దక్షిణాదిలో బీజేపీ బలోపేతమే లక్ష్యం.. ఇక అన్ని రాష్ట్రాలలోనూ ఒంటరి పోరే.. అమిత్ షా

Publish Date:Jun 10, 2026

Advertisement

 కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 12 ఏళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మీడియాతో ప్రత్యేకంగా నిర్వహించిన చిట్ చాట్ లో సంచలన విషయాలు వెల్లడించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్నారు. ఇంకా ఈ చిట్ చాట్ లో  అమిత్ షా దేశ రాజకీయాలు, నియోజకవర్గాలపునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ వ్యూహాలు సహా పలు  కీలక,  సంచలన విషయాలు చెప్పారు.  

నియోజకవర్గాల పునర్విభజన వల్ల  ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదన్న ఆయన.. డీలిమిటేషన్ పై  దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న   అభ్యంతరాలపై స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం లోక్‌సభలో ఆయా రాష్ట్రాలకు ఉన్న నిష్పత్తిని ఏమాత్రం దెబ్బతీయకుండా..  అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం సీట్లు పెరిగేలా బిల్లులో పొందుపరిచినట్లు ఆయన వెల్లడించారు. అలాగే.. మహిళా రిజర్వేషన్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రస్తుతం పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉందని, అవసరమైన రాజకీయ మద్దతు లభించగానే దీనిని ఆమోదించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న  వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.  

ఇక దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే  వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంపై మాట్లాడిన అమిత్ షా..  ప్రస్తుతం ఈ అంశంపై ఏర్పాటు చేసిన  కమిటీ లోతుగా అధ్యయనం చేస్తోందని తెలిపారు. కమిటీ నివేదిక సమర్పించిన వెంటనే.. దానికి సంబంధించిన బిల్లుకు పార్లమెంట్‌లో అవసరమైన మద్దతు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమిలోని ప్రాంతీయ పార్టీల సంబంధాలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జెడియు ,  టిడిపి,    శివసేన సహా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నీ పూర్తి సంతృప్తితో ఉన్నాయని, తమ వల్ల ఏ ప్రాంతీయ పార్టీకీ ఎలాంటి ఇబ్బందీ లేదనీ అమిత్ షా చెప్పారు. అక్కడితో ఆగకుండా..  భవిష్యత్తులో కొత్తగా మరే ఇతర ప్రాంతీయ పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

 ముందు ముందు  ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సొంత బలంతో ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాలలో  తెలంగాణపై తాము ప్రత్యేక దృష్టి సారించామన్న అమిత్ షా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కుండబద్దలు కొట్టేశారు. అలాగే.. పంజాబ్‌లో సైతం శిరోమణి అకాలీదళ్  సహా ఏ ఇతర పార్టీతోనూ పొత్తు ఉండదని, అక్కడ ఒంటరిగా పోటీ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తామని అన్నారు.   వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ మళ్లీ  అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  

 దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ తప్పనిసరిగా ఉమ్మడి పౌరస్మృతి  అమలు చేస్తామని అమిత్ షా చెప్పారు.  దేశ సరిహద్దు ప్రాంతాల భద్రతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని   ఉపయోగించబోతున్నామని, సరిహద్దులన్నింటినీ కట్టుదిట్టంగా ఆధునీకరిస్తామని పేర్కొన్నారు. మొత్తంగా..  మోదీ 12 ఏళ్ళ పాలన ముగిసిన వేళ అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు అటు జాతీయ రాజకీయాల్లోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.