రమేష్ ఆసుపత్రి సరే.. పద్మావతి ఆసుపత్రి సంగతేమిటి?

Publish Date:Oct 5, 2020

Advertisement

యాజమాన్య నిర్లక్ష్యంతో మహిళా ఉద్యోగి మృతి

 

మరి కాంట్రాక్టరుపై చర్య తీసుకుంటారా?

 

ఆ ఆసుపత్రికి సీఎం చైర్మన్, మంత్రి, టీటీడీ చైర్మన్లే సభ్యులు

 

మరి వారిపైనా రమేష్ మాదిరిగానే కేసులు పెడతారా?

 

న్యాయం అందరికీ ఒకటే. చట్టం అందరికీ సమానమే. వాటిని పక్షపాతం లేకుండా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. మరి అలాంటి చట్టాలు-న్యాయాన్ని, అధికారులు పక్షపాతం లేకుండా అమలుచేస్తున్నారా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. కొద్ది నెలల క్రితం విజయవాడలో రమేష్ ఆసుపత్రి, కోవిద్ సెంటర్ కోసం ఒక హోటల్‌ను లీజుకు తీసుకుంది. ఆ హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించి, రోగులు మృతి చెందారు. దానిపై ఆగమేఘాలపై స్పందించిన సర్కారు, దానిపై విచారణ  కమిటీ వేసింది. రమేష్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని నివేదిక ఇచ్చింది. దానితో  రమేష్‌ను అరెస్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దానిపై హైకోర్టుకు వెళిన రమేష్ , స్టే తెచ్చుకున్నారు. ఇది పాత కథే.

 

తాజాగా తిరుపతిలోని స్విమ్స్‌కు చెందిన పద్మావతి కోవిడ్ సెంటర్‌లో ఓ ప్రమాదం సంభవించింది. ఆ ఘటనలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని మృతి చెందగా, ఇద్దరు కరోనా పేషెంట్లు గాయపడ్డారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకుంటుంది? జరిగిన ఘటన ప్రభుత్వానికి చెందిన ఆసుపత్రిదే కాబట్టి.. అధికారులపై తీసుకుంటారా? లేక రమేష్ ఆసుపత్రి తరహాలోనే, దానికి చైర్మన్లు, డైరక్టర్లుగా ఉన్న పాలకులపై తీసుకుంటారా అన్నది ప్రశ్న.

 

తిరుపతి పద్మావతి కోవిడ్ సెంటర్‌లో, రెండో బ్లాక్‌లో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పైన పనులు జరుగుతున్నప్పుడు, కింద ఉండే వారి కోసం రక్షణ చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఆ మేరకు ఇనుప కంచెలాంటిది ఏర్పాటుచేయవలసి ఉంది. కానీ, అక్కడ అలాంటి జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలే లేవు. ఒకవేళ అలాంటి చర్యలు తీసుకుంటే, ఓ గర్భిణి మృతి చెందేది కాదు. మరో ఇద్దరు గాయపడేవారు కాదు. స్విమ్స్ ఆసుపత్రి టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోంది. దానికి స్వయంగా ముఖ్యమంత్రి చైర్మన్ కాగా, టీ టీడీ ైచె ర్మన్, ఆరోగ్యశాఖ మంత్రి, టీ టీడీ ఈవోలు డైరక్టర్లుగా వ్యవహరిస్తుంటారు. చనిపోయిన మహిళ మృతి అత్యంత విషాదకరం. రాధిక అనే కాంట్రాక్టు ఉద్యోగి 5 మాసాల గర్భిణి. ఇప్పటికే ఇద్దరు చిన్నారులు మృతి చెందటంతో, ఆమె మూడోసారి గర్భం దాల్చింది. భవన నిర్మాణంలో చూపిన నిర్లక్ష్యం వల్ల,  చివరకు ఇప్పుడు ఆమె మృతి చెందటం బాధాకరం.

 

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే  సదరు బిల్డరుకు, భవన నిర్మాణ కాంట్రాక్టు లభించింది. కానీ ఒక సబ్ కాంట్రాక్టరుతో పనులు చేయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా జరిగిన ఘటనకు కాంట్రాక్టరూ బాధ్యుడే. కానీ, ఆసుపత్రికి చైర్మన్ ముఖ్యమంత్రిగా ఉండటం, అందులో మంత్రి, టీటీడీ చైర్మన్ పాటు ఉన్నతాధికారులు కూడా,  సభ్యులు కూడా కొనసాగుతున్నారు. కాబట్టి.. బెజవాడలో రమేష్ ఆసుపత్రి,  లీజుకు తీసుకున్న హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో తీసుకున్న చర్యలే,  తిరుపతి ఘటనలోనూ తీసుకోవలసి ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రుల విషయంలోనే అంత కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం.. మరి తన అధీనంలో ఉన్న ఆసుపత్రిలోనే ఘటన జరిగితే అంతకంటే వేగంగా-కఠినంగా వ్యవహరించాలి కదా? మరి న్యాయం-చట్టం  అందరికీ సమానమే కదా? 

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.