ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో తనిఖీలు కారణమదేనా?

Publish Date:Jul 16, 2022

Advertisement

రెడ్డొచ్చె మొదలాడు అన్న సామెతలాగే ఉంది జగన్ సర్కార్ తీరు. మూడేళ్లుగా ఆ పార్టీ ఘనంగా చెప్పుకుంటున్న సంక్షేమ ఫథకాలపై ఆ పార్టీ అధినేతకే అంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ కే అనుమానం కలిగిందా అన్న అనుమానాలు ఆ పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి. గత మూడేళ్లుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా.. సర్కార్ పై ఇంతటి వ్యతిరేకత ఏమిటన్నది జగన్ కు అంతుబట్టడం లేదంటున్నారు.

తాజాగా విడుదలైన ఒక జాతీయ స్థాయి సర్వేలోనే ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని వెల్లడి కావడంతో జగన్ లో  అంతర్మథనం మొదలైందని అంటున్నారు. ఇటీవల వాహన మిత్ర లబ్ధిదారులకు సొమ్ము పందేరం చేసిన కార్యక్రమంలో ఆయన తన భుజాలను తానే చరుచుకుంటూ.. అద్భుతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది జగనన్న ప్రభుత్వమేనని తనకు తానే కితాబిచ్చుకున్నారు. అంతలో ఏమైందో ఏమో.. సంక్షేమ పథకాలపై లబ్ధిదారులు సైతం సంతృప్తి వ్యక్తం చేయకపోవడానికి తన మానస పుత్రికగా జగనే చెప్పుకుంటున్న సచివాలయ వ్యవస్థేకారణమన్న అనుమానం ఆయనకు కలిగిందా అని వైసీపీ శ్రేణులు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. అందుకే జగన్ సచివాలయాలలో ఆకస్మిత తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారని అంటున్నాయి. సంక్షేమ పథకాల లబ్దిదారులు ఏమనుకుంటున్నారు,

సచివాలయాల్లో వారికి అందుతున్న సేవలు ఎలా ఉన్నాయి ? లోటుపాట్లు  ఏమిటి అన్న విషయాలు తెలుసుకునేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని జగన్ నిర్ణయించారు. తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంఘనంగా ప్రారంభించిన గ్రామ,వార్డు సచివాలయాలకే   ప్రతీ సంక్షేమ పథకాన్నీ లింక్ చేసిన ప్రభుత్వం. ఇప్పుడు అలా చేసి తప్పు చేశామా అని మధన పడుతున్నట్లు పార్టీ శ్రేణులు అంటున్నాయి. అందుకే సచివాలయాల పని తీరు ఎలా ఉంది? సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా జరుగుతోంది.

 వాటిపై ప్రజల గ్రామ,వార్డు సచివాలయాలల్లో తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లుకు ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఈ తనిఖీల కోసం ప్రభుత్వం ముగ్గురు అధికారులకు బాధ్యతలు అప్పగించింది. తహసీల్దార్ మునిసిపల్ కమిషనర్, మూడు జాయింట్ కలెక్టర లకు ఈ తనిఖీల బాధ్యతలు అప్పగించింది.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో చేపడుతున్న తనిఖీల్లో ఏయే అంశాల్ని పరిశీలించాలన్నది కూడా కలెక్టర్లకు నిర్దేశించినట్లు తెలుస్తోంది.  ఇందులో సచివాలయాల్లో ప్రతి రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ప్రజలకు ప్రభుత్వ పథకాలను సక్రమంగా అందించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు...!!

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో   నైతికత, విలువలు పలుచన అయిపోతున్నాయి.   ఏ పార్టీ నుంచి గెలిచామనే అంశంతో సంబంధం లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార కాంక్ష,  రాజకీయ లబ్ధికి మాత్రమే పెద్ద పీట వేస్తున్న నేతలే ఎక్కువగా కనిపిస్తున్నారు
గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఒకింత జోరు తగ్గించిన వంగవీటి రాధా.. ఉన్నట్టుండి జనసేనానిని తో భేటీ అవ్వడం, అదీ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి రగిలిన సమయంలో కలవడం వెనుక పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సొంత మేనకోడలు నిశ్చితార్థానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడంపై రాజకీయవర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతోంది. గతంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థానికి జగన్ దంపతులు హాజరైన సంగతిని పలువురు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..!
అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.