వివేకా హత్య కేసు.. దోషులెవరు? నిర్దోషులెవరు?.. సునీత పోరాటం తేల్చేసిందా?

Publish Date:Feb 24, 2023

Advertisement

గత నాలుగేళ్లుగా వైఎస్ వివేకా హత్య కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. హత్య జరిగిన వెంటనే ఆరోపణలు గుప్పించిన వాళ్లే ఇప్పుడు నిందితులుగా, అనుమానితులుగా బోనులో నిలబడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు. అసలు వివేకా హత్య కేసు నాలుగేళ్లుగా ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు ఎందుకు ఎదుర్కొందన్నది కూడా ఇప్పుడు సందేహాలకు తావు లేకుండా తేలిపోయింది. హత్య జరిగిన సమయంలో విపక్ష నేతగా ఉన్న జగన్ అప్పడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసి.. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సీబీఐ విచారణే వద్దనీ, కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టిన సీబీఐకి ముందుకు సాగకుండా అడ్డంకులు ఎదురౌతున్నా కిమ్మనకుండా చోద్యం చూడడానికీ కారణమేమిటన్నది కూడా ఇప్పుడిప్పుడే మబ్బులు విడిపోయినట్లు విడిపోతోంది. తెలుగుదేశం నెత్తిన ఇప్పటి వరకూ ఉన్న నిందా భారం ఒక్క సారిగా తొలగిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ వివేకా హత్య మోటో ఏమిటి? చేసిందెవరు? చేయించిందెవరు? అన్నవిషయంలో ఉన్న సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. దీనికంతటికీ కారణం ఒకే ఒక్క వ్యక్తి. ఆమె దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.  

తన తండ్రి హత్యకు కారణమైన హంతకులు, ముసుగువీరుల సంగతి తేల్చాలంటూ చేసిన న్యాయ పోరాటం నిజంగా  నిస్సందేహంగా తెలుగుదేశం నెత్తిన పాలు పోసిందనే చెప్పాలి. ఆమె అలుపెరుగని పోరాటం ఫలితమే నేడు వివేకా హత్య కేసు ఒక లాజికల్ ఎండ్ కు వస్తున్నదనడంలో సందేహం లేదు. అమె పట్టుబట్టి తన తండ్రి హత్య సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది వెలుగులోకి వచ్చే దిశగా కేసు దర్యాప్తు సాగుతోంది.  ఒక మహిళగా, ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయం కోసం సునీత చేసిన, చేస్తునన  పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. 

సోదరుడు సీఎంగా ఉన్నందున,   తండ్రిని హత్యచేసిన వారెవరన్నది    సులభంగా తేలిపోతుందని తొలుత ఆమె భావించారు. వివేకా హత్య జరిగిన సమయంలో విపక్ష నేతగా ఉన్న సోదరుడు జగన్  వివేకా హత్య కేసు దర్యాప్తునకు హత్య జరిగిన వెంటనే వివేకా గుండెపోటుతో మరణించారని మీడియా ముందు చెప్పిన జగన్, ఆయన అనుయాయులూ  ఆ తర్వాత గొడ్డలి పోటని, ఆ పోటు వెనుక నారాసుర రక్త చరిత్ర ఉందంటూ ఆరోపణలు గుప్పించారు.  సరే ఆ తరువాత జరిగిన ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి.. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఇక తండ్రిహత్య కేసు  సత్వరమే పరిష్కారమై పాత్రధారులు, సూత్రధారులకు శిక్ష పడుతుందని ఆశించారు.  అయితే జగన్ అనూహ్యంగా వివేకా హత్య కేసులో  సీబీఐ విచారణ అవసరం లేదని.. కోర్టుకు తెలిపింది. దీంతో వివేకా కుమార్తె సునీత కంగుతిన్నారు.   ఆ తర్వాత కూడా కేసు నెలలపాటు నత్త నడకన సాగడంతో సునీత తన తండ్రి హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. సాధించారు.

అయితే సీబీఐ దర్యాప్తు చేపట్టిన తరువాత కూడా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులే అడ్డుపడుతుండటం వివేకా హత్యలో సునీత-ఆమె భర్త హస్తం ఉందన్న రీతిలో ఒక వర్గం మీడియాలో కథనాలు రావడంతో ఆమెకు తన తండ్రి హత్య వెనుక ఉన్న శక్తులెవరన్న విషయంలో ఒక స్పష్టత వచ్చింది. అందుకే జగన్ సీఎంగా ఉన్న ఏపీలో కేసు ముందుకు సాగదని నిర్ధారణకు వచ్చి ఈ కేసు విచారణ మరో రాష్ట్రానికి అప్పగించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు వివేకా హత్య కేసు విచారణను తెలంగాణకు బదలీ చేసింది. అక్కడ నుంచే వివేకా హత్య కేసు విచారణ వేగం పుంజుకుంది.  

కడప జైలులో ఉన్న నిందితులను హైదరాబాద్ చంచల్‌గూడ జైలుకు మార్చడం, వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించడం, ఆ విచారణ ఆధారంగా రాబట్టిన సమాచారంతో జగన్ ఓఎస్‌డీ, భారతి పీఏలను విచారించడం,  వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి సీబీఐ నోటీసులివ్వడం చకచకా జరిగిపోయాయి. అలాగే అవినాష్ రెడ్డిని రెండో సారి విచారించేందుకు కూడా సీబీఐ నిర్ణయించుకోవడం.. ఇదంతా సునీత పోరాట ఫలితమేనన్నది కాదనలేని వాస్తవం.  వివేకా హత్య కేసులో ఎవరు హంతకులు? ఎవరు నిర్దోషులు? ఈ కేసులో   ఎవరెవరిని అరెస్టు చేస్తారన్నది పక్కన పెడితే..  తన తండ్రి హంతకులెవరో తేల్చాలని సునీత చేసిన పోరాటం నిజంగా చారిత్రాత్మకం. ఆమె మడమ తిప్పని పోరాట ఫలితమే.. ఈ కేసు ముందుకు సాగేలా చేసింద. లేకుంటే ఎన్నటికీ పరిష్కారం కాని కేసులాగే వివేహా హత్య కేసు కూడా మిగిలిపోయి ఉండేది. అలా మిగిలిపోయి ఉంటే.. ఈ కేసులో నేరస్థులు ఆరోపణులు చేస్తూ.. నిర్దోషులు నిందలు మోస్తూ గడపాల్సి వచ్చేంది. గత ఎన్నికల ముందు జరిగిన వివేకా హత్య.. కేసులో వివేకా దగ్గరి బంధువులు అప్పటి ప్రభుత్వంపై.. ప్రభుత్వాధినేతపై ఆరోపణలు గుప్పించారు.

ఆ ఆరోపణల కారణంగానే అప్పటి విపక్ష పార్టీకి సానుభూతి.. అధికార పార్టీకి వ్యతిరేక పవనాలు ప్రతిఫలంగా దక్కాయి.  సరే ఎన్నికల పూర్తయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. విపక్షంలో ఉండగా తెలుగుదేశంపై ఆరోపణలు గుప్పించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసు ఎప్పటికీ తేలకుండా ఉండేలా అడుగులు వేశారు. విపక్షంలో ఉండగా సీబీఐ దర్యాప్తు అంటూ డిమాండ్ చేసిన ఆయన అధికారంలోకి వచ్చాకా సీబీఐ దర్యాప్తు అవసరం లేదని అన్నారు. సునీత గట్టిగా నిలబడి ఉండక పోతే ఏం జరిగేది? ఈ   కేసు ఎప్పటికీ పరిష్కారమయ్యేది కాదు.   వివేకా హత్య నిందను తెలుగుదేశం పార్టీ మోస్తూ ఉండాల్సి వచ్చేది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు అన్న అపనిందను దశాబ్దాలుగా చంద్రబాబు ఎలా మోశారో..  వివేకా హత్య కేసులో ఆరోపణలను సైతం అలాగే మోయాల్సి వచ్చేది. ఎన్టీఆర్ కు వెన్నుపోటు అపనిందల భారం నుంచి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో ద్వారా చంద్రబాబును తప్పించారు. అయితే అందుకు దశాబ్దాలు పట్టింది. వివేకా హత్య కేసు ఆరోపణల నుంచి సునీత పోరాటం తెలుగుదేశం పార్టీని బయట పడేసింది.  

ఇప్పుడు సునీత పోరాటం వల్ల.. వివేకా హత్యలో పాత్రధారులు, సూత్రధారులెవరన్న ఒక్కో నిజం నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తోంది. ఏకంగా సీబీఐ తన విచారణలో ఎంపీ అవినాష్‌రెడ్డి,  ఆయన తండ్రి భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి, సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి పేర్లు ప్రస్తావించింది. దస్తగిరి ఆల్రెడీ అప్రూవర్‌గా మారారు. అందులో పాత్రధారులు-సూత్రధారులెవరన్నదీ స్పష్టంగా పేర్కొని, వాటిని కోర్టుకు సమర్పించింది.   సీబీఐ గానీ, మరొకరు గానీ కోర్టుకు ఆధారాలు సమర్పించిన తర్వాత, అది అధికార డాక్యుమెంట్‌తో సమానమే. కోర్టు నుంచి ఎవరైనా ఆ కాపీలు తీసుకోవచ్చు. పిటిషనర్ న్యాయవాది కూడా వాటిని తీసుకోవచ్చు.  ఇవన్నీ కాదు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసినది నిజాన్ని నిగ్గు తేల్చడానికి సునీత జరిపిన పోరాటం గురించి మాత్రమే.   

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.