తమిళనాడు ఎన్నికల్లో...గెలిచేదెవరు...ఓపీనియన్ సర్వే

Publish Date:Mar 26, 2026

Advertisement

 

2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు. ఇప్పటికే ఐదేళ్ల పాలన తర్వాత డీఎంకే కూటమి ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకతకు తోడు, కొత్త పార్టీ రూపంలో విజయ్ విసురుతున్న సవాళ్లు సీఎం స్టాలిన్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే దీన్ని సొమ్ము చేసుకోవడంలో విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఏ మేరకు ముందుందన్న దానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓట్ వైబ్ సంస్థ ఓట్ ట్రాకర్ పేరుతో నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్‌లో  సంచలన విషయాలను వెల్లడించింది.

మీడియా ఛానల్ సీఎన్ఎన్-న్యూస్ 18కు విడుదల చేసిన ఓట్ వైబ్ ఒపీనియన్ పోల్‌లో ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో హోరాహోరీ ద్విముఖ పోరు తప్పదని తేల్చేసింది. డీఎంకే నేతృత్వంలోని అధికార కూటమి, విపక్ష అన్నాడీఎంకే కూటమి మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తేలింది. ఈ సర్వేలో 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్, సీపీఐ, మరియు సీపీఎంలతో కూడిన డీఎంకే కూటమి 113 నుండి 123 సీట్ల మధ్య గెలుచుకుంటుందని అంచనా వేశారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ప్రత్యర్థి అన్నాడీఎంకే కూటమి కూడా 106 నుంచి 116 సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేశారు. విజయ్ కొత్త పార్టీ టీవీకే 2 నుంచి 8 సీట్ల మధ్య గెలుచుకుంటుందని అంచనా వేశారు..

అటు గత ఐదేళ్లలో డీఎంకే ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. దాదాపు 40% మంది ప్రభుత్వ పనితీరును మంచిది లేదా  చాలా మంచిది అని చెప్పారు. దాదాపు 39% మంది దానిని "పేలవమైనది" లేదా చాలా పేలవమైనది గా చెప్పారు. పురుషులతో పోలిస్తే మహిళలు డీఎంకే ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారు. 55 ఏళ్లు పైబడిన ఓటర్లు అత్యధిక స్థాయిలో ప్రభుత్వపై సంతృప్తి వ్యక్తం చేయగా, 18-24 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్లు కాస్త కోపంగా ఉన్నారు. సామాజిక వర్గాలలో, ఎస్సీ/దళితులు ప్రభుత్వాన్ని అత్యంత అనుకూలంగా చూస్తున్నారు. అయితే అగ్రవర్ణ హిందువులు అత్యంత అసంతృప్తితో ఉన్నారు.

మైనారిటీ వర్గాలు సగటు కంటే ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు. సీఎంగా స్టాలిన్ కు 39.9 శాతం మద్దతివ్వగా, అన్నాడీఎంకే నేత పళనిస్వామి 37.5%తో ఆయన వెనుక ఉన్నారు. పురుషులు పళనిస్వామికి మొగ్గు చూపుతుండగా, మహిళలు స్టాలిన్‌కు మద్దతు ఇస్తున్నారు. ప్రతిపక్ష మహిళా ఓటర్లు ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య చీలిపోయారు. యువ ఓటర్లలో, ముఖ్యంగా 18-24 ఏళ్ల మధ్య వయస్సు వారిలో విజయ్‌కు గణనీయమైన మద్దతు లభిస్తోంది. వయోవృద్ధ ఓటర్లు ఎక్కువగా స్టాలిన్‌కు మద్దతుగా నిలవగా, మధ్య వయస్కులు పళనిస్వామి వైపు మొగ్గు చూపుతున్నారు.

By
en-us Political News

  
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.