తమిళనాడులో అన్నాడీఎంకేకు మరో షాక్!
Publish Date:May 26, 2026
Advertisement
తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా అంబసముద్రం ఎమ్మెల్యే సుబ్బయ్య కూడా తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన నేరుగా లోక్‌భవన్‌కు వెళ్లి అసెంబ్లీ స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిశారు. అనంతరం తన రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పించారు. సుబ్బయ్య ఇచ్చిన రాజీనామా పత్రాన్ని పరిశీలించిన తర్వాత త్వరలోనే అధికారిక నిర్ణయం వెల్లడిస్తామని స్పీకర్ మీడియాకు తెలిపారు. ఇటీవల రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీవీకే పార్టీలో చేరగా, సుబ్బయ్య కూడా త్వరలోనే ఆ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరుస రాజీనామాలతో అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే వేలుమణి వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లు అసెంబ్లీలో మద్దతు తెలిపాయి.
http://www.teluguone.com/news/content/tamil-nadu-elections-25-220907.html





