సూర్యుణ్ణి కౌగిలించుకోం‘డి’

Publish Date:Mar 31, 2018

Advertisement

 

సూర్యకాంతిలో వుండే బి-బ్యాండ్ అతినీలలోహిత కిరణాలు మన ఆరోగ్యానికి అత్యంత కీలకమైనవి. ఆ కిరణాలే మన శరీరంలో ఎముకల పుష్టికి మూలమైన ‘విటమిన్-డి’ తయారీని ప్రేరేపిస్తాయట. ఆ కిరణాలు సూర్యకాంతి మన చర్మం మీద ఏటవాలుగా పడే ఉదయం, సాయంత్రం సమయాల్లో ఎక్కువగా వుంటాయి. కాబట్టి వీటికోసం మనం ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ఆరుబయట గడపటం తప్పనిసరి. ఈ కిరణాలు మన చర్మం మీద పడుతూనే మన శరీరం ‘విటమిన్-డి ’ని తయారుచేసుకోవడం ప్రారంభిస్తుంది. మనం తిన్న ఆహారంలోని కాల్షియం ఎముకల్లో చేరడానికి డి విటమిన్ చాలా అవసరంట.

‘విటమిన్-డి ’ కోసం మందులు వాడచ్చు కదా అంటారు కొందరు. కానీ, మనం వాడే మందుల్లో ‘విటమిన్-డి ’ సుమారు 100 యూనిట్ల లోపే వుంటుంది. నిజానికి ఒక్కరోజుకి పిల్లలకి 200 యూనిట్లు, పెద్దలకు 400 యూనిట్ల ‘విటమిన్-డి ’ అవసరం. ఆ లెక్కన ఎన్ని మందులు వాడాలి చెప్పండి. చక్కగా ఉదయం, సాయంత్రం లేలేత కిరణాలు తాకేలా నిలుచుంటేచాలు. 

రోజూ ఒంటికి సూర్యరశ్మి తగలని వారికి రొమ్ము, ప్రొస్టేట్, గర్భాశయం వంటి అవయవాలకు కేన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా వుంటుందని పరిశోధకులు గుర్తించారు. పైగా ఈ మధ్యాకాలంలో చాలమందిలో ‘విటమిన్-డి ’ లోపం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు కూడా. పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి ఈ ‘విటమిన్-డి ’ ఎంతో అవసరం. అయితే ఉదయం స్కూలుకి వెళ్ళే హడావిడి, సాయంత్రం ఎప్పుడో పొద్దుపోయాక ఇళ్ళకి చేరడం వల్ల తగినంత సూర్యరశ్మి పిల్లలకి చేరడం లేదని చెబుతున్నారు పరిశోధకులు. దీనివల్ల పిల్లలు భవిష్యత్తులో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం కూడా వుందట.

సూర్యరశ్మి తగలగానే మన ఒంట్లో ‘మెలటోనిన్’ అనే హార్మోను తగ్గిపోతుందట. ఈ హార్మోన్ స్థాయి ఎక్కువగా వుంటే మనలో డిప్రెషన్ సమస్య ఎక్కువగా ఉంటుందిట. మానసికంగా నిస్తేజంగా ఉన్నా, డిప్రెషన్ చుట్టుముట్టినా లేలేత సూర్యకిరణాలలో సేదతీరడం మొదలుపెడితే చాలట. లేలేత సూర్యకిరణాలలో కొద్దిసేపు ఉంటే డిప్రెషన్‌కి కారణమైన ‘మెలటోనిన్’ హార్మోను స్థాయి తగ్గిపోతుంది. మానసికంగా ఉత్తేజం లభిస్తుంది. 

అంతేకాదు.. రోజు క్రమం తప్పకుండా వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలని సూర్య కిరణాలు తాకేలా చేసేవారు ఒత్తిడి బారిన పడే అవకాశాలు చాలా తక్కువట. వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాల వల్ల మాత్రమే కాదు.. ఆ సూర్యరశ్మి తాలూకు ప్రభావం వల్ల రోజంతా ఉత్సాహంగా, ఉత్తేజంతో ఉండచ్చని గట్టిగా చెబుతున్నారు. పసిపిల్లలు రాత్రంతా నిద్రపోకుండా అదేపనిగా ఏడుస్తుంటే రోజూ కొద్దిసేపు పగటి వెలుగులో ఉంచితే వారి నిద్ర అలవాట్లు తప్పకుండా మారతాయిట. 

అంతేకాక వారు ఉత్తేజంగా కూడా ఉంటారని అధ్యయనాల్లో తేలింది. అటు ఆధునిక వైద్యులు, ఇటు సంప్రదాయ వైద్యులు ముక్తకంఠంతో చెబుతున్న మాట ఒక్కటే. మన మెదడుపై సూర్యరశ్మి అమోఘమైన ప్రభావాన్ని చూపిస్తుందిట. ఇది నిద్రతోపాటు రకరకాల హార్మోన్లను కూడా ప్రభావితం చేస్తుందిట. కాబట్టి మన శరీరంలోని అంతర్గత గడియారం సజావుగా నడుస్తూండాలంటే రోజూ కొంత సమయం సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం అవసరం. 

సూర్యకిరణాలు సైతం మనల్ని తాకే అవకాశం లేని కాంక్రీట్ జంగిల్‌లో నివసిస్తున్నాం. ఆరుబయట ఉచితంగా, అనంతంగా దొరికే ఆరోగ్య ప్రదాయినిని నిర్లక్ష్యం చేస్తున్నాం. అనారోగ్యాన్ని కోరి తెచ్చుకుంటున్నాం అంటూ నిపుణులు చేస్తున్న హెచ్చరికలపై ఇకనైనా కాస్త శ్రద్ధ పెట్టాలి. సూర్యకిరణాల స్పర్శతో ఆరోగ్యాన్ని సొంతం చేసుకునే విషయమై ఆలోచించాలి.                                                                       
 

-రమ ఇరగవరపు

By
en-us Political News

  
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు..
కొన్నిసార్లు శరీరంపై నీలం లేదా ఊదా రంగు మచ్చలు  కనిపిస్తాయి. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఏవైనా గాయాలు లేదా దెబ్బలు తగిలినప్పుడు బయటకు రక్తం కారడం..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి..
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.