Publish Date:Jun 23, 2022
ఇరువైపులా సమస్యలు తలెత్తినపుడు సామరస్యంగా పరిష్కరించుకోవడం మేలు. కానీ తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ఫెడరేషన్ మధ్య వివాదం ముదిరింది. ఈ విషయమై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇరువైపుల పెద్దలతో మట్లాడి పంతాలకు పోయి సమస్యను మరింత పెద్దది చేసుకోవద్దని నచ్చజెప్పారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంతాలు, పట్టింపులు వద్దని చెప్పానని పేర్కొన్నారు. రెండు వైపులా సమస్యలు ఉన్నాయన్నారు. కార్మికులకు సమస్యలు ఉన్నాయని.. కరోనాతో వేతనాలు పెరగలేదన్నారు. ఇరు వర్గాలు షూటింగ్స్ పైన రెండు రకాలుగా మాట్లాడుతున్నారన్నారు. సామరస్యంగా సమస్య పరిష్కారం చేసుకోవాలన్నారు. రెండు వర్గాలకు న్యాయం జరగాలంటే.. ఇరు వర్గాలు కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు.
సినీరంగంలో పనిచేసే 20 వేలకు మించి వున్న కార్మికులు తమ జీత భత్యాలు పెంచాలన్నడిమాండ్‌తో సమ్మెకు దిగారు. బుధవారం అనేకమంది సినీ కార్మికులు హైదారబాద్ జూబ్లీ హిల్స్‌లోని సినీ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి తమ వేతనాలను 45 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూభారీ నినాదాలతో హోరెత్తించారు. అయితే ఫెడరేషన్, సినీ నిర్మాతల మండలి సమావేశంలోనే అది నిర్ణయించే అవకాశం వుందని, ప్రస్తుతం 30 శాతం మేరకు పెంచడానికి అవకాశం వుంటుందని ఫెడరేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వారికి నచ్చజెప్పారు. కానీ అది వెంటనే అమలు అవుతుందన్నది స్పష్టం చేయలేదు.
కోవిడ్-19 కారణంగా సినీ కార్మికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నామని ఈ పరిస్థితుల్లో వేతనాలను పెంచాల్సిన అవసరం వుందని వారు గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యల గురించి తెలుగు ఫిలిమ్‌ఛాంబర్ తో చర్చిస్తున్నా ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్మికుల సమ్మె వల్ల సుమారు 20 చిత్రాల నిర్మాణం నిలిచిపోయింది. అయితే కార్మికులు సమ్మెకు దిగడం సమంజసం కాదని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికే మొగ్గు చూపాలని సీనియర్ నటుడు నరేష్ కార్మికులను కోరారు. సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తరఫున మంత్రి తల సాని శ్రీనివాస్ యాదవ్ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/talasani-says-to-solve-problem--39-138268.html
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.