ఢిల్లీలో సుబ్బారావు గుప్తా.. సింగిల్ హ్యాండ్ భారీ స్కెచ్

Publish Date:Feb 3, 2022

Advertisement

జంతర్ మంతర్ ఛ్ మంత్రకాళి.. అని ఎవరో మాయ చేసినట్లు.. వైయస్ జగన్ పార్టీ కీలక నేత సుబ్బారావు గుప్తా.. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్షమయ్యారు. చేతిలో బ్యానర్ పట్టుకుని.. మరీ ఆందోళనకు దిగారు.. తన కుటుంబాన్ని కాపాడాలని.. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని.. తన ఇంటిపైనే కాకుండా.. గుంటూరు లాడ్జిలో తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఢిల్లీ వేదికగా డిమాండ్ చేస్తూన్నారీ సుబ్బారావు గుప్తా. అంతేకాదు.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఈ సుబ్బారావు గుప్తా.. తన ప్రయత్నాలను.. ఢిల్లీలో ముమ్మరం చేశాడని సమాచారం. అయితే ఎప్పుడు అమిత్ షాను కలిస్తాడనేది మాత్రం స్పష్టం కాలేదని తెలుస్తోంది. కానీ.. ఢిల్లీలో అమిత్ షాను కలవకుండా.. వెనక్కి ఒంగోలు వెళ్లేదే లే.. అన్నట్లు.. సుబ్బారావు గుప్తా ఉడుం పట్టుతో ఉన్నాడని మాత్రం స్పష్టమవుతోంది.  

జగన్ పార్టీలో చోటు చేసుకోంటున్న పరిణామాలపై పెదవి విప్పితే.. తనను ఇంతలా కొడతారా? అంటూ.. ఒంగోలులోని మంత్రి బాలినేని వాసన్న అండ్ కోపై సుబ్బరావు గుప్తా ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారట. జగన్ వీరాభిమానిగా.. జగన్ పార్టీ బాగొగుల కోసం ఇంతలా మంచి చెప్పేవారు ఈ రోజుల్లో ఎక్కడున్నారని.. మంచి చెప్పినా.. తనకు అవమానం జరిగిందని తన సన్నిహితుల వద్ద సుబ్బారావు గుప్తా వాపోయినట్లు తెలుస్తోంది. గుంటూరు లాడ్జిలో ప్రాణ భయంతో తలదాచుకున్న తనపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. రైట్ హ్యాండ్ సుబానీతో చితకబాదించడం.. ఆ తర్వాత.. మంత్రే స్వయంగా  తనకు కేకు తినిపించడం.. అంతా తెరచాటు రాజకీయమని సుబ్బారావు గుప్తా అభివర్ణిస్తున్నారని తెలుస్తోంది. 

ఏదీ ఏమైనా.. తనపై దాడి చేసిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రైట్ హ్యాండ్ సుభానీ మాత్రం అత్తరింటికి వెళ్లి వచ్చినట్లు .. పోలీస్ స్టేషన్‌కు అలా వెళ్లి.. ఇలా స్టేషన్ బెయిల్‌తో బయటకు రావడం మాత్రం సుబ్బారావును బాగా కృంగ తీసిందని తెలుస్తుందీ. కానీ సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని వాసన్న అండ్ కో దాడిని తెలుగు రాష్ట్రాల్లోని ఆర్యవైశ్య సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. అంతేకాదు.. సుబ్బారావుపై దాడిని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తామంటూ.. జగన్ పార్టీ నేతలకు సదరు సంఘాలు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాయని తెలుస్తోంది. 

ఆ క్రమంలోనే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగమేఘాల మీద రంగంలోకి దిగి... పోలీసులకు చెప్పి.. సుభానీని అరెస్ట్ చేయించడం... సుబ్బారావుగుప్తాకు కేకు తినిపించడం.. ప్రకాశం జిల్లాలో ఏక్కడంటే అక్కడ పొట్టి శ్రీరాముల విగ్రహాం ఏర్పాటుకు తాను సొంతంగా నిధులు ఇస్తానని ప్రకటించడం.. ఇలా మళ్లీ సుబ్బారావు గుప్తా సామాజిక వర్గానికి మంత్రి బాలనినే వాసన్న దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారని తెలుస్తోంది. కానీ సుబ్బారావు గుప్తా ఎపిసోడ్‌లో జగన్ పార్టీకి జరగాల్సిన నష్టం మాత్రం అప్పటికే జరిగిపోయిందన్న విషయం అందరికీ తెలిసిందే. 

సుబ్బారావు గుప్తాపై దాడి జరిగిన వెంటనే.. మంత్రి బాలినేని వాసన్న రంగంలోకి దిగి.. సుభానీపై బలమైన కేసులు పెట్టించడంతోపాటు మీడియా సాక్షిగా.. సుబ్బారావు గుప్తాకు, ఆయన కుటుంబానికి క్షమాపణలు చెప్పి ఉంటే.. ఈ సుబ్బారావు గుప్తా ఎపిసోడ్.. దేశ రాజధాని ఢిల్లీకి చేరేదే కాదనే టాక్ ఒంగోలులో వైరల్ అవుతోంది. అదీకాక.. గుంటూరు లాడ్జిలో సుబ్బారావు గుప్తాపై సుభానీ దాడి చేసిన వీడియో.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.. అవుతోంది కూడా. ఈ నేపథ్యంలో సదరు వీడియోను.. సుబ్బారావు గుప్తా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చూపిస్తే.. జగన్ సర్కార్‌కు ఇక షో పడే అవకాశం లేక పోలేదని సుబ్బారావు గుప్తా సన్నిహితులు జోస్యం చెబుతున్నారు. ఏదీ ఏమైనా.. ఒంగోలు గల్లీ నుంచి.. ఢిల్లీకి చేరిన ఈ సుబ్బారావు గుప్తా.. రేపోమాపో.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసినా ఆశ్చర్యపడక్కర్లేదని ప్రకాశం జిల్లా వాసులు పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
తీపి పదార్థమనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. చివరకు విగతజీవిగా మారాడు!
డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.