మౌనమేలనోయీ.. విజయసాయీ!?

Publish Date:Feb 24, 2023

Advertisement

వైసీపీలో కీలక నేత విజయసాయి. అందులో సందేహం లేదు. పార్టీ ఆవిర్బావం నుంచి.. పార్టీ నిర్మాణం వరకూ, 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సహా అన్నిటా అత్యంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. అందుకే విజయసాయిని జగన్ వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు. ఢిల్లీ స్థాయిలో పార్టీ వ్యవహారాలు, ప్రధాని, హోంమంత్రి అప్పాయింట్ మెంట్ సహా ప్రతి విషయాన్నీ స్వయంగా పర్యవేక్షించే వ్యక్తి విజయసాయి.

అలాగే అధినేత మనసెరిగి విపక్షంపై మాటల దాడి చేయడంలోనూ,  విమర్శలతో విపక్షాల నాయకులను చెరిగేయడంలోనూ విజసాయి స్టైలే వేరు.. రూటే సెపరేటు. ట్విట్టర్ వేదికగా ఆయన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ నాయకులనూ ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి కూడా. అయితే ఆయన ఎప్పుడూ తగ్గేదేలే అన్నట్లుగా ముందుకే సాగారు తప్ప వెనుకడుగు వేసిన సందర్బం కనిపించలేదు. అయితే ఇటీవలి కాలంలో విజయసాయికి పార్టీలో ప్రాధాన్యత తగ్గిందా అన్న అనుమానం వైసీపీ శ్రేణులలోనే వ్యక్తమౌతోంది. గత కొంత కాలంగా ప్రభుత్వ సలహాదారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల పార్టీ వ్యవహారాలన్నీ తానై  చక్కబెడుతున్నారు.

ఈ పరిస్థితి చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ విజయసాయి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఆయనదే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే సోషల్ మీడియా బాధ్యతల నుంచి విజయసాయిని తప్పించి.. సజ్జల కుమారుడికి ఆ బాధ్యతలు కట్టబెట్టారో.. అప్పటి నుంచీ విజయసాయి ప్రతి కదలికపైనా జగన్ నిఘా పెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమౌతూ వస్తున్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా గత నెలలో సీబీఐ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచిన సందర్భంగా... ఆ విచారణ తేదీ కంటే ముందు  జగన్ హస్తిన వెళ్లి మోడీతో భేటీ కావాలని భావించారు.

అయితే.. మోడీ అప్పాయింట్ కన్ ఫర్మ్ చేయడంలో విజయసాయి విఫలం కావడంతో జగన్ కినుక వహించారని కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సరే ఆ విషయం పక్కన పెడితే.. రీసెంట్ పాస్ట్ నుంచి విజయసాయి తీరు కూడా పార్టీ వర్గాల్లో పలు అనుమానాలకు తావిస్తోంది. అన్నిటికీ మించి రాజ్యసభ వేదికగా అమరావతిపై ఆయన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం వైసీపీకి శరాఘాతంగా తగిలింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించినట్లు కేంద్రం స్పష్టం చేయడమూ, మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం తమను సంప్రదించ లేదని కుండబద్దలు కొట్టడంతో ఇంత కాలం అమరావతి విషయంలో జగన్ సర్కార్ చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలని తేలిపోయింది. దీంతో వైసీపీ సర్కార్ డిఫెన్స్ లో పడింది. ఇది కూడా పార్టీలో విజయసాయి ప్రాధాన్యత తగ్గడానికి కారణమైందని చెప్పవచ్చు. ఇక లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన రోజు.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురై మూడు వారాల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్లి తారకరత్న ను విజయసాయి పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న విజయసాయికి బంధువు కావడంతో ఆయన ఆస్పత్రికి వెళ్లారు. అయితే అక్కడ ఆయన తారకరత్న ఆరోగ్యం గురించి మాట్లాడిన మాటలు, ఆ తరువాత తారకరత్న మరణించిన అనంతరం మీడియా ఎదుట విజయసాయి మాట్లాడిన మాటలూ, వైసీపీ నేతల విమర్శలను ఖండించే విధంగా ఉన్నాయి. అన్నిటికీ మించి విజయసాయి ఆ సందర్భంగా చంద్రబాబుతో ముచ్చటించడం, బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించడం అప్పట్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదలా ఉంచితే.. ఇటీవలి కాలంలో విజయసాయి తెలుగుదేశం, ఆ పార్టీ నేతలపై విమర్శల జోలికి పోవడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనూహ్య మౌనం పాటించడమో లేదా, సౌమ్యంగా మాట్లాడడమో చేస్తున్నారు.

విజయసాయి అంటే భగ్గుమనే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సైతం విజయసాయిలో వచ్చిన ఈ మార్పును గుర్తించి.. ఇది మంచి పరిణామమంటూ కితాబునిచ్చారు. వైసీపీ పట్ల ప్రజలలో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను గమనించడం వల్లే విజయసాయిలో మార్పు వచ్చిందని రఘురామరాజు భాష్యం చెప్పారనుకోండి.. అది పక్కన పెడితే.. ఇటీవల గన్నవరంలో జరిగిన సంఘటనలపై తెలుగుదేశం.. వైసీపీల మధ్య మాటలయుద్ధమే జరుగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సైతం పరుషంగా విమర్శలు చేస్తూ.. పోలీసుల అండ లేకుండా ఎంత మంది వచ్చినా ఎదుర్కొనడానికి సై అంటూ సవాల్ విసిరారు.

ఇక తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అయితే చెప్పనే అక్కర్లేదు. వైసీపీకి అండగా నిలుస్తున్న పోలీసు అదికారుల సంగతి అధికారంలోకి వచ్చాకా తేలుస్తామంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. అదే సమయంలో జగన్ పైనా, వైసీసీ నేతలపైనా విమర్శల దాడి తీవ్రం చేశారు. ఇన్ని జరుగుతున్నా విజయసాయి నోరు మెదపడం లేదు. గతంలో జగన్ మీద ఈగ వాలితే.. అందుకు తెలుగుదేశం అధినేతే కారణమంటూ విరుచుకుపడే విజయసాయి.. ఇప్పుడు నోరెత్తడం లేదు. వివేకా హత్య కేసులో తాజా పరిణామాలపైనా ఆయన మాట్లాడటం లేదు.  తాజాగా ఏపీ కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విజయసాయి వైసీపీ మంత్రులకు దూరంగా కూర్చోవడం కూడా ఏపీ రాజకీయ సర్కిళ్లలో చర్చకు తెరలేపింది. అంతే కాకుండా ప్రమాణ స్వీకారానికి ముందు గవర్నర్ ను హస్తినలో కలిసినది వైసీపీ నుంచి ఇద్దరు మాత్రమే.. వారిలో ఒకరు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కాగా రెండో వ్యక్తి విజయసాయి మాత్రమే.

ఈ నేపథ్యంలోనే గవర్నర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయసాయి వైసీపీ నాయకులతో కలివిడిగా కనిపించకపోవడం  రాజకీయ వర్గాలలో పలు అనుమానాలకు తావిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిని దూరం చేసుకుంటే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవన్న ఆందోళన ఇప్పుడు వైసీపీ లో కనిపిస్తోందని అంటున్నారు. అసలు విజయసాయి నిజంగా పార్టీ కార్యక్రమాలకు తనంత తానుగా దూరం జరుగుతున్నారా? లేక పార్టీయే దూరం పెడుతోందా అన్న అనుమానాలకు తోడు.. ఈ మౌనం వెనుక కూడా ఏదైనా వ్యూహం ఉందా అన్న సందేహాలు కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. 

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.