హర్మూజ్ క్లోజ్ ఎప్పటి వరకూ అంటే?
Publish Date:Aug 10, 2026
Advertisement
ప్రపంచ వాణిజ్య చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ముడిచమురు సరఫరాకు ముప్పు వాటిల్లింది. అమెరికా, ఇరాన్ మధ్య రాజుకున్న వివాదం కారణంగా కీలకమైన హార్ముజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసేసింది. ఈ నిర్ణయం ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అంతే కాకుండా ఈ మూసివేత.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత కాలం కొనసాగుతుందని ఇరాన్ నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పేసింది. అంటే 2029 జనవరి 20 వరకు హర్మూజ్ జలసంధి మూత కొనసాగుతుందని ఇరాన్ విస్పష్టంగా ప్రకటించింది. ట్రంప్ తమ డిమాండ్లన్నింటినీ పూర్తిగా అంగీకరిస్తే తప్ప ఎలాంటి చర్చలకు తావులేదని కుండబద్దలు కొట్టేసింది. ట్రంప్ హయాంలో ఒప్పందం కుదిరే ప్రసక్తే లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ సలహాదారు మజిద్ షాకేరీ ఈ మేరకు విస్పష్ట ప్రకటన చేశారు. ఈ నిర్ణయం కేవలం అమెరికాకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ అనడంలో సందేహం లేదు. ఈ తీవ్ర ఉద్రిక్తతల మధ్య అమెరికా తన చమురు నిల్వల విషయంలో గత 43 సంవత్సరాలలో ఎన్నడూ చూడని అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ వద్ద ఉన్న ముడిచమురు నిల్వలు అధికారికంగా 300 మిలియన్ బారెళ్ల కంటే దిగువకు పడిపోయాయి. 1983 తర్వాత అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత తక్కువ స్థాయి కావడం గమనార్హం. కేవలం గత వారంలోనే నిల్వలు ఏకంగా 6.1 మిలియన్ బారెళ్లు తగ్గిపోవడంతో, ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్న మొత్తం చమురు నిల్వలు కేవలం 298.7 మిలియన్ బారెళ్లకు పరిమితమయ్యాయి. దీనిని బట్టే అమెరికా ఇంధన భద్రత ఎంతటి ముప్పులో ఉందో అర్ధమౌతుంది. హార్ముజ్ జలసంధి త్వరగా తెరచుకోకపోతే, ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభంతో పాటు ఆర్థిక మాంద్యం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. Strait of Hormuz closure, Iran US oil conflict, Donald Trump Iran news, US Strategic Petroleum Reserve, Global oil shortage crisis, Hormuz strait blocked 2029
http://www.teluguone.com/news/content/strait-of-hormuz-closure-36-228596.html





