కీలక శాఖలు తన వద్దే ఉంచుకున్న సీఎం విజయ్

Publish Date:May 16, 2026

Advertisement

 

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సిఫార్సు మేరకు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ లోక్ భవన్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి విజయ్ తన వద్ద హోం, పోలీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ వాటర్ సప్లై వంటి కీలక శాఖలను ఉంచుకున్నారు.

టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా మే 10న ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నై జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్.ఆనంద్, ఆదవ్ అర్జున, అరుణ్ రాజ్, సెంగొట్టయ్యన్, బి.వెంకటరమణన్, నిర్మల్ కుమార్, రాజ్ మోహన్, డాక్టర్ టి.కె.ప్రభు, ఎస్.కీర్తనలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.

తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పేదరిక నిర్మూలన, నీటిపారుదల ప్రాజెక్టుల శాఖలను ఎన్.ఆనంద్‌కు అప్పగించారు. పబ్లిక్ వర్క్స్, హైవేస్, మైనర్ పోర్ట్స్, క్రీడల అభివృద్ధి శాఖలను ఆదవ్ అర్జునకు కేటాయించారు. ఆరోగ్యం, మెడికల్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖలను డాక్టర్ కె.జి.అరుణ్ రాజ్‌కు అప్పగించారు. ఫైనాన్స్, పెన్షన్స్ శాఖల బాధ్యతలను కె.ఎ.సెంగొట్టయ్యన్‌కు అప్పగించగా.. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్స్యూమర్ ప్రొటెక్షన్, ప్రైస్ కంట్రోల్ శాఖలను పి.వెంకటరమణన్‌కు కేటాయించారు. 

విద్యుత్, న్యాయ, జైళ్లు, అవినీతి నిరోధక శాఖలను ఆర్.నిర్మల్ కుమార్‌కి కేటాయించారు. స్కూల్ ఎడ్యుకేషన్, తమిళ అభివృద్ధి, సమాచార ప్రచార శాఖ, కల్చర్, ఫిల్మ్ టెక్నాలజీ శాఖలను రాజ్ మోహన్‌కు అప్పగించారు. మైన్స్ అండ్ మినరల్స్ శాఖను డాక్టర్ టి.కె.ప్రభుకు కేటాయించగా.. ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ శాఖల బాధ్యతలను సెల్వి ఎస్.కీర్తనకు అప్పగించారు. ఆయా శాఖలను మంత్రులకు కేటాయిస్తూ లోక్ భవన్ ప్రకటన విడుదల చేసింది.

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.