తమిళనాడు సీఎం టైమ్లీ యాక్షన్.. నెట్టింట పాజిటవ్ రియాక్షన్.!

Publish Date:Jul 22, 2026

Advertisement

తమిళనాడు సీఎం  విజయ్  పాలనలో  తనదైన ప్రత్యేకత చూపుతున్నారు.  ప్రజలతో మమేకమౌతూ, వారి సమస్యలను స్వయంగా ఆలకిస్తూ.. పీపుల్స్ సీఎం ఇమేజ్‌ సొంతం చేసుకుంటున్నారు. ఏదైన సంఘటన జరిగిన వెంటనే ఆయన రియాక్ట్ అవుతున్న తీరు పట్ల నెటిజనులు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అటువంటి సంఘటన తాజాగా చెన్నై సెక్రటేరియట్ వద్ద జరిగింది.  

 నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా  ప్రముఖ  తేరుకురల్ అరివు  అనే కళాకారుడు చెన్ననై సెక్రటెరియెట్ నిరసనకు దిగారు. అయితే పోలీసులు ఆయన నిరసనను అడ్డుకుని..  ముందస్తు అనుమతి లేకుండా చెన్నైలోని సచివాలయం ప్రాంగణంలోకి వచ్చి   నిరసన తెలిపేందుకు ప్రయత్నించారంటూ  తేరకురల్ అరివును అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చట్టబద్ధంగానే వ్యవహరించారు. అందులో సందేహం లేదు. సెక్రటేరియెట్ వంటి సున్నిత ప్రాంతాలలో అనుమతి లేకుండా నిరసనలు నేరం. ఆ కారణంగానే చెన్నై పోలీసులు అక్కడున్న తమిళనాడు పోలీసులు తక్షణమే స్పందించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

భద్రతా దృష్ట్యా పోలీసులు చట్టప్రకారమే వ్యవహరించినా..   విద్యావ్యవస్థలోని అన్యాయంపై గళమెత్తిన ఒక  కళాకారుడిని అరెస్ట్ చేయడం ఏంటంటూ నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విషయం సీఎం విజయ్ వరకూ వెళ్లడంతో ఆయన క్షణం ఆలస్యం లేకుండా స్పందించారు.   వివాదం ముదరకుండా..  అరెస్టు చేసిన కళాకారుడిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. అక్కడితో ఆగకుండా.. తేరుకురల్ అరివును సచివాలయానికి ఆహ్వానించి  ఆయనతో మాట్లాడారు. 

నీట్ పరీక్షల విషయంలో తన ప్రభుత్వం తీసుకుంటున్న   చర్యలను  అరివుకు వివరించి..  విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విజయ్ తో భేటీ తరువాత  అరివును గౌరవప్రదంగా ఒక మంత్రిని తోడిచ్చి సాగనంపారు.   ప్రజా సమస్యలపై పోరాడే కళాకారుడికి విజయ్ ఇచ్చిన గౌరవం పట్ల నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. 

TVK Government, Therukural Arivu Arrest, NEET Controversy Tamil Nadu, People CM Vijay

By
en-us Political News

  
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందినదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థకు సంబంధించిన మానస హిల్స్ మైనింగ్ వ్యవహారంపై
ఒకప్పుడు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక పరిస్థితిని ఎలా మార్చిందో.. అచ్చం అలాగే.. ఆ మాటకొస్తే అంతకు మించి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రలో ఆర్థిక విప్లవాన్ని తీసుకురాబోతోంది.
బజాజ్ ఫైనాన్స్ క్యూ1 ఆర్థిక ఫలితాల్లో రూ. 5,986 కోట్ల నికర లాభం సాధించడంతో షేరు ధర 6% పైగా దూసుకెళ్లింది. మోతీలాల్ ఓస్వాల్ బై రేటింగ్ ఇచ్చి రూ. 1,300 టార్గెట్ ధార్యాన్ని ప్రకటించిన వేళ సమగ్ర విశ్లేషణ.
Google DeepMind విడుదల చేసిన Gemini Robotics 2.0 సాంకేతికత, 92% విజయవంతమైన హోల్ బాడీ కంట్రోల్, అధునాతన సేఫ్టీ బెంచ్‌మార్క్స్ మరియు విప్లవాత్మక ఫీచర్లతో రోబోటిక్స్ రంగాన్ని ఎలా మార్చేస్తుందో పూర్తిగా తెలుసుకోండి.
టవర్లు లేకున్నా మీ మొబైల్‌కు డైరెక్ట్ సిగ్నల్స్ అందించేందుకు అమేజాన్ 5,105 ఉపగ్రహాలను ప్రయోగిస్తోంది. అమేజాన్ లియో D2D ప్రాజెక్ట్, గ్లోబల్‌స్టార్ డీల్ మరియు లాంచ్ టైమ్‌లైన్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
గత కొన్ని రోజులుగా ఆయన నాడీ వ్యవస్థను, మెదడు పనితీరును సాధారణ స్థితికి తెచ్చేందుకు శ్రమించినప్పటికీ ఫలితం లేకపోయింది.
గూగుల్ క్రోమ్ వినియోగదారులకు గుడ్‌న్యూస్! ఇకపై బ్రౌజర్‌ను అప్‌డేట్ చేయడానికి రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏఐ సహాయంతో 1,072 బగ్స్‌ను సరిచేసి డైనమిక్ ప్యాచింగ్ సాంకేతికతను తీసుకొస్తున్న గూగుల్ విప్లవాత్మక అప్‌డేట్ వివరాలు ఇవే!
ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఆగస్టు 8న ప్రారంభం కానుంది. ఐఫోన్ 17, శాంసంగ్ గెలాక్సీ S25, 4K టీవీలపై భారీ ఆఫర్లు, ఎస్బీఐ కార్డ్‌పై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు ప్లస్ మెంబర్లకు ఆగస్టు 7 నుంచే ఎర్లీ యాక్సెస్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల FPI కొనుగోళ్ల జోరు పెరిగింది. ఒకే రోజులో ₹8,831.1 కోట్ల రికార్డు పెట్టుబడులతో పాటు నిఫ్టీ, సెన్సెక్స్ విశ్లేషణ, ఐపీఓ పెట్టుబడులు మరియు మార్కెట్ ట్రెండ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
MV ఎలక్ట్రోసిస్టమ్స్ IPO రోజువారీ GMP, సబ్‌స్క్రిప్షన్ స్టేటస్, షేరు ధర మరియు రైల్వే ప్రొపల్షన్ ఆర్డర్ బుక్ వివరాలను తెలుసుకోండి. మధురి కేలా మద్దతు ఉన్న ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టవచ్చా లేదా బ్రోకరేజ్ విశ్లేషణ ఇక్కడ చూడండి.
కామన్వెల్త్ గేమ్స్ 2026 డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించిన తల్లి, పీహెచ్‌డీ స్కాలర్ సీమా కాళిరామ్నా స్ఫూర్తిదాయక కథ. 11 నెలల బాబును వదిలి సాధించిన ఈ చారిత్రాత్మక విజయం విశేషాలు చూడండి!
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ శుభారంభం! వెయిట్‌లిఫ్టింగ్ రికార్డుతో లవ్‌ప్రీత్ సింగ్ రజతం సాధించగా, డిస్కస్ త్రోలో సీమా కాలిరామ్నా కాంస్యం గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా ఫైనల్ విశేషాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.