Publish Date:Mar 18, 2025
సునీతా విలియమ్స్.. పరిచయం అక్కర్లేని పేరు. తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఆమె ఇప్పుడు తిరిగి వస్తున్నారు. అంత కాలం దుర్భర స్థితిలో అసలు తిరిగి వస్తానా రానా అన్న స్థితిలో గడిపిన ఆమెకు ఇచ్చే పరిహారం ఎంతో తెలుసా రోజుకు కేవలం నాలుగు డాలర్లు. అదే అమెరికాలో అడ్డాకూలికి గంటకు 15 డాలర్ల వేతనం దక్కుతుంది. సునీతా విలియమ్స్ కు నాసా ముట్ట చెప్పేది మాత్రం కేవలం రోజుకు కేవలం నాలుగు డాలర్లు. భారత్ నుంచి అమెరికాకు వెళ్లి చదువు కుంటూ పని చేసే మన వాళ్లకు కూడా అక్కడ గంటకు 15 డాలర్ల వేతనం వస్తుంది. వారి కంటే కూడా సునీతా విలియమ్స్ కు దక్కేది నాలుగు డాలర్లు మాత్రమే.
తొమ్మిది నెలల పాటు అనివార్య పరిస్థితుల్లో అంతరిక్షంలో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే త్రిశంకు స్వర్గంలాటి స్థితిలో చిక్కుకుపోయి.. అసలు తిరిగి భూమిని చేరుకుంటామా లేదా అన్న ఆందోళనతో గడిపిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు ఎట్టకేలకు భూమికి దిగి వస్తున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం వారు భువికి చేరుకుంటారు. ఇంతటి సుదీర్ఘ నిరీక్షణకు తెరపడటం శుభపరిణామమే. వారి తిరిగి రావాలని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది కోరుకున్నారు. ప్రార్థనలు చేశారు. ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్ దాదాపు తొమ్మిది నెలలు అక్కడే చిక్కుకుపోయారు. సాంకేతిక సమస్యలతో ఆమె అంతరిక్షం నుంచి భూమి మీదకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఎట్టకేలకు స్పేస్ఎక్స్ డ్రాగన్ ఐఎస్ఎస్ తో విజయవంతంగా అనుసంధానం కావడంతో సునీతా విలియమ్స్, ఆమెతో పాటు వెళ్లినబుచ్ విల్లోర్ లు ఎట్టకేలకు భూమికి చేరడానికి మార్గం సుగమమైంది. అయితే ఇంత కాలం అనివార్యంగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వారికి నాసా వారి జీత భత్యాలు కాకుండా అదనంగా పరిహారం ఏమైనా చెల్లిస్తుందా? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. వాస్తవంగా వ్యోమగాములకు జీతం కోట్లలోనే ఉంటుంది.
అయితే వారికి ఓవర్ టైమ్ అంటూ ప్రత్యేక చెల్లింపులు ఏమీ ఉండవు. కానీ అనూహ్య పరిస్థితుల్లో ఇలా చిక్కుకుపోయినందున నాసా సునీతా విలిమ్స్ కు అదనంగా రోజుకు నాలుగు డాలర్లు చెల్లించనుంది. ఆశ్చర్య పోకండి నిజంగా నిజం. తొమ్మది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకు పోయి, అసలు తిరిగి రాగలుగుతారా రారా అన్న భయాందోళనల మధ్య గడిపినందుకు సునీతా విలిమ్స్ కు నాసా చెల్లించే అదనపు వేతనం లేదా పరిహారం రోజుకు కేవలం నాలుగు డాలర్లు. అంటే సుమారుగా రోజుకు 348 రూపాయలు. ఇది అమెరికాలో అడ్డాకూలీలకు వచ్చే గంట వేతనం కన్నా కూడా తక్కువ. మొత్తం మీద తొమ్మది నెలలు అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్ కు దక్కే అదనపు సోమ్ము మన కరెన్సీలో చెప్పాలంటే కేవలం లక్ష రూపాయలు మాత్రమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sunitha-williams-get-4dollars-per-day-as-compensation-39-194612.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.