జగన్ హయాంలో ‘అసలు స్వరూపా’నంద!

Publish Date:Jun 17, 2024

Advertisement

గత ఐదేళ్ల కాలంలో జగన్ హయంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాడులు అన్నీ  ఇన్నీ కాదు. జగన్ హయాంలో అక్రమార్జన, ప్రభుత్వ ధన దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో ఇప్పుడు అంటే  జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. నిబంధనలను తోసి రాజని జగన్ తన అస్మదీయులకు, అనుయాయులకు అప్పనంగా  ప్రభుత్వ ధనాన్ని దోచి పెట్టేశారు. రాష్ట్రంలో రోడ్లపై ఉన్న గుంతలు పూడ్చడానికి  పైసా విదల్చని జగన్ ప్రభుత్వం తన అనుయాయులకు మాత్రం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టింది. అలా జగన్ హయాంలో ఆయాచితంగా కోట్ల రూపాయల మేర లబ్ధి పొందిన వారిలో, అనుచిత ప్రయోజనం పొందిన వారిలో స్వరూపానంద స్వామి కూడా ఉన్నారు. 

ఔనుజగన్ హయాంలో  ప్రజాధనంతో విలాస జీవితాలు గడిపిన వారిలో  వైసీపీ నాయకులే కాదు.. వారితో పరిచయం, కొద్ది పాటి స్నేహం ఉన్నవారు కూడా ఉన్నారు. మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తిన్నారన్నట్లు.. జనం సొమ్ముతో జల్సాలు చేసుకున్న వారిలో స్వరూపానంద స్వామి ఒకరు. జగన్ హయాంలో  ఆయనకు సకల సౌకర్యాలూ నడిచివచ్చేశాయి.  జగన్  హయాంలో అర్హతలు లేకపోయినా స్వరూపానంద స్వామికి వై కేటగరి సెక్యూరిటీని ప్రభుత్వం కల్పించింది.  పెందుర్తిలోని ఆయన పీఠం నలుగురు గన్ మెన్లతో పికెట్ ఏర్పాటు చేసింది. దీనిని పర్యవేక్షించడానికి అదనంగా ఒక ఎస్ ఐను నియమించింది. ఒక ప్రొటోకాల్ కారును సైతం కేటాయించింది.

స్వరూపానంద స్వామికి నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన ఈ ఏర్పాట్ల కారణంగా ప్రభుత్వానికి నెలకు 18 నుంచి 24 లక్షల ఖర్చు అయ్యేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులు స్వరూపానంద స్వామికి భద్రతను తొలగించారనుకోండి అది వేరే సంగతి. ఇక తన భద్రతా సిబ్బందితో స్వరూపానంద దురుసుగా ప్రవర్శించేవారన్న ఆరోపణలు ఉన్నాయి5. స్వరూపానంద ఆగడాలు ఇంతటితో ఆగలేదు. ఆయన తిరుమల వెళ్లిన ప్రతి సారి ఘాట్ రోడ్డుపై తన వాహనాన్ని వేగంగా నడపాలని డ్రైవర్ ను ఆదేశించేవారు. అలిపిరి నుంచి తిరుమలకు పదిహేను నుంచి ఇరవై నిముషాలలో వెళ్లా4లని ఒత్తిడి తెచ్చేవారట.

నిబంధనల మేరకు అలిపిరి నుంచి తిరుమల వరకూ ఏ వాహనమైనా సరే 45 నిముషాల కంటే తక్కువ సమయంలో వెళ్లేందుకు వీలులేదు. కానీ ముఖ్యమంత్రి జగన్ కు గురువు అన్న ఒకే ఒక్క కారణంతో అధికారులు స్వరూపానంద ఆగడాలను చూసీ చూడనట్లు వదిలేసేవారు. స్వరూపానంద అరాచకాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. 

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.