ఆలస్యంగా అయినా అనుకున్నదే జరిగింది..

Publish Date:Jan 2, 2023

Advertisement

అనుకున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ళ క్రితం, 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం ప్రటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పై  సోమవారం (జనవరి2)  సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది.  అయిదుగురు సభ్యులు ఉన్న ధర్మాసనం సుదీర్ఘ విచారణ తరువాత పెద్ద నోట్ల రద్దు పైన తీర్పును వెలువరించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ గవాయి సమర్ధించారు. నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ సరైనదేనని జస్టిస్ గవాయి   తీర్పులో పేర్కొనారు. జస్టిస్ గవాయితో సహా నలుగురు న్యాయమూర్తులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. కానీ, మరో న్యాయమూర్తి నాగరత్న జస్టిస్ గవాయ్ తీర్పుతో విభేదించారు.

2016 నవంబర్ 8న దేశ వ్యాప్తంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేశారు.ఇందుకు సంబంధించి ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు ఈ  నిర్ణయంతో బ్యాంకుల ముందు బారులు తీరారు. దీని పైన రాజకీయంగానూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత మాజీ ఆర్దిక మంత్రి చిదంబరం పిటిషనర్ల తరపు వాదనలు వినిపించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంలోని విధాన పరమైన లోపాలను ప్రస్తావించారు. ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దులో సరైన విధానం అనుసరించలేదంటూ సుప్రీం ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు.

ఇక, కేంద్రం సుప్రీం ధర్మానసం ముందు తన నిర్ణయాన్ని సమర్దించుకుంది. అపోహలతో కూడిన వాదనలను పిటిషనర్లు చేస్తున్నారంటూ అటార్నీ జనరల్ కోర్టుకు నివేదించారు. దీంతో అటు పిటిషనర్లు..ఇటు ప్రభుత్వ వాదనలు విన్న సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం 2016లో కేంద్ర పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను తమకు సమర్పించాలంటూ గత డిసెంబర్ 8న కేంద్రం, ఆర్బీఐని  ఆదేశించింది. నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐకి కేంద్రం రాసిన లేఖలు.. ఆర్బీఐ నిర్ణయాలతో పాటుగా నోట్ల రద్దు ప్రకటనలకు సంబంధించి పైళ్లను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తీర్పును  2023 జనవరి 2 (సోమవారం)కు రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఒకే రకమైన తీర్పు ఇస్తుందా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయా అనే ఉత్కంఠ కొనసాగింది.

అయితే, ఉత్కంఠకు తెరదించుతూ  సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లను కొట్టి వేసింది. డీమానిటైజేషన్పై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య సంప్రదింపుల తర్వాతే నోట్ల రద్దు నిర్ణయం వెలువడిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలోని నలుగురు సభ్యులు పెద్ద నోట్ల రద్దును సమర్థించారు. జస్టిస్ నాగరత్న కేంద్రం నిర్ణయంతో విభేదించారు. పెద్ద నోట్ల రద్దు చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ చట్టబద్ధమైనదేనని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసే ముందు తగిన చర్యలు తీసుకున్నారని చెప్పింది. అలాగే రద్దు చేసిన నోట్ల బదిలీ కోసం ఇచ్చిన గడువు హేతుబద్ధం కాదని చెప్పలేమని పేర్కొంది.

అయితే  పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆశించిన లక్ష్యాలను సాధించిందా? అంటే, కేంద్ర మాజీ ఆర్థిక  మంత్రి చిదంబరం, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ సహా కొందరు ప్రముఖ ఆర్థిక వేత్తలు ఇప్పటికీ, పెద్ద నోట్ల రద్దు ప్రకటిత లక్ష్యాలు నెరవేర లేదు సరికదా, అప్రకటిత అనర్ధాలు ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీశాయని అంటున్నారు. రాజకీయంగానూ పెద్దనోట్ల రద్దు ఇప్పటికీ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇప్పటికీ  మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయి పోయిందని ఆరోపిస్తున్నారు. అయితే, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత 2019లో  జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అయితే నేమి, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలలో అయితేనేమీ ప్రజలు పెద్ద నోట్ల రద్దుకు ఆమోదం తెలిపారు. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ, చేసిన వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదు. 

నిజానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద నోట్ల రద్దును ప్రధాన ఎన్నికల అస్త్రంగా చేసుకుంది, అయినా ఆ ఎన్నికల్లో బీజేపీ బలం మరింతగా పెరిగిందే కానీ, తరగలేదు. అంటే ఒక విదంగా పెద్ద నోట్ల రద్దుకు ప్రజాకోర్టులో అప్పుడే ప్రజామోదం లభించింది. ఇప్పడు న్యాయస్థానం ఆమోదం కూడా లభించింది. అయితే, అంత మాత్రం చేత పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నేరవేరినట్లేనా, పెద్దనోట్ల రద్దు వలన తలెత్తిన సమస్యలు సమస్యల కాకుండా పోయాయా ? రాజకీయ దుమారం ఇంతటితో అయినా సర్దు మనుగుతుందా అంటే, లేదనే అంటున్నారు.

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.