ఇంటా బయటా ఉక్కపోతతో విజయసాయి ఉక్కిరిబిక్కిరి!

Publish Date:Nov 18, 2024

Advertisement

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయికి ఇంటా బయటా ఉక్కపోత తప్పడం లేదు. విజయసాయిని ఇటు సొంత పార్టీకీ, అటు మీడియాకీ కూడా టార్గెట్ గా మారిపోయినట్లు కనిపిస్తోంది.  ఆయన ప్రకటనలకూ, వ్యాఖ్యలకూ కనీసం జగన్ రెడ్డి సొంత మీడియాలో కూడా ప్రాముఖ్యత లభించడం లేదు. పార్టీ నేతలూ కార్యకర్తలూ కూడా ఆయన మాటలను పెద్దగా పట్టించుకోవడం లేదు. పోనీ ఇంత కాలం అవమానించినా, కాదు పొమ్మన్నా, పాపం ముసలోడైపోయాడంటూ చులకన చేసినా పెద్దగా పట్టించుకోకుండా, దులిపేసుకుని జగన్ పట్ల తన వీర విధేయతను శ్రద్ధంగా, భక్తిగా, భయంతో చాటిన విజయసాయిరెడ్డికి కనీసం జగన్ నుంచి కూడా సరైన గుర్తింపు లేకుండా పోయింది.  ఈ నేపథ్యంలోనే విజయసాయి ఇటీవల తరచుగా సంయమనం కోల్పోతున్నారు. మీడియాలో ఎక్కడా తన మాటలకు ప్రాధాన్యత లభించకపోవడంతో సోషల్ మీడియాను ఆశ్రయించి ఇష్టారీతిగా నోరు పారేసుకుంటున్నారు. 

 గతంలో కూడా ఒక సారి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి సొంతంగా చానల్, పత్రిక ప్రారంభించబోతున్నట్లు ప్రకటించేశారు. ఆ సందర్భంలో ఆయన మనసులో ఉన్న మాట అనుకోకుండా బయటకు చెప్పేశారు. వైసీపీలో కూడా తనకు ప్రాధాన్యత లేకుండా పోయిందనీ, ఆ పార్టీ సొంత మీడియాలో కూడా తనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనీ ఆవేదన వ్యక్తం చేసేశారు. గతంలోనే తాను టెలివిజన్ చానల్ ప్రారంభిద్దామని అనుకున్నాననీ, అయితే అప్పట్లో జగన్ వారించడం వల్ల ఆగిపోయాననీ చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఎవరి చెప్పినా వినే పరిస్థితి లేదనీ, చానెల్ ప్రారంభించడం తధ్యమనీ కుండబద్దలు కొట్టేశారు.  అంతే ఆ తరువాత ఆయన మళ్లీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు. 

అసలింతకీ విజయసాయిరెడ్డి ఆవేదనకు, ఆక్రందనలకూ కారణమేమిటంటే.. మొదటి నుంచీ వైసీపీలో నంబర్ 2గా ఉండే విజయసాయి రెడ్డికి  ఆ తరువాత పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆయన నంబర్ 2 స్థానాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రమించేశారు. ఆ తరువాత విజయసాయికి పార్టీలో నామమాత్రపు ఉనికి మాత్రమే మిగిలింది.  ఆ సమయంలో  ఆయన సొంత చానల్, సొంత పత్రికా అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటన చేశారు. 

అన్నిటి కంటే ముఖ్యంగా  విజయసాయిపై  ఒక మహాళా అధికారితో అక్రమ సంబంధం ఆరోపణలు వెల్లువెత్తిన సమయంలో ఆయనకు మద్దతుగా వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ఆరోపణలు ఖండించడానికి ముందుకు రాలేదు.  దీంతో ఆయన ఇక పార్టీ అండ కోసం అర్రులు చాస్తూ కూర్చుంటే లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేసి సొంత మీడియా ఏర్పాటుపై ప్రకటన చేసేశారు. ఆ సమయంలోనే..  తాను ఏ పార్టీలో ఉన్నా తన చానల్ మాత్రం నిఖార్సైన వార్తలే ప్రసారం చేస్తుందని చెప్పి పార్టీ మార్పు సంకేతాలు కూడా ఇచ్చారు. ఈ సంకేతం ఇవ్వడం ద్వారా   జగన్ కు దాదాపుగా ఓ హెచ్చరిక చేశారు. లేదా బ్లాక్ మెయిల్ చేశారని అప్పట్లో  పరిశీలకులు విశ్లేషించారు.   

నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలైన తరువాత పార్టీలో ఆయనను పట్టించుకునే నాథుడే కరవయ్యారు. అక్రమ సంబంధం ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరైన సమయంలో కూడా ఆయనకు డిఫెన్స్ గా పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఆయన సోంత చానల్ అంటూ హడావుడి చేశారు.   ఇదంతా జరిగి ఐదు నెలలు కావస్తోంది. అయినా విజయసాయి చానెల్  ఏర్పాటు విషయంలో ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.  ఇక తాజాగా విజయసాయి రెడ్డి మరో సారి ఇక్కట్లలో పడ్డారు. ఆయన హద్దూ ఆపూ లేకుండా ఓ మీడియా సంస్థ అధిపతిపై చేసిన వ్యాఖ్యలకు ఆయన దీటుగా సమాధానం ఇచ్చారు. తన చానెల్ లోనే లైవ్ డిబేట్ కు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. దీంతో విజయసాయి మళ్లీ సొంత చానల్ ప్రకటన చేసి, తన చానెల్ ద్వారానే ఆ మీడియా ప్రతినిథికి బదులిస్తానని చెప్పి ప్రస్తుతానికి తప్పించుకోవడం కోసం చూస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.