Publish Date:Sep 13, 2024
తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై , చంద్రబాబు నివాసంపై దాడి కేసులలో నిందితులు అయినా దేవినేని అవినాష్, జోగి రమేష్ లకు సుప్రీం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసులలో నిందితులైన వీరిరువురూ ముందస్తు బెయిలు కోసం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏపీ హై కోర్టు వీరి యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను డిస్మిస్ చేసినప్పటి నుంచీ అజ్ణాతంలో ఉన్న వీరిద్దరూ, ముందస్తు బెయిలు కోసం సుప్రీం ను ఆశ్రయించారు.
అయితే సుప్రీం కోర్టు సాంకేతిక కారణాలతో పూర్తి స్థాయి విచారణ చేపట్టలేదు. అయినా దేవినేని అవినాష్, జోగురమేష్ లు 24 గంటలలో ఈ కేసులు దర్యాప్తు చేస్తున్న అధికారులకు తమతమ పాస్ పోర్టులను అప్పగించాలని ఆదేశించింది. అలాగే దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరించాలనీ, దర్యాప్తు అధికారులు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు వెళ్లాలనీ స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించకుంటే రక్షణ ఉండదని హెచ్చరించింది. దేవినేని అవినాష్ తెలుగుదేశం కేంద్రకార్యాలయంపై దాడి కేసులో నిందితుడు కాగా, జోగు రమేష్ చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/supreme-court-orders-devineni-avinash-and-jougu-ramesh-to-surrender-passports-25-184745.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.