వ్యూహాత్మక వైరమేనా?

Publish Date:Jan 16, 2023

Advertisement

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య వైరం వ్యూహాత్మకమేనా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఈ ఎనిమిదిన్నరేళ్ల కాలంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత నుంచి ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి మోడీ ఇరువురి మధ్యా మైత్రి పలు సందర్భాలలో ప్రస్ఫుటంగా కనిపించిందని చెబుతున్నారు.  

ఇప్పుడు కూడా ఉప్పూ నిప్పులా.. కనీసం ఒకరిని ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడనంతగా డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నా.. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ముచ్చటగా మూడవసారి ఎన్నికల్లో గెలిచి   హ్యాట్రిక్ సాధించేందుకు అనుసరిస్తున్న వ్యూహమే తప్ప మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు. వ్యూహాత్మకంగా  నువ్వు కొట్టి నట్లు చేయి నేడు ఏడ్చినట్లు చేస్తాను అన్నట్లుగానే వీరి తీరు ఉందని చెబుతున్నారు.  ఇద్దరి మధ్య ఏదో భీకర యుద్ధం సాగుతోందనే భ్రమలు కలిపించేందుకు, అటు నుంచి ఇటు నుంచి ఉభయ పార్టీలూ   మాటల తూటాలు సంధించుకుంన్నారని విశ్లేషిస్తున్నారు.  విశ్లేషకుల మాటలు ఎలా ఉన్నా టీపీసీసీ చీఫ్ రెవంత్ కూడా ఇదే అంటున్నారు. ఇరువురూ కలిసి ప్రజలను మోసం చేసి  అటు కేంద్రంలో మోడీ, ఇటు రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారని అంటున్నారు.  విజయ దశమి పండగ పూట కేసేఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. కేంద్రంలో ప్రదాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకే కేసేఆర్ ప్రాంతీయ పార్టీ పేరు మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు.

మోడీ గుజరాత్ మోడల్ కు కేసీఆర్ తెలంగాణ మోడల్  ప్రత్యామ్నాయం అంటున్నారు. అయితే కేసీఆర్ ఈ ఏడాది 9 రాష్ట్రాలకు జరగనున్న   అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పాలిత రాష్ట్రాలపై గురి పెట్టడం లేదు. ఆయన తన దృష్టి మొత్తాన్నీ ఏపీపైనే కేంద్రీకృతం చేశారు. అలాగే గత ఏడాది చివరిలో జరిగిన  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.  ఇప్పడు కూడా మహారాష్ట్ర, కర్ణాటకలలో పోటీ చేస్తామంటున్నారు కానీ..  తన జాతీయ పార్టీకి అధ్యక్షుడిని నియమించడానికి మాత్రం ముందుగా ఏపీనే ఎన్నుకున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుగుతాయి. అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకూ అవి ఊహాగానాలు మాత్రమే.  

నిజానికి, కేసేఆర్ జాతీయ రాగం ఎత్తుకున్నదే, కేంద్రంలో మళ్ళీ మరో సారి, మోడీని గెలిపించెందుకే  అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చెబుతున్నది నిజమేనా అన్న అనుమానం కలగడానికి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అనుసరిస్తున్న విధానమే కారణం. అన్నిటికీ మించి ఆయన తెలంగాణలో వేసే ప్రతి అడుగూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీనం చేయడానికే అన్న విధంగా ఉంటోంది.  తమిళ నాడులో కాంగ్రెస్ మిత్ర పక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డిఎంకే అధినేత, ఆ ర్రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్  ను కలిసి కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు.   మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిలోని, శివసేన, ఎన్సీపీలను కాంగ్రెస్ నుంచివిడదీసే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లోనూ కాంగ్రెస్ తో కలిసున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం) ను థర్డ్ ఫ్రంట్ కు ఆహ్వానం పలికారు. సరే అవేమీ కార్యరూపం దాల్చలేదనుకోండి.. కానీ ఆ ప్రయత్నం అయితే కేసీఆర్ చేశారు.  అవన్నీ విఫలమైన తరువాత కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసి కూడా బీజేపీ అధికారంలో ఉన్న  గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్టాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ ఊసే ఎత్తలేదు.

 ఇప్పుడు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న కర్ణాటక, మహారాష్ట్రలలో పోటీ చేస్తామంటున్నారు. అక్కడ పోటీ చేస్తే చీలేది బీజేపీ వ్యతిరేక ఓటేననడంలో సందేహం లేదు. అంతవరకు ఎందుకు, గడచిన ఎనిమిది సంవత్సరాలలో  తెలంగాణలోనే కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, సిపిఐ, పార్టీలకు చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను ప్రలోభాలకు గురి చేసి గోడ దూకించిన కేసీఆర్, బీజేపే వైపు మాత్రం కన్నెత్తయినా చూడలేదు.  అందుకే  కేసీఆర్ తెర తీసిన భారతీయ రాష్ట్ర సమితి, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తన పార్టీ మరో సారి అధికారాన్ని పదిల పరుచుకోవడానికేనని విశ్లేషకులు అంటున్నారు. 

By
en-us Political News

  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.