పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల నడుమ నడుస్తున్న ప్రచ్ఛన్నయుద్ధం.. ఇప్పుడు ప్రత్యక్ష వైమానిక దాడులకు దారి తీసింది. రెండు మూడు రోజుల కిందట ఆఫ్ఘన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులకు ప్రతీకార దాడులకు దిగింది పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుంటూ వెళ్లేలా అధునాతన డ్రోన్లతో తాలిబన్ దళాలు విరుచుకుపడ్డాయి. ఈ ఆకస్మిక ప్రతిదాడితో పాక్ రక్షణ విభాగాలు అప్రమత్తమయ్యాయి. డ్యూరాండ్ లైన్ సరిహద్దు రీజియన్ ఇప్పుడు ఇరు దేశాల క్షిపణులు, డ్రోన్ల దాడులతో అట్టుడుకుతోంది.
పాకిస్థాన్‌లోని వ్యూహాత్మక ప్రాంతాలైన బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుని ఆప్ఘనిస్థాన్ దాడులకు పాల్పడింది. అయితే తాలిబన్ ప్రభుత్వం.. తాము పాక్ సైన్యంపై కాకుండా, అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ అంటే ఐసిస్-కే ఉగ్రవాద ముఠాల టార్గెట్ గా దాడులకు పాల్పడినట్లు ప్రకటించింది.
ఆఫ్ఘనిస్థాన్‌లో అమాయక పౌరులను బలితీసుకుంటున్న విద్రోహ చర్యలన్నింటికీ పాక్ భూభాగంలో ఉన్న ఈ రహస్య స్థావరాల నుంచే ప్రణాళికలు రూపొందుతున్నాయని పేర్కొంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఒక పాఠశాల భవనాన్ని ఐసిస్ ఉగ్రవాదులు తమ అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్ కోసం వాడుకుంటున్నారని గుర్తించి, దానిని డ్రోన్లతో ధ్వంసం చేసినట్లు ఆఫ్ఘన్ చెందిన ప్రముఖ మీడియా సంస్థ టోలోన్యూస్ వెల్లడించింది. ఈ మెరుపు దాడిలో పలువురు కరడుగట్టిన ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారని, స్థానిక పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తాలిబన్ ప్రతినిధులు ప్రకటించారు.
ఇటీవల పాక్ వైమానిక దళం ఆఫ్ఘన్ సరిహద్దు దాటి జరిపిన దాడుల్లో భారీ ఎత్తున ప్రాణనష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితి అధికారిక నివేదిక ప్రకారం, ఆ పాక్ దాడుల వల్ల 28 మంది ఆఫ్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, పాకిస్థాన్ రక్షణ దళాలు మాత్రం తాము పౌరులను కాదని, తమ ఆపరేషన్‌లో 29 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను ఖతం చేశాయని చెప్పాయి. చెప్పుకొచ్చాయి. పాక్ ప్రకటనను ఖండించిన తాలిబన్ ప్రభుత్వవం వాస్తవానికి ఐక్యరాజ్యసమితి అంచనాల కంటే పాక్ దాడుల వల్ల జరిగిన నష్టం చాలా ఎక్కువ అని పేర్కొంది. ఆ ఈ దారుణానికి ప్రతీకారంగానే తాము ప్రతిదాడులకు పాల్పడినట్లు తాలిబన్ ప్రభుత్వం పేర్కొంది. సరిహద్దుల్లో నెలకొన్న ఈ భయానక వాతావరణంపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా భారత్ ఈ వ్యవహారంలో అత్యంత వేగంగా స్పందిస్తూ పాకిస్థాన్ వైఖరిని తీవ్రస్థాయిలో తప్పుబట్టింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/taliban-drone-attacks-on-pakistan-36-224706.html
ఝార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఒక అసాధారణ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు, పేదరిక నిర్మూలనకు అత్యంత కీలకమైన సాధనంగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
రౌడీషీటర్ కేసు చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందనీ, ఈ కేసును బలవంతంగా ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాని అన్నారు. ఒక పోలీసు అధికారి అయి ఉండి, తోటి విభాగాల నుంచే తనకు ప్రాణభయం ఉందంటూ ఆక్ష్న న్యాయస్థానంలో మొరపెట్టుకోవడం సంచలనం రేపింది.
యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమకు కనీస సమాచారం కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను, ముఖ్య నాయకులను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన బాహాటంగా తన నిరసన వ్యక్తం చేశారు.
లారీలు ఢీకొన్న వేగానికి వెంటనే మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవదహనమయ్యారు.
నెట్‌వర్క్ ఆసుపత్రుల నుండి క్యాష్‌లెస్ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నారు. అయితే, జూన్ 30, అంతకంటే ముందు ఆసుపత్రులలో చేరిన పాత రోగులకు మాత్రం వారు డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ పథకం కింద చికిత్స కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. జూలై 1 నుండి కొత్తగా ఎలాంటి అడ్మిషన్లను అనుమతించవద్దని అన్ని అనుబంధ ఆసుపత్రులకు, యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నాని పాత కేసుల ఫైళ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ హయాంలో చేసిన వ్యాఖ్యలు, చేష్టలపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తాజాగా 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై అప్పట్లో నమోదైన కేసులో చర్యలు తీసుకునేందుకు పోలీసలు సిద్ధమయ్యారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మాధవీలత.. ఇప్పుడు క్రీడా రంగంలో ప్రతిభ చాటారు.
బస్సు అతి వేగంగా వెడుతుండటంతో.. ప్రమాద తీవ్రతకు ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి చూస్తుండగానే బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు సజీవ దహనమయ్యారు.
Publish Date:Jun 30, 2026
ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ఇరు నేతలు గుర్తుచేసుకున్నారు. రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, రవాణా రంగాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురూ భావించారు. ఇటీవల భారతదేశం అత్యంత విజయవంతంగా నిర్వహించిన బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం పట్ల ముసూద్ హర్షం వ్యక్తం చేశారు.