ఒత్తిళ్ళకి లొంగద్దు.. ప్రొటోకాల్ ను విస్మరించొద్దు : రఘురామ

Publish Date:Jul 1, 2022

Advertisement

రఘురామకృష్ణం రాజు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. పేరుకు వైసీపీ ఎంపీయే అయినా నిత్యం సొంత పార్టీపై, ఆ పార్టీ అధినేతపై విమర్శలతో చెలరేగుతుంటారు. రచ్చబండలో తమ పార్టీ, ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతుంటారు. అలా అని పార్టీ నుంచి ఆయనను బహిష్కరించే ధైర్యం, సాహసం జగన్ చేయడం లేదు. అలాగనీ మనవాడే కదా.. ఏదో మాట్లాడుతున్నారు పోనీలే అని వదిలేయడమూ లేదు.

ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను చెవినిల్లు కట్టుకుని మరీ కోరుతున్నారు. అయితే ముఖ్యమంత్రిని విమర్శించడం, సొంత పార్టీ విధానాలలో తప్పులను ఎత్తి చూపడం అనర్హత కిందకు రాదని లోక్ సభ కార్యదర్శి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి పడలేక గింజుకుంటున్నారు. కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారఘురామరాజు బెదరడం లేదు. అరెస్టు చేసి భౌతికంగా హింసించినా మరింత రాటు దేలారు కానీ దారికి రాలేదు. అలాంటి రఘురామ రాజుకు ఇప్పుడు తన సొంత నియోజకవర్గంలో ఆవిష్కరిస్తున్న అల్లూరి సీతారామరాజు విగ్రహం ఫలకంపై తన పేరు లేకుండా చేయడానికి  సొంత పార్టీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడాన్ని సహించ లేకపోతున్నారు.

కక్ష సాధింపు చర్యలలో భాగంగానే తన నియోజకవర్గంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా  అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహవిష్కరణ ఫలకంపై తన పేరు లేకుండా చేయడం ఎంత మాత్రం తగదని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 4న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ ఫలకంపై తన పేరు ఉండి తీరాలనీ, బీమవరం ఎంపీగా తన పేరు ఫలకంపై ఉండటం ప్రాటోకాల్ ప్రకారం తప్పని సరి అని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తన ఉనికిని లేకుండా చేయడానికి రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే ఆయన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తన సొంత నియోజకవర్గ కేంద్రం  భీమవరంలో ప్రధాని నరేంద్రమోడీ  ఈ నెల 4న ఆవిష్కరించనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ఫలకంపై తన పేరు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర మంత్రిత్వ శాఖ పై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని రఘురామకృష్ణం రాజు ఆ లేఖలో పేర్కొన్నారు.

తాను ఈ కార్యక్రమానికి హాజరౌతున్నట్లు ఆయనా లేఖలో పేర్కొన్నారు. ప్రొటోకాల్ నింబంధనల ప్రకారం ఫలకంపై తన పేరు ఉండాలనీ, ఎవరి ఒత్తిడులకూ  లొంగి ఫలకంపై తన పేరు లేకుండా చేయవద్దని ఆయనా లేఖలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.