ఈ లక్షణాలు కనిపిస్తే శరరీంలో రోగనిరోధక శక్తి తగ్గినట్టే!

Publish Date:Dec 14, 2023

Advertisement

​శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం. చాలావరకు చలికాలంలో జబ్బులు, అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే అధికశాతం మంది రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి  కషాయాలు,  రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు, చ్యవనప్రాశ్ వంటి లేహ్యాలు వాడతారు. అయితే శరీరంలో రోగనిరోధక శక్తి  లోపిస్తే శరీరం కొన్ని లక్షణాలను వ్యక్తం చేస్తుంది. ఆ లక్షాలేవీ లేకుండా ఊరికే ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు, పానీయాలు అతిగా తీసుకోవడం కూడా సమస్యను తెచ్చిపెడుతుంది. శరీరం అసౌకర్యానికి గురవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందనడానికి కనిపించే కొన్ని లక్షణాలేంటో తెలుసుకుంటే..

ఒత్తిడి, నిరాశ..

ఒత్తిడి, నిరాశ మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్లే సంభవిస్తాయి. ఒత్తిడి శరీరంలో తెల్లరక్తకణాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇవి శరీరానికి ఆర్మీ ఫోర్స్ లాంటివి.  ఇన్ఫెక్షన్లతో పోరాడి వాటిని విచ్చిన్నం చేసేది ఇవే. కాబట్టి ఒత్తిడి, నిరాశ అనేవి శరీరంలో తెల్లరక్తకణాలు తగ్గాయనడానికి సూచన,  తెల్లరక్తకణాలు లోపిస్తే రోగనిరోధక శక్తి లోపించింది అనడానికి సూచన.

జలుబు, దగ్గు..

చలికాలంలో రెండు నుండి మూడు సార్లు జలుబు, దగ్గు రావడం సహజమే. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ వ్యాధులతో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి 3 నుండి 4 రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత శరీరం సమస్యల నుండి కోలుకోవడానికి 6 నుండి 8 రోజుల సమయం పడుతుంది. కానీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఎక్కువ రోజులు జలుబు, దగ్గు వేధిస్తాయి.

చెవి సమస్యలు..

చెవి సమస్యలు చాలామందిలో వాతావరణ మార్పుల వల్ల కలుగుతుంటాయి. సంవత్సరంలో నాలుగు సార్లకు మించి చెవి సమస్యలు వస్తున్నా, సంవత్సరంలో రెండు సార్లకు మించి న్యుమోనియా వస్తున్నా రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉన్నట్టు లెక్క. ఇలాంటి సమస్యలు వస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యంగా ఉేండకూడదు.

కడుపు సమస్యలు..

ప్రతి వ్యక్తి రోగనిరోధక శక్తి 70శాతం జీర్ణవ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. జీర్ణవ్యవస్థ వల్లే బాక్టీరియా, సూక్ష్మజీవుల ఇన్పెక్షన్ల  నుండి ప్రేగులను రక్షిస్తాయి. మలబద్దకం, అతిసారం వంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్టైతే  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం.

గాయాలు..

శరీరంలో గాయాలు నయం కావడంలో ఇబ్బందులుంటే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నట్టు అర్థం. చాలావరకు కాలిన, తెగిన, పడినప్పుడు తగిలిన గాయాల్లాంటివి  రోగనిరోధక శక్తి బాగుంటే అవే తొందరగా తగ్గిపోతాయి. కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఇవి తొందరగా మానవు. కొన్నిసార్లు అవి పుండ్లుగా మారి పెద్ద సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉండచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉందనడానికి ఇది కూడా కారణం.

                                      *నిశ్శబ్ద.

By
en-us Political News

  
మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది...
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి,  ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం..
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా..
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు...
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం..
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల..
వేసవి కాలం వచ్చిందంటే చల్లదనాన్ని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. అందులో భాగమే ఈత కూడా.. ఇప్పట్లో చిన్న పట్టణాల నుండి పెద్ద నగరాల వరకు చాలా చోట్ల స్విమ్మింగ్ ఫూల్ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు...
ఆరోగ్యంగా ఉండటానికి నీరు త్రాగడం మంచిదని చెబుతారు.  నీకు ఎంత తాగితే ఆరోగ్యం అంత బాగుంటుందని కూడా చెబుతారు. ఆరోగ్య  నిపుణులు రోజుకు  8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగాలని సిఫార్సు చేస్తున్నారు...
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కోరకం కూరగాయలలో ఒకో రకం పోషకాలు ఉంటాయి.  కొన్ని రకాల కూరగాయలు ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తాయి.  అలాంటి కూరగాయలలో బ్రోకలీ కూడా ఒకటి.  చూడటానికి ఆకుపచ్చ రంగులో..
మండే వేసవి ఎండ నుండి తప్పించుకోవడానికి గంటల తరబడి ఏసీ ముందు కూర్చోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇది సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఈ అలవాటు  శరీరంపై రహస్యంగా..
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు...
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.