాగే ఉంటుందనేది సుస్పష్టం. 

కూరగాయాల్లో రాజా ఎవరంటే అంతా వంకాయే అంటారు. కానీ కూరగాయాల్లో  టమాటా మాత్రం మనిషి జీవితానికి దగ్గరగా ఉంటుందనే ఓ చర్చ అయితే జన బాహుళ్యం ఎప్పటి నుంచో సాగుతోంది. మనిషి జీవితంలో ఒడుదుకుల్లాగానే.. టమాటా ధరల్లో సైతం ఉత్థాన పతనాలు ఉంటాయని...   ఒక్కొసారి కిలో టమాటా ధర 120 రూపాయిల నుంచి 150 రూపాయిల వరకు పలుకుతోంది, అదే టమాటా ఒక్కోసారి కిలో 5 రూపాయిలకు లేదా 10 రూపాయిలకు పతనం అవుతోంది

ఇక ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్నది నానుడి. అందుకే ఉల్లి  ధరలు ప్రభుత్వలను సైతం కూల్చివేయగలవు. అటువంటి సంఘటనలు భారతావనిలో పలు మార్లు జరిగాయి. ఉల్లిపాయి ధర   రాకెట్‌లా  పైకి ఎగబాకీ.. ఆకాశాన్నంటినా.. ఆ తర్వాత.. ధరలు తగ్గితే 20 రూపాయిలకు మించి కిందకు దిగదన్న విషయం విదితమే. 

దీంతో ఉల్లిపాయే ధర అంతకంటే కిందకి దిగదన్న విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిపోయింది. కానీ టమాట పరిస్థితి అలా కాదు.. అయితే కిలో టమాటా 5 రూపాయిలు లేదా 10 రూపాయిలు.. అదీ ఇది కాకుంటే కిలో 120 రూపాయిలు లేదా 150 రూపాయిలు అయిపోతోంది. ఓ వేళ గిట్టుబాటు ధర లేకపోతే.. ఆ పంట పండించిన రైతు టమాటాను నడిరోడ్డుపైన పడేస్తాడన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మనిషి టైమ్ బాగున్నప్పుడు టమాట ధరలాగా ఎగిరెగిరి పడతాడు. అదే మనిషి...  టైమ్ బ్యాడ్ అయినప్పుడు టమాట ధర తగ్గినట్లు అమాంతంగా సైలెంట్ అయిపోతాడు..   టైమ్ బ్యాడ్ అయినప్పుడు అదే మనిషి నడి రోడ్డున పడతాడు. అంటూ గిట్టుబాటు ధర లేనప్పుడు టమాటలాగా అన్నమాట. 

అయితే టమాటా ధరలతో అధికారం కోల్పోయిన దాఖలాలు ఈ దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఇంత వరకు ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదు. కానీ భారత్‌లో మాత్రం ఉల్లి పాయి చేసే పవర్ పాలిటిక్స్.. భవిష్యత్ లో టమాటా చేసే అవకాశం ఉందా? అంటే సందేహమే. ఎంతైనా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. అలాంటి మన దేశంలో ఓ పార్టీని అధికారంలో నుంచి దింపాలన్నా.. మరో పార్టీకి అధికారం కట్టబెట్టాలన్నా.. ఉల్లిపాయి, టమాట, కోడిగుడ్డు ఎక్సెట్రా ఎక్సెట్రా... ఆహార పదార్థాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం.. భారతమాత ముద్దు బిడ్డలకు బుర్రతో పెట్టిన విద్య.. కాదంటారా?.. ఒక్క సారి ఆలోచించండి.  

By
en-us Political News

  
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.