రీల్స్ మోజుతో ప్రాణగండం!
Publish Date:Sep 30, 2024
Advertisement
ఇంస్టాగ్రామ్ రీల్స్ మోజులో పడి ఓ విద్యార్థి కాలువలో దిగి చేసిన సాహసం అతని ప్రాణాలకే ఎసరు తెచ్చింది. ఇస్టాగ్రాం రీల్స్ చేసేందుకు ఆదివారం సీతానగరం మండలం పేరంటమ్మ కాలువలో దిగిన పదవ తరగతి చదువుతున్న విద్యార్థి వినయ్.. ఒక్కసారిగా నీటిలో మునిగి గల్లంతు అయ్యాడు. సీతానగరం జ్ఞాననిధి విద్యానికేతన్ లో పదవ తరగతి చదువుతున్నాడు. గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనతో సీతానగరంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. రీల్స్ కోసం పనిన్న సాయంత్రం సమయంలో ఈఘటన చోటు చేసుకోగా.. చీకటికావడంతో సెల్ ఫోన్ లైట్లతో గాలింపు చర్యలు చేపట్టారు.. ఈ రోజు కూడా గాలింపు చర్యలు కొనసాగే అవకాశం ఉంది.. అయితే, రీల్స్ కోసం ఏదో చేద్దామని.. ఇలా ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దనిపోలీసులు సూచిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/student-faced-problem-with-insta-reels-25-185919.html





