ప్రశ్న రావణ్ వెనుక తెలుగు దేశం.. కొడాలి నాని వ్యాఖ్యల వెనుక వ్యూహం అదేనా?

Publish Date:Jul 9, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి,  వైసీపీ సీనియర్ నాయకుడు   కొడాలి నాని రూటే సెపరేటు. తెలుగుదేశం కూటమి   ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత రెండేళ్లుగా ఆయన వీలైనంత వరకు ప్రభుత్వ నిఘా నేత్రం నుండి తప్పించుకుంటూ, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు.  అదే సమయంలో వైసీపీలో తన ఇంపార్టెన్స్ తగ్గకుండా, పార్టీ క్యాడర్ తనను మరచిపోకుండా  క్రమం తప్పకుండా మీడియా ముందుకు వస్తూ.. ఏదో ఒక సంచలన వ్యాఖ్యతో  వార్తలలో ఉంటున్నారు.  తాజాగా గుడివాడలో  కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.

 ప్రశ్న రావణ్ కేసు విషయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.  యూట్యూబర్ రావణ్  తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడని, ఆయన నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడుల కోసమే పనిచేస్తాడని ఆరోపించిన కొడాలి నాని..  ప్రశ్న రావణ్ టిడిపి నాయకులకు వ్యతిరేకంగా ఒక్కవ్యాఖ్య కూడా చేయలేదని కొడాలి నాని ఈ సందర్భంగా చెప్పారు.  వైసీపీ అధికారంలో  ఉన్నప్పుడూ, ఇప్పుడు అధికారంలో లేని సమయంలోనూ కూడా ప్రశ్న రావణ్ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా.. తాము ఎప్పుడూ అతడిని అణచివేయడానికి ప్రయత్నించలేదని చెప్పుకొచ్చారు.   అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం, ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపేవారిని కొత్త చట్టాల పరిధిలోకి తెస్తూ, 'ఉప్మా', 'ఇడ్లీ' కేసులు పెడుతూ జైళ్లలో పెడుతోందంటూ సెటైర్లు వేశారు. 

అయితే నాని వ్యాఖ్యల వెనుక ఉద్దేశం మాత్రం వేరే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తెలుగుదేశం, జనసేన చెలిమిని చెడగొట్టాలన్న వ్యూహంతోనే కొడాలి నాని.. ప్రశ్న రావణ్ జనసేనాని పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యల వెనుక తెలుగుదేశం ఉందన్న వాదనను తెరమీదకు తీసుకువచ్చారంటున్నారు.  అయితే జనం కొడాలి నాని కుట్ర సిద్ధాంతాన్ని విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి.

మిత్రపక్షమైన జనసేన అధినేతకు వ్యతిరేకంగా ప్రశ్న రావణ్ ను తెలుగుదేశం ప్రోత్సహిస్తోందన్న నేరేటివ్ నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు.  అయితే వైసీపీ ఎకోసిస్టమ్ లోనే పచ్చి అబద్ధాన్ని ఎవరు నమ్మినా నమ్మకున్నా పదే పదే వల్లె వేస్తే కొందరైనా ఆ ఉచ్చులో పడకుండా ఉంటారా?  అనన భావనతో ముందుకు వెళ్లే సంస్కృతి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ క్రమంలోనే కొడాలి నాని  ఇప్పుడు ప్రశ్న రావణ్ వెనుక తెలుగుదేశం అనే కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారని అంటున్నారు. ఇక కొంత కాలం పాటు వైసీపీ ముక్తకంఠంతో ఈ ఆరోపణలను గుప్పిస్తూనే ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద కొత్త కొత్త కుట్ర సిద్ధాంతాలను తెరమీదకు తీసుకురావడంలో వైసీపీలోకోడాలి నానిది ఒక ప్రత్యేక స్టైల్ అని నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు.  

Kodali Nani, Pawan Kalyan, Chandrababu Naidu, TDP Janasena Alliance, YouTuber Ravan Arrest

By
en-us Political News

  
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.