శరీరంలో రక్తం తక్కువ ఉంటే.. ఈ లక్షణాలు కనిపిస్తాయి..!
Publish Date:Mar 29, 2025
Advertisement
మనిషిలో ప్రాణ శక్తి అంతా రక్తంలోనే ఉంటుంది. రక్తం శరీరంలో ప్రవహిస్తూ ఉంటేనే మనిషి జీవితం కొనసాగుతుంది. అయితే చాలా మంది రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు ఎక్కువ శాతం రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు. రక్తహీనత అంటే శరీరంలో తగినంత రక్తం లేకపోవడం. అంటే శరీరంలో హిమోగ్లోబిన్ లోపించడం. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో 12 పాయింట్లకు పైగా హిమోగ్లోబిన్ ఉండాలని వైద్యులు చెబుతారు. అయితే తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే మహిళలలో కొన్ని రకాల లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. చర్మం... ముఖం తెల్లగా మారడం మొదలైతే చాలా మంది తాము మంచి రంగుకు మారుతున్నాం అని పొరబడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇది రంగు మారడం కాదు అది శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల చర్మం రంగు గణనీయంగా మార్పుకు లోనవుతుంది. చర్మం ఎర్రగా ఉంటే శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత ఉన్నట్టు అర్థం. పొడిబారడం.. ముఖం మీద చర్మం పొడిగా మారితే అది శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది చర్మం పొడిబారడానికి కారణమవుతుంది. నల్ల మచ్చలు.. ముఖం మీద కళ్ళ చుట్టూ నల్లటి మచ్చలు కనిపించడం మొదలైతే రక్త పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో రక్తం లేకపోవడానికి అతిపెద్ద సంకేతం నల్లటి వలయాలు లేదా నల్ల మచ్చలు. హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవడం ద్వారా శరీరంలో రక్తం ఎన్ని పాయింట్లు ఉందో తెలుసుకోవచ్చు. మొటిమలు రక్తం లేకపోవడం వల్ల ముఖం మీద మొటిమలు సమస్య రావచ్చు. ఎందుకంటే తక్కువ రక్తంలో టాక్సిన్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఇది మొటిమలు వంటి సమస్యలను కలిగిస్తుంది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/symptoms-of-iron-deficiency-34-195202.html





