భయానకంగా భౌ- భౌ...బెంబేలెత్తిస్తున్న వీధి కుక్కలు

Publish Date:Aug 26, 2025

Advertisement

 

బౌ..బౌ మనే శబ్దం ఇప్పుడు దేశవ్యాప్తంగా దడ పుట్టిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కల తో గ్రామాల నుంచి పట్టణాల దాకా భయోత్పాతం సంతరించుకొంటోంది. కాలనీలు, వీధుల్లో వీటి అరుపులు వినిపిస్తేనే అలజడి  రేగుతోంది. వెంటపడి కరవడం, కాట్లు చేయడంతో ప్రాణాంతకంగా మారింది. వీధి కుక్కల బెడదపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ గా స్పందించి తగు చర్యలు తీసుకోవడంతో పాటు వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో వీటికి ఆహారం వేయడం కూడా నేరంగా భావిస్తూ చర్యలు తీసుకోవాలని ఈనెల 22న ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అంటే దేశవ్యాప్తంగా వీటి అలజడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 3.50 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేశారు. వీటి కాట్లతో  ర్యాబిస్ వ్యాధికి గురి కాకుండా అధికారులు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో వీటితో భయానకమే అవుతుంది.

*కడపలో లోనే 14376 మందికి కుక్క కాట్లు

వీధి కుక్కల స్వైర  విహారం ప్రజలను భయపెడుతోంది. ఒక కడప జిల్లాలోనే ఇంచుమించు రెండున్నర ఏళ్ల కాలంలో 14376 మంది కాటేశాయంటే ఏ స్థాయిలో వీధి కుక్కలు మనుషులపై దాడి చేస్తున్నాయో ఊహించవచ్చు. జిల్లాలో 2023లో 5485 మందిని, 2024 లో 5549 మందిని 2025 ఇప్పటివరకు 3342 మందిని వీధి కుక్కలు కాటేశాయి. 

అంటే సగటున సుమారు 400 మందిని నెలకు కుక్కలు కాటేస్తున్నాయి. ఇది అధికారులు అధికారిక లెక్క మాత్రమే. అనధికారికంగా అయితే ఇంతకు మూడింతలు గా కుక్క కాట్లు తప్పడం లేదు. కుక్కకాటు గురైన కొందరు దానిపై అవగాహన లేకపోవడం, చిన్నచిన్న గాయాలే కదా అని పెద్దగా పట్టించుకోకుండా ఉండడం లాంటి కారణాలతో ఇవి పూర్తి గా నమోదు కావడం లేదు. నిజంగా అన్ని నమోదు అయితే నెలకు 1500 కు పైమాటే అని అధికారులే అనధికారికంగా చెబుతున్న మాటలు.

*పెంపుడు కుక్కలూ కాటేస్తున్నాయి

వీధి కుక్కలే కాదు పెంపుడు కుక్కలూ(పెట్ డాగ్స్)కాటేస్తున్నాయి. వీటితోనూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అవసరమయ్యాయి . ఒక అంచనా ప్రకారం  నెలకు సుమారు 200 మందిని పెంపుడు కుక్కలు కూడా కాటేస్తున్నాయి. యజమానుల కుటుంబ సభ్యులు,వారి ఇంటికి వచ్చేవారు, చుట్టుపక్కల వారికి వీటి తో  ఏర్పడుతోందని చెప్పుకొస్తున్నారు. దీంతో కుక్కలు పెంచుకునే యజమానులు వాటిపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది

*ఒకే రోజు 27 మందిని కాటేసిన ఒకే కుక్క 

బద్వేల్ పట్టణంలో ఓ కుక్క భయానక వాతావరణాన్ని సృష్టించింది. కుక్కల్లో ఆవేశపూరిత కుక్కలు ,పిచ్చి పట్టిన కుక్కలు ఉంటాయి. ఈ కోవకు చెందిన ఓ కుక్క బద్వేల్ లో ఈ ఏడాది మే 26న 27 మందిని కాటేసి కలకలం రేపింది .దీంతో బద్వేలు వాసులు భయాందోళనలకు గురయ్యారు. ఇలాంటి కుక్కలు చాలా ప్రమాదకరంగా చెప్పుకోవాలి

*నివేదిక కోరిన డిల్లీ 

బద్వేల్ లో ఒకేరోజు 27 మందిని కాటేసిన కుక్క వ్యవహారంపై ఢిల్లీలోని సెంట్రల్ మీడియా స్కానర్ రాష్ట్ర వైద్య శాఖను నివేదిక కోరింది. ఆ వీధి కుక్క ఎంతమందిని కాటేసింది. వారికి వ్యాక్సిన్స్ వేశారా, చికిత్స చేశారా,వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలతో నివేదిక కోరడం జరిగింది .ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ ఆదేశాలతో జిల్లా వైద్యాధికారులు బద్వేల్ కు వెళ్లి వ్యాక్సిన్ విచారణ చేసి అందుబాటులో ఉన్నాయి, వీరందరికీ వ్యాక్సిన్ చేశారని నివేదిక పంపడం జరిగింది.

*ఇద్దరు మృతి 

 కడప జిల్లాలో రాబిస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. వీధి కుక్కలు పెద్ద ఎత్తున మనషులపై  పై దాడి చేస్తునన్నా  గాయాలు కావడం వైద్యం చేయించుకోవడంతో బయటపడుతున్నారు .ఒకటి రెండు చోట్ల ర్యాబిస్ కారణంగా మృత్యువాత పడ్డారు .2003 వ సంవత్సరం పులివెందులలో ఒకరు 2024లో కడపల ఒకరు మృతి చెందారు. వీధి కుక్కల కారణంగా ఇలాంటి పరిస్థితులు ఏర్పడడంతో ఇప్పుడు దేశమంతా వీటి వ్యవహారం చర్చ అంశంగా మారింది

*సుప్రీంకోర్టు ఆదేశాలతో అయినా!

వీధి కుక్కల వ్యవహారంపై సీరియస్ గా స్పందించిన సుప్రీంకోర్టు త్రి సభ్య ధర్మాసనం  ఢిల్లీతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేసింది.వీధి కుక్కలకు  స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వదిలేయాలని, వ్యాధులు ఆవేశపూరిత  ప్రవర్తన కలిగిన కుక్కలను షెల్టర్ కు తరలించాల్సిందేనని, బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టడం నేరంగానూ, ఉల్లంఘనగాను పేర్కొంది .వీధుల్లో ఆహారం పెట్టే వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

జంతు  ప్రేమికులు వీధి కుక్కలను  దత్తత  తీసుకోవచ్చు కానీ మళ్ళీ వాటిని మళ్ళీ వీధుల్లో వదిలేయ కూడదని సూచించింది. కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా అన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం భాగస్వామ్య పక్షాలుగా చేస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రియల్ టైం పరిశీలన కోసం ప్రత్యేక డ్యాష్  బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. సెప్టెంబరు నెల నాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో అయనా మున్సిపాలిటీలు, పంచాయతీలో వీధి కుక్కల వ్యవహారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం అధికారులపై ఉంది.


 

By
en-us Political News

  
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.