తమిళ పొత్తులకు.. పురిటి నొప్పులు!

Publish Date:Jun 15, 2025

Advertisement

 

తమిళ నాడు, శాసన సభ ఎన్నికలకు ఇంకా సమయం వుంది. వచ్చే సంవత్సరం  (2026) ఏప్రిల్, మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే, రాష్ట్రంలో ఎన్నికల వేడి మాత్రం,ఇప్పటికే భగ్గుమంటోంది. అధికార విపక్షాలు రెండూ, గెలుపే లక్ష్యంగా, ఇప్పటినుంచే పావులు కదుపుతున్నాయి.ఎత్తులు, పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా, రాష్ట్రంలో గట్టిగా కాలు మోపేందుకు, శత విధాల ప్రయత్నిస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం,ఏపీలో సక్సెస్ అయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్’ ఫార్ములాను రీప్లే’ చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకు, ప్రధాన ప్రతిపక్షం డిఎంకేతో సహా, అధికార అన్నా డిఎంకే  వ్యతిరేక  పార్టీలను, ఏకం చేసేందుకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, స్వయంగా రంగంలోకి దిగారు. 

ముందుగా, రెండు నెలల క్రితమే, అన్నా డిఎంకే, బీజేపీల మధ్య పొత్తు ముళ్ళు వేశారు. అలాగే, సినీ నటుడు విజయ్‌’ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) తోపాటుగా, పీఎంకే తదితర పార్టీలతో జట్టు కట్టేందుకు, పాత, కొత్త మిత్రులను ఎన్డీఎ కూటమిలోకి తెచ్చుకునేందుకు అమిత్ షా, ఢిల్లీ నుంచే పావులు కదుపుతున్నారు.  అయితే, ఇతర పొత్తుల విషయం ఎలా ఉన్నా, అన్నా డిఎంకే, బీజేపీల మధ్య కుదిరిన పొత్తు విషయంలోనే ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, అమిత్ షా పోరోహిత్యంలో ఉభయ పార్టీల నాయకులూ లాంచనంగా, తాంబూలాలు ఇచ్చి పుచ్చున్నా  పొత్తు పీటలెక్కడం అనుమానమే అంటున్నారు.  ముఖ్యంగా ముందు నుంచి,డిఎంకేతో పొత్తు వద్దని వాదిస్తున్న,రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, అన్నామలై, ఆయన్ని ఓ బూచిల చూస్తున్న డిఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడ పళని స్వామిల, మధ్య సంబంధాలు ఉప్పూ నిప్పుల భగ్గుమంటూనే ఉన్నాయి.


తాజాగా, ఎన్నికల అనంతరం ఎన్డీఎ కూటమి గెలిచినా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ప్రసక్తే లేదని, అన్నా డిఎంకే సర్కారే  కొలువు తీరుతుందని పళనిస్వామి చేసిన ప్రకటన, అందుకు బదులుగా అన్నామలై’ఇచ్చిన కౌంటర్’ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజానికి,  పళనిస్వామి, పొత్తు కుదిరిన కొద్ది రోజులకే, కూటమి గెలిచినా సంకీర్ణ కుదరదనే సంచలన ప్రకటన చేశారు. కాగా,ఇప్పడు అన్నామలై’  ‘అవునవును..సంకీర్ణ ప్రభుత్వం కాదు,వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అంటూ, ఎదురు చురక వేశారు.అంతే కాకుండా, ఆయన మరో అడుగు ముందుకేసి, ఈ సారి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు.అలాగే, రాష్ట్రంలో 2026లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పలేనని, రానున్నది బీజేపీ పాలన మాత్రమేనని చెప్పగలనని అన్నామలై పేర్కొన్నారు. అదలా ఉంటే,ఇరు పార్టీలలో పొత్తు వద్దనే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని అంటున్నారు.ఈ నేపధ్యంలో, బీజేపీ, అన్నాడిఎంకే పొత్తుకు పురిటి నొప్పులు తప్పవని అంటున్నారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.