కొమ్మినేనికి బెయిలు మంజూరు చేసిన సుప్రీం కోర్టు

Publish Date:Jun 13, 2025

Advertisement

సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావుకి ఊరట లభించింది. రాజధాని మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో  సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిలు కోరుతూ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంను ఆశ్రయించారు. ఆయన బెయిలు పిటిషన్ పై సుప్రీం కోర్టు శుక్రవారం (జూన్ 13) విచారణ జరిపి బెయిలు మంజూరు చేసింది. దీంతో సుప్రీంలో కొమ్మినేనికి భారీ ఊరట లభించినట్లైంది. అయితే బెయిలు మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు కొమ్మినేనికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. అమరావతిపై మరోసారి అసభ్య, అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్ లో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలని సూచించింది.   అదే సమయంలో ప్రభుత్వంపైనే కొన్ని వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్య్రాన్ని పరిరక్షించాలని పేర్కొంటూ నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా అని సుప్రీం ప్రశ్నించింది. 

 ఒక చానెల్ లో కొమ్మినేని నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న మరో జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతిపైనా, అమరావతి మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  వాటని ఖండిచకుండా కొమ్మినేని చర్చను కొనసాగించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. అమరావతి మహిళలు కొమ్మినేని, కృష్ణంరాజులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కొమ్మినేనిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన సంగతి తెలిసిందే.

By
en-us Political News

  
బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది.
ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది.
 దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు.
తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.
సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.  
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖకు ఉద్వాసన తప్పదనీ, ఆమె స్థానంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, సనీనటి విజయశాంతిని కేబినెట్ లోకి తీసుకునే అవ కాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.
ఖర్గేతో భట్టి భేటీ.. హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ..!
నూకరాజు కుటుంబం ఆత్మహత్య వెనుక లవ్ జిహాదీ, మత మార్పిడికి ఒత్తిడి చేసిన సాధిక్ ఖాన్ అనే వ్యక్తికి కూడా వైసీపీతో అనుబంధం సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్  అవుతున్నాయి. 
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో అధికార పార్టీ నేతల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పక్షం హవా నడుస్తుంది. అయితే విపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత పులివెందుల విషయంలో మాత్రం మిగిలిన ప్రాంతాలలోలా  అధికార పార్టీ హవా అని టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడానికి లేదు. అందుకే అధికార తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా పులివెందులలో పాగా వేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. 
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.