జర భద్రం.. ఇది రోహిణి కార్తె!

Publish Date:May 24, 2023

Advertisement

వేసవి కాలం.. అదీ రోహిణి కార్తెలో కాచే ఎండలకు రోళ్లు సైతం పగిలిపోతాయంటారు. సంక్రాంతి వెళ్లిన తర్వాత శివరాత్రి మహా పర్వదినంతో అప్పటి వరకు పులిలా పంజా విసిరిన చలికి చెక్ పడి పోతుంది. ఆ తర్వాత నుంచి భానుడు.. తన భగ భగలను రోజు రోజుకు కొద్ది కొద్దిగా డోస్ పెంచుకొంటూ పోతాడు. మామూలుగా ఎండా కాలం.. అంటేనే మండే కాలం.. ఆ కాలంలో వేడిని తట్టుకోవడం ఆ సూర్యభగవానుడికి తప్పించి.. మానవ మాత్రులకు   సాధ్యం కాదన్న సంగతి అందరికీ అనుభవైకవైద్యమే. అన్నిటికంటే ముఖ్యంగా వేసవి కాలం చివరి  పక్షం రోజుల్లో.. అంటే రోహిణికార్తెలో సూర్యప్రతాపం తారస్థాయికి చేరుతుంది.

ప్రచండ భానుడి విజృంభణ మామూలుగా ఉండదు. వేసవి కాలం ముగిసి.. వర్షా కాలం ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ప్రభాకరుడు ప్లస్ దివాకరుడు అయిన ప్రత్యక్ష నారాయణుడు తన ప్రతాపాన్ని వేడిమి రూపంలో ప్రదర్శించి వెళ్లిపోతాడు.  ప్రతి ఏడాది మే చివరి వారంలో ఈ రోహిణి కార్తె ప్రారంభమవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఏడాది సైతం మే 25వ తేదీ అంటే గురువారం ప్రారంభమై... జూన్ 8వ తేదీ వరకు కొనసాగుతుంది. అంటే ఈ పక్షం రోజులూ... వేడి గాలులు అధికం కావడం.. ఎండలు ప్రచండంగా కాయడం.. ఉక్కపోతలు.. దాహార్తి, వడదెబ్బలు, మరణాలు.. సంభవిస్తాయి. అలాంటి సమయంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలి. ఇంటి పట్టునే ఉండాలి.. అత్యవసరమైతే తప్ప.. బయటకు రాకూడదు. అలాగే మట్టి కుండలోని నీటినే తాగాలి. మజ్జిగ, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావ, ఎలక్ట్రాల్ పౌడర్ వంటివి   విరివిగా తీసుకోవాలి.  

ఇక వేసవి కాలంలో మసాలా దట్టించిన ఆహార పదార్ధాలు, వేపుళ్ళు, పచ్చళ్ళుతోపాటు అయిల్‌లో రంగరించి వండిన ఆహార పదార్ధాలకు సాధ్యమైనంత దూరంగా ఉండడం ప్రతి ఒక్కరికీ శ్రేయస్కరం. ఇక ఈ రోహిణి కార్తెలో ప్రతి ఒక్కరు తప్పకుండా రెండు పూటలా స్నానం చేయాలి. అలాగే అందరు కాటన్ వస్త్రాలు.. అవి కూడా తెల్లని రంగుతోపాటు తేలికపాటి రంగులు కలిగిన వాటినే ధరిస్తే వేడి నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే శారీరక వేడి సైతం తగ్గుతుంది. మరోవైపు మనం నివసించే ఇళ్లలోనే కాదు.. మన వీధుల్లో సైతం మొక్కలు నాటి.. వాటి ద్వారా సూర్యుని వేడితో.. భూతాపం పెరగకుండా కట్టడి చేయవచ్చు. ఆ క్రమంలో ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సమాజ హితం కోసం చేపట్టాల్సి ఉంటుంది. 

అలాగే చిన్నపిల్లలకు ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో వారి శరీరాన్ని తుడిచి బట్టలు మార్చడం చెప్ప తగ్గ సూచన. వేసవి కలంలో ముదురు రంగు దుస్తులు ధరించకపోవడం ప్రతి ఒక్కరికి శ్రేయస్కరం. మరీ ముఖ్యంగా పశుపక్ష్యాదులకు, జంతువులకు డాబాలపైన లేకుంటే రహాదారుల పక్కన పాత్రల్లో నీరు ఉంచితే.. వాటి వల్ల.. మనము సైతం.. ఎంతొకొంత పరోపకారం చేసిన వారమవుతాము. 

ఇక భూమి మీద వృక్ష జాతిని పెంచడం ద్వారా పర్యవరణాన్ని పరిరక్షించుకొంటే.. భవిష్యత్తులో సూర్యుడి భగభగలు కొంతలో కొంత అయిన తగ్గిడం ద్వారా.. మానవుడే కాదు.. భూతపం సైతం తగ్గుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలా కాకుండా.. కూలర్లు, ఏసీలు, స్ల్పిట్ ఏసీలు మనకు ఉన్నాయనుకొంటే మాత్రం.. రోహిణి కార్తి వేసవి కాలంలోనే కాదు.. ఏడాది పొడుగునా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాదు.. భవిష్యత్తు తరాలను సైతం అలవిమాలిన చర్మ రోగాల బారిన పడేలా చేసిన వారం అవుతాము. అందుకే.. వర్షకాలంలో అయిన మొక్కలు నాటండి.. వచ్చే ఏడాది ఈ వేడి.. కాస్తా అయిన తగ్గుతుందని మనకు కనపడని, వినపడని ఓ హెచ్చరికను ఆ మార్తండుడు ప్రజలు ఇచ్చినట్లుగా వేసవిలో వచ్చే రోహిణి కార్తెను అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నది మాత్రం సుస్పష్టం.

By
en-us Political News

  
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.