చక్కెర ఎగుమతులకు కేంద్రం బ్రేక్
Publish Date:May 14, 2026
Advertisement
దేశీయంగా చక్కెర ధరలు సామాన్యులకు భారాన్ని పెంచకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పంచదార లభ్యతను పెంచి, పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావడమే లక్ష్యంగా చక్కెర ఎగుమతులపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ముడి చక్కెర , తెల్ల చక్కెర, మరియు శుద్ధి చేసిన చక్కెర వంటి అన్ని రకాల చక్కెర ఉత్పత్తులకు ఈ ఎగుమతి నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. విదేశాలకు పంపే చక్కెరను 'నియంత్రిత' జాబితా నుండి 'నిషేధిత' జాబితాలోకి మారుస్తూ తాజా నిర్ణయం తీసుకున్నారు.
http://www.teluguone.com/news/content/sugar-export-ban-india-36-219752.html





