తమిళనాడు గవర్నర్ కావాలనే రెచ్చగొడుతున్నారా?

Publish Date:Jan 12, 2023

Advertisement

రాష్ట్రప్రభుత్వాలూ, గవర్నర్ ల మధ్య వివాదం తలెత్తడమన్నది కొత్త విషయమేమీ కాదు.  కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికీ మధ్య సత్సంబంధాలు  లేని ప్రతి సందర్భంలోనూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు గవర్నర్లతో పేచీ తలెత్తడం సాధారణమే. ఈ పరిస్థితి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఉన్నదే.  కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న కాలంలోనూ ఇలా గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ ను పదవీ చ్యుతుడిని చేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన సందర్భంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్ లాల్ వ్యవహరించిన తీరు, పోషించిన పాత్ర తెలిసిందే.  

సరే ఇప్పుడు బీజేపీ హయాంలోనూ అటువంటి పరిస్థితే కొనసాగుతోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళ సైల మధ్య విభేదాలు తెలియనివి కావు.  అలాగే తాజాగా  తమిళనాడులో నూ ఇదే పరిస్థితి ఏర్పడింది. అయితే తమిళ నాడులో జరిగింది మాత్రం మామూలు వివాదం కాదు. ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత అరుదైన సంఘటన. ప్రజాస్వామ్యంలో మాయని మచ్చగా మిగిలిపోయే వివాదం. తమిళనాడు శాసనసభ కొత్త సంవత్సరంలో మొదటిసారిగా సమావేశమైనప్పుడు చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు గవర్నర్‌, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య ఉన్న వివాదాలను మరింత రాజేశాయి. శాసనసభను ఉద్దేశించి గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి తాను చేయాల్సిన ప్రసంగంలో చివరి నిమిషంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయడం, దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి   తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దీని మీద గవర్నర్‌ సభ నుంచి వాకౌట్‌ చేయడం వంటి ఘటనలు స్వతంత్ర భారత దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదు.

శాసనసభ ఆమోదించిన సుమారు పన్నెండు బిల్లుల మీద సంతకం చేయకుండా గవర్నర్‌ తొక్కి పెట్టి ఉంచడం గతంలో పలు సందర్భాలలో పలు రాష్ట్రాలలో జరిగింది. అయితే తమిళనాడు గవర్నర్ మాత్రం ఇది చాలదన్నట్టు ఒక అడుగు ముందుకు వేసి  శాసనసభలో చేసిన వ్యాఖ్యలు గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అగాధాన్ని మరో ఎత్తుకు తీసుకు వెళ్లింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ తరచూ సన్నాయి నొక్కులు నొక్కే తమిళనాడు గవర్నర్‌   శాసనసభలో తాను ప్రసంగించడానికి ప్రభుత్వం తయారు చేసి ఇచ్చిన ప్రసంగంలో కొన్ని వాక్యాలను చదవ లేదు.   తన ‘విచక్షణాధికారం’ నెపంతో వదిలేశారు. 

ఈ వ్యవహారమంతా చినికి చినికి గాలివానగా మారి, గవర్నర్ల పాత్రపై వాడి వేడి చర్చకు తెరలేపింది.  రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ప్రసంగంలో మార్పులు, చేర్పులు చేయడానికి, తనకు తోచిన విధంగా కొన్ని భాగాలను తొలగించడానికి గవర్నర్‌కు హక్కుందా అన్నది పక్కన పెడితే..  నా ప్రభుత్వం అంటూ గవర్నర్ ఆరంభించే ప్రసంగంలో అలా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసంగించడం లేదా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. గతంలో అంటే 2018లో కేరళలో కూడా ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్‌ పి. సదాశి వం తన బడ్జెట్‌ ప్రసంగంలో కొన్ని భాగాలను తొలగించి చదివారు.

కేంద్ర ప్రభుత్వాన్ని, పాలక పక్షాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆ భాగాలను   గవర్నర్‌ చదవకుండా దాటేసినా వాటిని కూడా చదివినట్టుగానే పరిగణిస్తామని అప్పట్లో కేరళ  స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చారు. గవర్నర్‌ తీరుపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. చివరికి దానంతటదే చల్లారింది.  ఇక 2020లో కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌ కూడా ఇదే విధంగా వ్యవహరించారు. సదాశివం, ఆరిఫ్‌ మొహ మ్మద్‌ ఖాన్లు గవర్నర్లుగా ఉన్నంత వరకూ రాష్ట్ర ప్రభుత్వంతో విభేదిస్తూనే వచ్చారు. ఆ కొందరు సంప్రదాయాలను, పద్ధతులను పాటించడానికి ఇష్టపడడం లేదు. దేశ సర్వోన్నత న్యాయస్థానం  ఒక కేసులో   గవర్నర్ల రాజ్యాంగపరమైన అధికారాలను వివరించింది. తాము గవర్నర్లుగా ఉన్న రాష్ట్రానికి తాము కార్య నిర్వాహక అధిపతులే కానీ, వాస్తవంలో మంత్రివర్గమే రాష్ట్రానికి కార్య నిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తుంది.

ఇంత స్పష్టంగా సుప్రీం తీర్పు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో గవర్నర్లు పరిధి మీరడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోవడమేననే చెప్పాలి. ఇక తమిళనాడు గవర్నర్ విషయానికి వస్తే ఆయన కావాలనే తమిళనాడు ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో విపక్ష ఏఐడీఎంకే కూడా తన నిరసనను వ్యక్తం చేసిందంటే గవర్నర్ రవి ప్రసంగం ఎవరికీ నచ్చని విధంగానే ఉందన్నది తేటతెల్లమౌతోంది. 

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.