తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే విజయ్!
Publish Date:May 8, 2026
Advertisement
తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సందిగ్ధతలు తొలగిపోయాయి. టీవీకే విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, సినీ నటుడు విజయ్ అధికార పీఠాన్ని దక్కించుకోనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు. తమిళగ వెట్రి కళగం ఎన్నికల బరిలో దిగి 108 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118కి కేవలం కొన్ని స్థానాల దూరంలో విజయ్ ఆగిపోయారు. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు చిన్న పార్టీల మద్దతు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్షాలు, విడుతలై చిరుత్తైగళ్ కచ్చి (వీసీకే) పార్టీలు విజయ్ కు మద్దతు ప్రకటించాయి. ఈ మూడు పార్టీల మద్దతు లేఖలతో విజయ్ నేరుగా గవర్నర్ రాజేంద్ర అక్లేకర్ తో భేటీ అయ్యారు. భేటీకి ముందే విజయ్ గవర్నర్ కార్యాలయానికి మద్దతు లేఖలు అందజేశారు. తన వద్ద తగినంత మెజారిటీ ఉందని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని విజయ్ ఆ మద్దతు లేఖలతో పాటు గవర్నర్ కు రాసిన మరో లేఖలో కోరారు. దీంతో గవర్నర్ విజయ్‌కు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. గవర్నర్ తో భేటీలో విజయ్ తన బలాన్ని నిరూపించుకునేందుకు మూడు పార్టీల మద్దతు లేఖలను గవర్నర్ కు అందజేశారు.
http://www.teluguone.com/news/content/tamilnadi-cm-tvk-vijay-25-219254.html





