Publish Date:Apr 27, 2025
గత ప్రభుత్వం హయాంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండాలని కుట్ర పన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందనేది సీఐడీ ఆరోపణ. ఇది నిజం అనేలా పలు రకాల ఆధారాలు సైతం సేకరించింది. ఇందులో పాత్ర ఉందని అనుమానాలు ఉన్న వారికి సంబంధించిన సీడీఆర్ ఫైల్స్ ను సంపాదించిన సిట్ యాక్షన్ లోకి దిగింది. తొలుత సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అయినా , అర్థరాత్రి వరకు పనిచేసిన ఉద్యోగి గౌతమ్ తేజ్ ను అరెస్టు చేశారు. అక్కడే పని చేస్తున్న మాజీ ఆర్డీవో, ఆర్డీవో ఇతర అధికారుల పై సైతం చర్యలు తీసుకున్నారు.
Publish Date:Apr 27, 2025
ఉగ్రదాడికి భారత్ గట్టి బదులే ఇస్తుంది. అది మరెవ్వరూ ఊహించనదిగా ఉంటుంది. ఇదీ మోడీ పహెల్గామ్ అటాక్ తర్వాత చేసిన కామెంట్. మోడీ ఇంత సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదే మొదటి సారి. అయితే ఇప్పటికే సింధూ జలాల ఒప్పందం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని మోడీ. యుద్ధం చేయడం కంటే నీళ్లు ఆపడం అతి పెద్ద యుద్ధం. దీని సాధ్యాసాధ్యాలు వచ్చే రోజుల్లోగానీ తెలీదు. అలాగని ఇదే చాలనుకున్నా కష్టమే. ఎందుకంటే ఇందుకు కావల్సినంత టైం తీస్కుంటుంది. ఈలోగా ఇలాంటి ఎన్నో ఉగ్రదాడులు జరిగే అవకాశం కూడా ఉంది. దానికి తోడు ఇదే అంశంపై లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయిద్ మీరు మా నీరు ఆపితే మేము మీ శ్వాస ఆపేస్తామని.. ఈ సరికే ప్రకటించి ఉన్నాడు.. రీసెంట్ గా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావర్ భుట్టో సైతం సరిగ్గా ఇలాంటి లాంగ్వేజీనే వాడి భారత్ ను హెచ్చరించాడు.
Publish Date:Apr 27, 2025
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై కేసు దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేసినట్లు అధికారికంగా పేర్కొన్నాది. ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తును జమ్మూకాశ్మీర్ పోలీసులు పర్యవేక్షించారు. అయితే, ఘటన తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దీనిని ఎన్ఐఏకి అప్పగించాలని నిర్ణయించింది. దాడి జరిగిన మరుసటి రోజైన ఏప్రిల్ 23 నుంచే ఎన్ఐఏ బృందాలు పహల్గామ్‌లోని ఘటనా స్థలంలో మోహరించాయి. ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.
Publish Date:Apr 27, 2025
జమ్మూ కాశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడిపై చర్చించడానికి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ డుమ్మా కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. దాడి అనంతరం రెండు రోజుల పాటు వ్యూహాత్మక మౌనంతో మోడీ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఏదో కీలక నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు.
Publish Date:Apr 26, 2025
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. ఆదివారం (ఏప్రిల్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
Publish Date:Apr 26, 2025
బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగతున్న వేళ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల పునరాగమనం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Publish Date:Apr 26, 2025
టీఆర్ఎస్ ఆవిర్భావం చరిత్రలో స్థిరంగా నిలిచి పోయే ఒక చారిత్రిక సత్యం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా, ఒక ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ పుష్కర కాలానికి పైగా సాగించిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యింది.
Publish Date:Apr 26, 2025
విశాఖ నగరపాలక సంస్థ లో మరో వైసీపీ వికెట్ పడిపోయింది. గతవారం జీవీఎంసీ మేయర్ పదవిని కోల్పోయిన వైఎస్ఆర్సిపి డిప్యూటీ మేయర్ పదవిని కూడా కోల్పోయింది.
Publish Date:Apr 26, 2025
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభకు సర్వం సిద్దమైంది. ఆదివారం (ఏప్రిల్ 27) జరిగే రజతోత్సవ సభ వరంగల్ జిల్లా ఎల్కతుర్తి సభా ప్రాంగణం సర్వాంగ సుదరంగా వెలిగి పోతోంది. సభా ప్రాంగణమే కాదు పరిసరాలు మొత్తం గులాబీ మయమయ్యాయి.ఇంచుమించుగా పది లక్షల మంది సభకు వస్తారన్న అంచనాలతో ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
Publish Date:Apr 26, 2025
జగన్ హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అని చెప్పబడుతున్న రాజ్ కసిరెడ్డి తరువాత అరెస్టైన వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డి.
Publish Date:Apr 26, 2025
తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ లో ఏనుగులు భీభత్సం చేశాయి. కొత్తపల్లి సమీపంలో పొలం వద్ద పనిచేసుకుంటున్న రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు తొక్కడంతో రైతు చనిపోయాడని స్థానికులు తెలిపారు. శరీరంలోని భాగాలు బయటకు వచ్చి భయానక పరిస్థితి నెలకొందని తోటి రైతులు చెబుతున్నారు. మృతుడ్ని దాసరగూడెనికి చెందిన సిద్దయ్యగా గుర్తించారు.
Publish Date:Apr 26, 2025
ఏపీ లిక్కర్ స్కాంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేపట్టింది. ఈ కేసు విషయంలో సిట్ అధికారులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఈ స్కాంలో ఎవరున్నా విడిచి పెట్టవద్దని ఏపీ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. దీంతో సిట్ అధికారులు ఈ కేసు విషయంలో దూకుడు పెంచారు. ఆ క్రమంలో ఇప్పటికే ఇదే కేసులో రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సెట్ అధికారులు తాజాగా మరో కీలక వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Publish Date:Apr 26, 2025
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడింది. అయితే.. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి కావడంతో వరంగల్‌లో భారీ సభ నిర్వహిస్తున్నారు. వేలాదిగా జనం వస్తారని అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగానే తాత్కాలిక వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్‌ను ఏర్పాటుచేశారు. సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు వేశారు