జులై మూడో వారంలో తల్లికి వందనం : మంత్రి లోకేష్

Publish Date:Jun 16, 2026

Advertisement

 

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆరా తీశారు.

 ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశాల పెంపు పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి.. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జులై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు. జూన్ 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జులై మూడో వారంలో మెగా పీటీఎం నిర్వహణకు సమావేశంలో నిర్ణయించారు. మిగులు ఉపాధ్యాయుల పని సర్దుబాటుపైనా సమావేశంలో చర్చించారు.

ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష 

రాష్ట్రంలో ఎప్ సెట్, పాలిసెట్, ఆర్ సెట్ వంటి 12రకాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లకు ఎటువంటి జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత సమయంలో అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే సెట్స్, పొరుగు రాష్ట్రాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ల తేదీలను కూడా గమనంలోకి తీసుకొని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలోని వివిధ సెట్ ల తేదీలను ఖరారు చేయాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపును పరిశీలించాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో మెకానికల్, సివిల్ విభాగాల సీట్లకు డిమాండ్ ఉందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. 

రాష్ట్రంలో ఇంజనీరింగ్ కు సంబంధించి 254 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 1.88లక్షల సీట్ల భర్తీకి గాను ఎప్ సెట్ నోటిఫికేషన్ కు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో యూనివర్సిటీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న థాపర్ ఇనిస్టిట్యూట్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, మెల్ బోర్న్ యూనివర్సిటీ, మేధావి స్కిల్ యూనివర్సిటీ, జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలతో చర్చల పురోగతిపై మంత్రి సమీక్షించారు.  జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు ను వేగవంతం చేయాల్సిందిగా మంత్రి లోకేష్ ఆదేశించారు.

 రాష్ట్రంలో ఎన్‌సీసీ కార్యకలాపాలు, శిక్షణ, క్యాంపులు సమన్వయం చేయడానికి ఎన్‌సీసీ (NCC) స్టేట్ డైరెక్టరేట్‌'ను మంజూరు చేసిన కేంద్రప్రభుత్వానికి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎన్‌సీసీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ యువతకు మరింత సైనిక శిక్షణ, ప్రోత్సాహం అందించడానికి ఈ ప్రత్యేక కేంద్రం ఉపకరించగలదని అన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జే.శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఉన్నతవిద్య కమిషనర్ నారాయణ్ భరత్ గుప్తా, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిత అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రముఖ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.   ఆమె భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నైలోని తేనాంపేట, సెంట్ ఆఫ్‌ రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుంది.. !
రాష్ట్రపతికి సునీత లేఖ తర్వాత కేసును ఈడీ టేకాఫ్..!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది.
 ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  
 సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి   3.5 నాటికల్ మైళ్ల   దూరంలో ఎనిమిది మంది సాయుధులైన సోమాలియా పైరేట్లు   నౌకపైకి విరుచుకుపడి, దానిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నౌకను నుగాల్ తీరం వైపు  మళ్లించారు.
లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన  షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.