హర్మూజ్ లో వాణిజ్య నౌకలకు అమెరికా రక్షణ.!

Publish Date:Aug 4, 2026

Advertisement

ప్రపంచ ఇంధన  సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేశామంటూ ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా నిర్ద్వంద్వంగా ఖండాంచింది.   అంతర్జాతీయంగా  ప్రాధాన్యత కలిగిన ఈ  సముద్ర మార్గాన్ని తాము పూర్తిగా మూసివేశామన్న ఇరాన్ ప్రచారాన్ని నమ్మవద్దన్న అగ్రరాజ్యం..  హర్మూజ్ జలసంధి   మూతపడలేదని, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకల కోసం ఈ జలమార్గం   సురక్షితంగా తెరిచే ఉందని ప్రకటించింది.

అమెరికా బలగాలు ఈ మార్గంలో నౌకల రక్షణ కోసం నిరంతరం పహారా కాస్తున్నాయని పేర్కొంది. దీని వల్ల ఈ మార్గం గుండా  వాణిజ్యం నౌకల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేదని అమెరికా ఆర్మీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన గణాంకాలను కూడా వెల్లడించింది.  ఈ ఏడాది మే  నుంచి ఇప్పటివరకు  అమెరికా సైనిక బలగాలు వెయ్యికి పైగా వాణిజ్య నౌకలు హర్మూజ్ జలసంధిని   సురక్షితంగా దాటేందుకు  సహాయ సహకారాలు అందించాయని సెంట్‌కామ్‌ ప్రకటించింది.

ఈ వెయ్యి నౌకల ద్వారా ప్రపంచవ్యాప్త ఇంధన అవసరాల కోసం   50 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు  రవాణా అయిందని పేర్కొంది. అంతర్జాతీయ జలమార్గాలను,  అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఇష్టారీతిన మూసివేసే లేదా అడ్డుకునే ఎలాంటి చట్టబద్ధమైన అధికారం ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్‌కు ఇసుమంతైనా లేదని సెంట్‌కామ్ కుండబద్దలు కొట్టినట్లు పేర్కొంది. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను దెబ్బతీసేందుకు ఎవరు ప్రయత్నించినా సహించేది లేదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. 

అంతర్జాతీయ జలసంధిలో స్వేచ్ఛా నౌకాయానానికి, వాణిజ్య భద్రతకు పూర్తి భరోసా ఇస్తూనే..  ఇరాన్ నౌకాశ్రయాలపై తమ దేశం విధించిన ఆంక్షలను  అమెరికా  అమలు చేస్తోంది. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రయాణించేందుకు ప్రయత్నించిన నౌకలపై అమెరికా నౌకాదళం ఉక్కుపాదం మోపింది. జులై చివరినాటికి   అంతర్జాతీయ నిబంధనలను ధిక్కరించిన 30 వాణిజ్య నౌకలను అమెరికా నౌకాదళం దారి మళ్లించింది.   

Strait of Hormuz, US Central Command, CENTCOM Iran news, Crude oil transport, Persian Gulf security, US Navy ships protection

By
en-us Political News

  
సెప్టెంబర్ 18లోగా పాస్‌పోర్ట్ ఇవ్వాలి.. కోర్టు ఆదేశాలు..!
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైన ఈ కంటెంట్‌ను నీచమైన, నిందాపూర్వకమైనదిగా  పేర్కొంది. ఇలాంటి హానికరమైన, అసత్యపూరితమైన పోస్టులకు బహిరంగ వేదికలలో ఏమాత్రం స్థానం ఉండకూడదని స్పష్టం చేసింది.
దిల్‌సుఖ్‌నగర్‌లో తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి కారు పేరుతో కలకలం..!
వాహన యజమానులు   సామాజిక, చట్టబద్ధమైన బాధ్యతను గుర్తించేలా చేయడం,  దురదృష్టవశాత్తు రహదారి ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులకు తగిన ఆర్థిక పరిహారం సకాలంలో అందేలా చూడటమే ఈ ప్రతిపాదిత మార్గదర్శకాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని పేర్కొంది. 
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
భారత క్రీడారంగంలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుతమైన ఘట్టం సాగర తీర నగరం విశాఖపట్నంలో ఆవిష్కృతమైంది.
ట్రైనీ మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయి ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
ఇప్పటివరకు పోలీస్‌ అత్యవసర సేవల కోసం వినియోగిస్తున్న డయల్‌ 100 స్థానంలో 112 నంబర్‌ ను అమలు చేయనున్నారు.  పోలీస్‌, అంబు లెన్స్‌, అగ్నిమాపక సేవల ను ఒకే ఎమర్జెన్సీ నంబర్‌ పరిధిలోకి తీసుకురావడం ఈ కొత్త వ్యవస్థలో  ప్రత్యేకత. 112కు ఫోన్‌ చేస్తే కేవలం పోలీస్‌ సహాయం మాత్రమే కాదు.. పరిస్థితిని బట్టి అంబులెన్స్‌, ఫైర్‌ సర్వీసులను కూడా సమన్వయం చేసేలా వ్యవస్థను రూపొందించారు. 
మొత్తం 76 జూనియర్‌ కాలేజీలు ఫైర్‌ ఎన్‌ఓసీలను సమర్పించగా, వాటిలో ఎనిమిది కాలేజీలు నకిలీ, ఫోర్జ్డ్‌ ఎన్‌ఓసీలను సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై హైడ్రా అడిషనల్‌ డైరెక్టర్‌ ఫిర్యాదు మేరకు లేక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.
గతంలో వైజాగ్ మధురవాడలోని ఐటీ సెజ్ హిల్ నెంబర్ 3లో ఐబీఎం క్యాంపస్ నడిచేది. అయితే నాటి పరిస్థితుల కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయిన నేపథ్యంలో.. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ఐబీఎం తిరిగి విశాఖకు వచ్చింది. ఇది నిస్సందేహంగా మంత్రి నారాలోకేష్ విజయమని పరిశీలకులు అంటున్నారు.
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ మెగాడీఎస్సీలో అవకతవకలు, అక్రమాలు జరిగితే.. బాధిత అభ్యర్థులు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
 ఈ సోదాలు బీహార్ కు  చెందిన ప్రత్యేక ఈడీ బృందం పర్యవేక్షణలో జరిగాయి. హైదరాబాద్,  విశాఖలో మళ్ల విజయప్రసాద్ కు చెందిన  నివాసాలు, వ్యాపార ప్రాంగణాలు,   అనుబంధ కార్యాలయాలలో ఈడీ అధికారులు ఏక కాలంలో సోదాలు చేపట్టారు. 
దాడికి కావలసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి నుంచి సేకరించాలని ప్లాన్ చేశారు. అంతేకాకుండా పంజాబ్‌లోని కీలకమైన పోలీస్ స్టేషన్లు, పోలీస్ భవనాలు, సిబ్బందిపై నిరంతరం రెక్కీ నిర్వహించే బాధ్యతను కూడా ఈ నిందితులకే అప్పగించారు. మరోవైపు అమృత్‌సర్ ప్రాంతంలో రైల్వే పట్టాల సమీపంలో రహస్యంగా సీసీ కెమెరాలు అమర్చిన వ్యవహారంపై తనిఖీలు చేపట్టగా రెండో ఉగ్ర మాడ్యూల్ బయటపడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.