Publish Date:Jun 30, 2022
మనలో తొంభై శాతం మందికి విద్యార్ధి దశలో మాథ్స్ టీచర్ అంటే భయం. క్లాసులో అప్పటిదాకా కాస్తంత సరదాగా వున్నపుడు మాథ్స్ టీచర్ రావడంతో భయం తరగతి గదంతా ఆవహిస్తుంది. భయంతో కూడిన గౌరవం ప్రదర్శించడం పరిపాటి. టీచర్ లెక్క తప్పుచేస్తే తిట్టడం లేదా కొట్టడం చాలా సహజం. విద్యా ర్ధులు పెద్ద అవమానంగా తీసుకోవడమూ అంతే సహజం. కానీ ఒక వూళ్లో 8వ తరగతి విద్యార్ధులు టీచర్ ని గొర్రె అన్నారు. ఆమెకి వాళ్లు తనని అలా పిలవడంలో అసలు అర్ధం చాలా రోజుల తర్వాత తెలిసి ఎంతో ఆనందించింది. ఇంతలా అభిమానించారా అని కన్నీళ్ల పర్యంతమయింది.
తన విద్యార్దులు తనను గొర్రె అని పిలిచారు. ఆ పిలవడంలో అంతరార్ధం ఏమిటో తెలీక టీచర్ చాలా బాధపడింది. ఆ మాటకు అర్ధమేమిటి, పిల్లలు తనను అలా ఎందుకు పిలిచి వుంటారో ఎవరైనా చెప్ప గలరా అని ఏకంగా సోషల్ మీడియా రెడిట్ లో ఈమధ్యనే పోస్ట్ చేసింది. అది చదివిన చాలామంది ఆమెను బాధపడ నవసరం లేదని అన్నారు. కారణం టీచర్ని పిల్లలు ప్రేమగానే అలా సరదాగా పిలిచా రని అర్ధంచేసు కోమని నెటిజన్లు వివరణ ఇచ్చారు. కొందరు విద్యార్ధలకూ మాథ్స్ టీచర్లంటే గౌరవం వుంటుంది. వాళ్లూ సరదాగా వారిలో వారు అలా నిక్‌నేమ్‌తో పిలుచుకుంటూంటారు. బహుశా ఈ టీచర్ అది వినే వుంటారు. పాపం ఎంతో బాధపడీ వుంటారు.
గౌరవం వ్యక్తం చేయడంలో పిల్లల పద్ధతి వేరుగా వుంటుందనేది ఆమె కాస్తంత ఆలస్యంగానే తెలుసు కున్నారు. తనను గొర్రె అని పిలవడంలో వారికి తన పట్ల ఎంతో అభిమానం, గౌరవం వుందని అందుకే అలా పిలిచేవారని నెటిజన్ల వివరణతో ఆమె ఎంతో పొంగిపోయింది. ఈసారి తిట్టుకోలేదు. భడవల్లారా ఇన్నాళ్లూ ఇంత ప్రేమాభిమానాలను దాచుకున్నార్రా అని ఆనందంతో కన్నీళ్ల పర్యంతమయ్యారు ఆ టీచర్. టీచర్లకు విద్యార్ధుల నుంచి డబ్బులు అక్కర్లేదు. మంచి విద్యార్ధులు, మంచి వ్యక్తులుగా సమా జంలో నిలవడమే కోరుకుంటారు. ఇంతటి అభిమానమే ఆశిస్తారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/students-called-teacher-goat-39-138801.html
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.