Publish Date:Aug 18, 2022
అసలు ఉచితం అంటే,సంక్షేమం అంటే కనీసం అవి తీసుకుంటున్న ప్రజలకి తెలుసా?రాజకీయ పార్టీ లు తాము అధికారం లోకి రావడం కోసం ప్రజలని పథకాల పేరు తో ఉచితాలకి అలవాటు చేసారు. ఏది ఉచితమో.. ఏది సంక్షేమమో నిర్ణయించడం కష్ట సాధ్యమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిందంటేనే అర్ధం అవుతోంది రాజకీయ పార్టీ లు ఉచితాల ను ఎంతగా సంక్షిష్టం చేశాయో.
అశ్వనీకుమార్ ఉపాధ్యాయ అనే న్యాయవాది దాఖలు చేసిన ” ఉచితాల రద్దు ” పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు తాము అమలు చేస్తున్నవి ఉచితాలు కాదని,సంక్షేమ పథకాలని వాదించాయి. వాదనలు విన్న సుప్రీంకోర్టు హామీలు ఇవ్వకుండా నిరోధించలేమని స్పష్టం చేసింది. అలాగే ఏది ఉచితమో ఏది సంక్షేమమో నిర్దుష్టంగా నిర్వచించలే మనీ పేర్కొంది.
నిజానికి ఇలాంటి సమస్యకు సుప్రీంకోర్టు పరిష్కారం చూపిస్తుందేమో అనుకున్నారు. ప్రజల దగ్గర పన్నుల రూపం లో వసూలు చేసిన డబ్బును మళ్లీ వాళ్ళకే పథకాల రూపంలో ఇవ్వడం ప్రజలని సోమరిపోతుల్ని చేయడమే అని, ఉచితల వల్ల రాజకీయ పార్టీ లు అధికారం పొందుతాయోమో గాని దేశం లో అభివృద్ధి కుంటుబడుతుందని ప్రదాని మోడీ ఇటీవలే ఒక సందర్భంలో పేర్కొన్నారు.అయితే రాజకీయ పార్టీలు ఆ డబ్బులకు వివిధ పేర్లు పెట్టి ఆ వర్గాలు బాగుపడకూడదా అంటూ ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఎవరూ పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. తమ అధికారం కోసం ప్రజల జీవితాల్ని అంధకారం చేసి తాము వేల కోట్లు కూడబెట్టుకుంటే వచ్చే ప్రయోజనమేంటో ఆలోచించాలి.
ఈ విషయాన్నీ ప్రజలు కుడా ఆలోచించాలి. ఇచ్చే ఉచితపదకాలు తమ తర్వాతి తరాలు భవిష్యత్తు ని నాశనం చేస్తాయని తెలుసుకోవాలి.సుప్రీమ్ కోర్ట్ కూడా ఈ విషయం మీద తీర్పు చెప్పడానికి ఆలోచించింది అంటే ఉచితం అనే పదం ఎంత ప్రభావితం చేస్తోందో,రాజకీయ నాయకులూ దేశ అత్తున్నత న్యాయ స్థానాన్ని ఎంతప్రభావితం చేస్త్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. దీన్ని అంతం చేయాలంటే పాలకులు రాజకీయ నేతల్లోనే మార్పు రావాలి అనుకుంటే కాదు. ఉచిత పథకాల లబ్ధిదారుల్లోనూ మార్పు రావాలి. ఉచితాల వల్ల నాశనం అయిన దేశాలని మన కళ్ళ ముందు చూస్తున్నాం ఇప్పటికైనా ప్రజలు,ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకుని జరగబోయే నష్టాన్ని ఆపాలి.దీనికి ఏ న్యాయ స్థానం అవసరం లేదు.ప్రజలలో మార్పు రావాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-says-freebees-problem--complexity-39-142167.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.