వివేకా హత్య కేసులో సాక్షుల భద్రతపై ఏపీ సర్కార్ కు సుప్రీం అక్షింతలు
Publish Date:Oct 14, 2022
Advertisement
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ బయట విచారించాలని ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు సాక్షుల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసు తీవ్రతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ స్పందన లేదని వ్యాఖ్యానించింది. సాక్షులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించలేని దుస్థితిలో ఉందని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా 1+1 భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పగా, అది సరిపోతుందా అని ప్రశ్నించింది. ఈ కేసు విషయంలో మీ(రాష్ట్ర ప్రభుత్వం) తీరు ఎలా ఉందో అర్దమౌతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానదరెడ్డి హత్య కేసులో సాక్షుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సాక్షులకు భద్రత కల్పించే విషయంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని విస్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని.. సాక్షులకు ఏమైనా జరిగితే పరిస్థితేంటని నిలదీసింది. ఈ దశలో సాక్షులకు ఉన్న ముప్పు వివరాలను కోర్టుకు సమర్పించామని, ఇప్పటికే ఇద్దరు సాక్షులు మరణించారని సునీత తరఫు న్యాయవాది పేర్కొన్నారు. తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదావేసింది. కాగా ఈ కేసులో ఇంప్లీడ్ అవుతామని కోరుతూ వివేకా బంధువు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. కాగా ఇదే కేసులో ఇంప్లీడ్‌కు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన దరఖాస్తును అనుమతించింది.
http://www.teluguone.com/news/content/supreme-serious-on-ap-government-about-decurity-of-vitneses-in-viveka-murder-case-25-145450.html





