చాణక్యుడు చెప్పిన మాట.. ఈ అయిదు లక్షణాలు ఉన్న వ్యక్తులకు తిరుగు లేదు..

Publish Date:Aug 16, 2023

Advertisement

ఒక వ్యక్తి  జీవితం ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. వీటన్నిటినీ జాగ్రత్తగా డీల్ చేస్తూ జీవితంలో గొప్పగా ఎదగడం అనేది కత్తిసాము లాంటిది. గొప్ప పండితుడు, ఉపాధ్యాయుడు,  నైపుణ్యం కలిగిన దౌత్యవేత్త ఆచార్య చాణక్యుడు. ఈయన తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అన్ని అంశాల గురించి ప్రస్తావించారు. ఆచార్య చాణక్యుడు చెప్పిన విధానాలు నేటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయి. ఆయన విధానాలు ప్రజలకు సరైన మార్గాన్ని చూపుతాయి. చాలా సార్లు మనం  ఒక పని చేయడానికి  మన సర్వ శక్తి సామర్థ్యాలు వినియోగిస్తాం. కానీ ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా అందులో విజయం సాధించలేకపోతున్నాం. ఆచార్య చాణక్య ప్రకారం, వైఫల్యం వెనుక వ్యక్తి స్వయం తప్పిదాలు ఉన్నాయి.   ఆచార్య చాణక్యుడు  తన నీతిలో ఇలాంటి ఎన్నో  విషయాలు  చెప్పాడు, వాటిని అనుసరించడం ద్వారా  వ్యక్తి తన వైఫల్యాన్ని  సులభంగా  మార్చుకోవచ్చు. తన ప్రయత్నాన్ని విజయంగా మార్చుకోవచ్చు. మనిషి ఒక ప్రయత్నంలో సక్సెస్ కావాలంటే ఈ అయిదు లక్షణాలు మనిషిలో ఉండాలి. అవేంటంటే..

ఆత్మ విశ్వాసం..

మనిషి జీవితంలో ఆత్మవిశ్వాసం అతి పెద్ద ఆస్తి. ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులు ఏ పనిలోనూ విఫలం చెందరు. చాణక్యుడి ప్రకారం, ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తిని అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగిస్తుంది. 

కష్టం..

కష్టపడి పనిచేసే వ్యక్తులు ఎప్పుడూ విఫలం కాలేరు. ఒక రోజు కాకపోయినా మరొక రోజు కష్టపడి పని చేసిన ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు, కాబట్టి కష్టం లేకుండా  జీవితాన్ని ఎప్పుడూ మోసం చేసుకోకూడదు.  కష్టపడి పనిచేయడమే విజయానికి ప్రధాన మంత్రం.

జ్ఞానం..

మనిషి జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించినా అది  ఎప్పుడూ వృధా కాదు, అది పుస్తక జ్ఞానం అయినా లేదా ఏదైనా పని చేయడం ద్వారా పొందిన అనుభవ జ్ఞానం అయినా. ఏదో ఒక రోజు,  ఈ అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తెలివైన వ్యక్తి జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు.

డబ్బు..

జీవితంలో మంచి, చెడు అని రెండు సమయాలు, సందర్భాలు వస్తాయి,  పోతాయి. చాలామంది డబ్బుకు మనిషి అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదు అని అంటారు. కానీ నేటి కాలంలో బ్రతకాలి అంటే డబ్బు ఎప్పుడూ అవసరం. అందుకే జీవితంలో విజయం సాధించడానికి మనిషి  దగ్గర కూడా డబ్బు ఉండాలి. 

అప్రమత్తత

జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించాలంటే అప్రమత్తత చాలా ముఖ్యం.  ఎక్కడ నివసించినా,  ఏ పని చేసినా, ఆ ప్రాంతాలను ఓ  కంట కనిపెడుతూ   ఉండాలి. నిశ్శబ్దంగా ఉంటూనే విషయాలన్నీ వింటూ ఉండాలి. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే వ్యక్తి  వైఫల్యాన్ని పొందడం తక్కువ.


  ఈ అయిదు లక్షణాలు ఉన్న వ్యక్తి ఏ పనిలో అయినా విజయం సాధించగలడు.


                                *నిశ్శబ్ద.

By
en-us Political News

  
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో ‘ఫ్రోజెన్ షోల్డర్’ (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో ‘అడెసివ్ క్యాప్సులైటిస్’ అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.