బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనల్లో నందమూరి సుహాసిని

Publish Date:Sep 21, 2023

Advertisement

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్‌పై యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  కానీ,  ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్  కానీ స్పందించలేదు. దీంతో  తెలుగుదేశం కీలక నేతల దగ్గర నుంచి పార్టీలోని సాధారణ కార్యకర్త వరకు అందరిలోనూ వీరి తీరుపై ఆగ్రహం, అసంతృప్తి,నెలకొని ఉంది. 

అలాంటి వేళ.. అదే ఫ్యామిలీకి చెందిన  ఓ మహిళ చంద్రబాబుకు పూర్తి సంఘీభావం ప్రకటించారు.   చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడంతోపాటు... చంద్రబాబు అరెస్ట్‌కి నిరసనగా.. హైదరాబాద్‌ మహానగరంలోని  పలు ప్రాంతాల్లో ఆందోళనలకు దిగుతున్న తెలుగుదేశం శ్రేణులకు మద్దతుగా నిలిచారు. స్వయంగా ఆందోళన కార్యక్రమాలలో పాల్గొన్నారు.  ఆమె నందమూరి సుహాసిని. ఎన్టీఆర్ తనయుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కుమార్తె. దీంతో ఆమెపై పార్టీ నుంచే కాదు ప్రజల నుంచి సైతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.   తెలంగాణ టీడీపీలో నందమూరి సుహాసిని అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.  తెలుగుదేశం పార్టీ పురోగతి కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి నందమూరి హరికృష్ణ. ఆయన కుమార్తె నందమూరి సుహాసిని సైతం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారంటూ తెలుగుదేశం శ్రేణులు ఆమె పట్ల అభిమానం చాటుతున్నారు.


గత ఎన్నికల్లో అంటే 2018లో నందమూరి సుహాసిని.. కుకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి.. నాటి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఓటమి పాలయ్యారు.  దీంతో ఆమె రాజకీయాలకే కాదు.. తెలుగుదేశం పార్టీకి సైతం దూరం జరుగుతున్నారనే ఓ ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. అయితే అదంతా కేవలం ప్రచారం మాత్రమేనని రుజువు చేస్తూ  నాటి నుంచి తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున.. రాష్ట్రంలో ఏక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ  ఏ కార్యక్రమం నిర్వహించినా.. ఆ కార్యక్రమంలో  సుహాసిని పాల్గొంటూ వస్తున్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తు వస్తున్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో.. ఆయన కుమార్తె నందమూరి సుహసిని పోలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. అలాంటి వేళ.. తెలుగుదేశం పార్టీ తరపున ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారడం.. మరోవైపు తెలంగాణలో హైదరాబాద్‌ మహానగరంలోనే కాకుండా.. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ తదితర జిల్లాల్లో సైకిల్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవడం.. ఇంకో వైపు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై పార్టీ అగ్రనాయకత్వం స్పందించకపోవడంతో  తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ మహానగరం నేడీ స్థాయిలో ఉండడానికి మూల కారణం చంద్రబాబునాయుడి విజన్, కృషి అనీ, అటువంటి వ్యక్తిని ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేస్తే కేసీఆర్, కేటీఆర్ స్పందించకపోవడమేమిటనీ సామాన్యులు కూడా నిలదీస్తున్న పరిస్థితి ఉంది.

ఆ ఆగ్రహం వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా మారే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తెలుగుదేశం గట్టి పోటీ ఇవ్వడం గ్యారంటీ అంటున్నారు. అలాగే నందమూరి సుహాసిన రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసినా విజయం నల్లేరు మీద బండినడకేనని చెబుతున్నారు.  

By
en-us Political News

  
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.