సీఎం రేవంత్‌ను కలిసిన సునీల్ భారతి మిట్టల్

Publish Date:Jun 30, 2026

Advertisement

 

ప్రముఖ పారిశ్రామిక వేత్త, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ఎంసీఆర్ హెచ్‌ఆర్డీ బోధీ పెవిలియ‌న్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి . తెలంగాణలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, సంస్కరణలను వివరిస్తూ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన అంశాలను ప్రస్తావించారు.  

ప్రత్యేకంగా విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణలు, ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేస్తున్న తీరును వివరించారు. పారిశ్రామిక రంగ అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను అధునాతన సాంకేతిక విధానాలతో ఏటీసీలుగా మార్చిన విషయాలను తెలిపారు. ఇదే కోవలో పాలిటెక్నిక్ కాలేజీల అధునికీకరణ గురించి చెప్పారు.    

చందన్‌వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్టును వీలైనంత తొందరగా ప్రారంభించాలని ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి  సూచించారు. తెలంగాణలో మరింత పెద్ద సమగ్ర డేటా సెంటర్, AI మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాల‌ని కోరారు.  హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ డిజిటల్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, AI కార్యకలాపాలపైన దృష్టి పెట్టాలి మిట్టల్‌కి  సూచించారు. 

రాష్ట్రంలో భవిష్యత్ పెట్టుబడి అవకాశాలు, సమస్యలను పరిష్కరించడం కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేలా ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ను నామినేట్ చేసి స‌మ‌న్వ‌యం చేసుకోవాలని ముఖ్య‌మంత్రి  సూచించారు.   భార‌తీ పౌండేష‌న్ ద్వారా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు, ఏటీసీల్లో చ‌దువుకునే విద్యార్థుల‌కు స్కాల‌ర్ షిప్‌లు అందజేస్తామ‌న్న సునీల్ మిట్ట‌ల్  తెలిపారు. అలాగే, ఎయిర్‌టెల్‌కు రెండో హెడ్ క్వార్ట‌ర్‌గా హైద‌రాబాద్‌ను పరిగణిస్తున్నామని చెప్పారు.   డేటా సెంట‌ర్ల కెపాసిటీని మ‌రింత పెంచ‌డానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తెలంగాణలో ఫైబ‌ర్ క‌నెక్టివిటీ మ‌రింత పెంచ‌డంపైన ఈ సందర్భంగా సునీల్ మిట్టల్ ఆస‌క్తిని ప్రదర్శించారు.

By
en-us Political News

  
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే సాగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘ తీరప్రాంతం అపారమైన సహజ వనరులకు, అరుదైన ఖనిజాలకు నిలయంగా మారింది.
అయోధ్య రామాలయం, విరాళాల వివాదం, రాముడి నిధుల దుర్వినియోగం, సిట్ విచారణ, యోగి ఆదిత్యనాథ్
శిల్పాకళా వేదికగా రైతు భరోసా నిధులు విడుదల...
దేశాన్ని వికసిత భారత్‌గా మార్చే అద్భుత లక్ష్య సాధనలో నవతరానికి చెందిన యువతదే అత్యంత కీలకమైన పాత్ర అని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రిమండలి అత్యవసరంగా సమావేశం కానుంది.
విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ముంబై మహానగరంలో పెను విషాదం చోటుచేసుకుంది
పుష్ప సినిమాను తలపించే రీతిలో కంటైనర్ లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ ఛాంబర్‌లో గంజాయి
ఈ వివాదానికి కారణం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలే. రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతీయులని, వాళ్లు దక్షిణాదిపై దాడి చేశారంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుత తరుణంలో సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు ఊహించని విధంగా భారీ చుక్కెదురైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.