హర్మూజ్ క్లోజ్ ఎప్పటి వరకూ అంటే?

Publish Date:Aug 10, 2026

Advertisement

ప్రపంచ వాణిజ్య చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా  ముడిచమురు సరఫరాకు  ముప్పు వాటిల్లింది. అమెరికా,  ఇరాన్ మధ్య రాజుకున్న  వివాదం కారణంగా   కీలకమైన హార్ముజ్ జలసంధి  మార్గాన్ని ఇరాన్ మూసేసింది. ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అంతే కాకుండా ఈ మూసివేత.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత కాలం కొనసాగుతుందని ఇరాన్ నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పేసింది.   అంటే 2029 జనవరి 20 వరకు హర్మూజ్ జలసంధి మూత కొనసాగుతుందని ఇరాన్ విస్పష్టంగా ప్రకటించింది. ట్రంప్ తమ డిమాండ్లన్నింటినీ పూర్తిగా అంగీకరిస్తే తప్ప ఎలాంటి చర్చలకు తావులేదని కుండబద్దలు కొట్టేసింది.  ట్రంప్ హయాంలో  ఒప్పందం కుదిరే ప్రసక్తే లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ సలహాదారు మజిద్ షాకేరీ ఈ మేరకు విస్పష్ట ప్రకటన చేశారు. ఈ నిర్ణయం కేవలం అమెరికాకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ అనడంలో సందేహం లేదు. 

ఈ తీవ్ర ఉద్రిక్తతల  మధ్య అమెరికా తన చమురు నిల్వల విషయంలో గత 43 సంవత్సరాలలో ఎన్నడూ చూడని అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ వద్ద ఉన్న ముడిచమురు నిల్వలు అధికారికంగా 300 మిలియన్ బారెళ్ల కంటే దిగువకు పడిపోయాయి.  1983  తర్వాత అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత తక్కువ స్థాయి కావడం గమనార్హం. కేవలం గత వారంలోనే నిల్వలు ఏకంగా 6.1 మిలియన్ బారెళ్లు తగ్గిపోవడంతో, ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న మొత్తం చమురు నిల్వలు కేవలం 298.7 మిలియన్ బారెళ్లకు పరిమితమయ్యాయి. దీనిని బట్టే  అమెరికా ఇంధన భద్రత ఎంతటి ముప్పులో ఉందో  అర్ధమౌతుంది.  హార్ముజ్ జలసంధి త్వరగా తెరచుకోకపోతే, ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభంతో పాటు   ఆర్థిక మాంద్యం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Strait of Hormuz closure, Iran US oil conflict, Donald Trump Iran news, US Strategic Petroleum Reserve, Global oil shortage crisis, Hormuz strait blocked 2029

By
en-us Political News

  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత ఈ రెండేళ్లలో వైసీపీ రాష్ట్రంలో బలం పుంజుకునే దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అసెంబ్లీకి ముఖం చాటేయడం దగ్గర నుంచి, వైసీపీ అధినేత జగన్ చుట్టపు చూపుగా రాష్ట్రానికి రావడం వరకూ వైసీపీ చర్యలన్నీప్రజలకు దూరం జరిగేలాగే ఉన్నాయి. 
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విధి నిర్వహణకు వెళ్తున్న ఓ ఉపాధ్యాయురాలు తీవ్ర ప్రమాదం నుండి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
ముగిసిన ఎస్ఐఆర్ ప్రక్రియ.. మొత్తం 3.38 కోట్లు..!
దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ.. నోట్ల ఫీల్డ్ ట్రయల్స్‌కు పార్లమెంట్ ఆమోదం..!
నటి త్రిషపై అన్నాడీఎంకే నేత ఘాటు వ్యాఖ్యలు..!
పుష్కరాలకు వచ్చే భక్త కోటికి ఎటువంటి ఇబ్బందులూ ఎదురవ్వకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకుఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు కుంభమేలా ఏర్పాట్లను తలదన్నేలా ఉండాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.
అత్యాచార ఆరోపణలపై యువ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియాలో ఏం చేసినా ఎవరికీ తెలియదనుకున్నాడు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను చూస్తూ క్షణికానందం పొందాడు.
ప్రస్తుతం పీఓకే, మరియు బలూచిస్థాన్‌లు ప్రజా తిరుగుబాటుతో అట్టుడుకుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడడ అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాజా అశాంతి, ప్రభుత్వ వ్యతిరేకత నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకు పాకిస్థాన్.. భారత్ లో విధ్వంసం కుట్రకు తెరలేపిందని పరిశీలకులు అంటున్నారు.
విఐపి మొబైల్ నంబర్ లేదా ఫ్యాన్సీ నంబర్ అంటే ఏమిటి? 9999, 0000, 786, 1234 వంటి నంబర్లను ఆన్‌లైన్‌లో ఎలా ఎంచుకోవాలి, ధర వివరాలు మరియు భద్రతా జాగ్రత్తల గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
దేశంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులపై పార్లమెంటరీ సంఘం ఆందోళన..!
సోషల్ మీడియాలో పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. వ్యక్తిగత వివరాల సేకరణ.. చివరకు బ్లాక్‌మెయిల్! హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.