Publish Date:Mar 19, 2025
సునీతా విలియమ్స్ 9 నెలల సుదీర్ఘ కాలం అంతరిక్షంలో చక్కుకుపోయి ఎట్టకేలకు భువికి చేరుకున్నారు. అయితే అంత కాలం అంతరిక్షంలో ఉన్న ఆమె ఇక్కడ భూమి మీద సాధారణ జీవితం గడపడం అంత సులభం కాదు. ఆమె కొంత కాలం ఐసోలేషన్ లో ఉండాల్సిందే.
దాదాపు నెలన్నర పాటు సునీతా విలియమ్స్ నాసా కేంద్రంలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. వైద్యులు, మానసిక నిపుణులు ఈ నెలన్నర అంటే 45 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తారు. అలాగే రోజజుకు రెండు గంటల పాటు వివిధ వ్యాయామాలు చేయిస్తారు. ఎందుకంటే సుదీర్ఘకాలం రోదసిలో ఉండటం వల్ల సునీతా విలియమ్స్ పలు శారీరిక మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జీరో గ్రావిటీ వాతావరణంలో గడపడం వల్ల భూమి మీద ఆమె మళ్లీ మామూలు జీవితం గడపడానికి కొంత కాలం పడుతుంది. నడవడం, దృష్టిని స్థిరంగా ఉంచడంలో సునీతా విలియమ్స్ ఇబ్బందులు పడుతున్నారు.
ఆమెను క్యాప్సుల్ నుంచి స్ట్రెచ్చర్ పై తీసుకురావడాన్ని ప్రపంచమంతా దృశ్యమాధ్యమాల ద్వారా తిలకించింది. ఇదే కాకుండా శరీరంలో రేడియేషన్ స్థాయి ఎక్కువగా ఉండటం, అలాగే ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు కూడా సునీతా విలియమ్స్ ఎదుర్కొంటున్నారు. గతంలో అంటే 1984లో భారత సంతతికి చెందిన రాకేష్ వర్మ రోదసిపై కాలు మోపిన తొలి భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి వచ్చిన తరువాత కొన్ని రోజుల పాటు ఐసోలేషన్ లో గడపాల్సి వచ్చింది. రోదశిలోకి వెళ్లిన ప్రతి వారూ ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. అప్పట్లో రాకేష్ శర్మ రోదశిలో ఏడు రోజుల 21 గంటల 40 నిముషాల సేపు గడిపారు. ఆ కారణంగా ఆయన నెలల తరబడి ఐసోలేషన్ లో ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది.
అయితే ఇప్పుడు సునీతా విలియమ్స్, నిక్ హేగ్, బుచ్ విల్మోర్ లు 9 నెలల పాటు రోదశిలో చిక్కుకుపోయారు. దీంతో వీరు ఎక్కువ రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తోంది. నాసా కేంద్రంలో వీరికి 45 రోజుల పాటు మూడు దశలలో శిక్షణ ఇచ్చి భూమి వాతావరణానికి అలవాటు పడేలా చేస్తారు. మొదటి దశలో కండరాల బలోపేతానికి సంబంధించి శరీర శక్తి, రక్త ప్రసరణ పెరిగేందుకు అవసరమైన చికిత్స, వ్యాయామాలు చేయిస్తారు. ఇక చివరిదైన మూడో దశలో వారిలో చురుకుదనం పెంచేందుకు అవసరమైన వ్యాయామాలతో పాటు, భూవాతావరణానికి అనుగుణంగా శరీకం అలవాటుపడేందుకు అవసరమైన చికిత్స అందిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి 45 రోజులు పడుతుందని నాసా వర్గాలు తెలిపాయి. ఆ కారణంగానే అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన వెంటనే సునీతా విలియమ్స్ ను వైట్ హౌస్ కు ఆహ్వానింలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఆమె పూర్తిగా కోలుకున్న తరువాత వైట్ హౌస్ కు ఆహ్వానించి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతానని ఆయన అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sunitha-williams-confine-to-nasa-center-for-45days-39-194687.html
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.