ఏ క్షణంలోనైనా తమ్మినేని అరెస్టు.!?
Publish Date:Jul 22, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏ క్షణంలోనైనా అరెస్టు అయ్యే అవకాశాలున్నాయి. బోగస్ డెత్ సర్టిఫికేట్ తో భూకబ్జాకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన కుటుంబంతో సహా పరారయ్యారు. అజ్ణాతం నుంచే తమ్మినేని సీతారాం.. తనపై, తన కుటుంబ సభ్యులపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ చేయాలని కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. తమ్మినేని సీతారాం, ఆయన భార్య తమ్మినేని వాణి, కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో వారిని పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన తమ్మినేని కుటుంబం భూకబ్జా కేసులో తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు దాఖలు చేసుకున్న పిటిషన్ ను మంగళవారం (జులై 21) జస్టిస్ వై. లక్ష్మణరావుతో కూడిన ధర్మాసనం విచారించింది. దర్యాప్తు ప్రారంభంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యవహారాల్లో సీఆర్పీసీ క్వాషింగ్ పిటిషన్ల ద్వారా కోర్టులు జోక్యం చేసుకోలేవని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ పిటిషనర్లకు పోలీసుల అరెస్ట్ పట్ల నిజంగానే భయం లేదా ఆందోళన ఉంటే, వారు చట్టబద్ధంగా యాంటిసిపేటరీ బెయిల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది . ఈ వ్యవహారంలో సమగ్ర వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల29కి వాయిదా వేసింది. ఇలా ఉండగా పరారీలో ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. Tammineni Sitaram, AP High Court, Srikakulam land grabbing case, Tammineni Chiranjeevi Nag, FIR quash petition
http://www.teluguone.com/news/content/tammineni-likely-to-be-arrested-at-any-moment-36-226711.html





