టమాటాలు త్వరగా పాడైపోకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి..!

Publish Date:Jun 25, 2026

Advertisement

కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువుగా  కుళ్ళిపోతాయి.  ఇది చాలా మంది ఎదుర్కునే  సాధారణ సమస్య. వాటిని సరిగ్గా నిల్వ చేయడం ద్వారా పాడవకుండా నివారించవచ్చు. అందుకోసం టమాటాలను ఎలా నిల్వ చేయాలి తెలుసుకుంటే..

పచ్చి టమాటాలు..

టమాటా పూర్తిగా పండకపోయినా, ఇంకా కొంచెం గట్టిగా ఉంటే, దానిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవచ్చు. పండని టమాటాలను డైరెక్ట్ సన్ లైట్ కు  దూరంగా ఉంచాలి. పచ్చి గా ఉన్నవి, పూర్తీగా  పండని టమాటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి  రుచిని కోల్పోయి, సరిగ్గా పండకుండా ఉంటాయి.

పండిన టమోటాలు..

టమోటాలు పూర్తిగా పండి, ఎర్రగా ఉంటే, అవి గట్టిగా ఉంటే..  వాటిని గది ఉష్ణోగ్రత వద్ద కౌంటర్‌పై నిల్వ చేయాలి.  ఈ టమోటాలను 1 నుండి 2 రోజుల వరకు ఉపయోగించవచ్చు. టమోటాలను కాడ భాగం కిందికి ఉండేలా నిల్వ చేయాలి. దీనివల్ల కాడ చుట్టూ ఉన్న తేమ బయటకు పోతుంది , అవి త్వరగా వాడిపోకుండా  ఉంటాయి. టమోటాలను ఒకదాని మీద ఒకటి కాకుండా అన్నింటికి పక్కన పక్కన ఉంచి నిల్వ చేయాలి.

బాగా పండిన టమోటాలు..

టమోటాలు బాగా పండితే పాడైపోతాయని చాలామంది భయపడతారు. వాటిని రిఫ్రిజిరేటర్‌లోని చల్లదనంలో ఉంచడం వల్ల పండే ప్రక్రియ నెమ్మదిస్తుంది. రిఫ్రిజిరేటర్ నుండి తీసిన వెంటనే టమోటాలను తినకూడదు. అవి గది ఉష్ణోగ్రతకు వచ్చినప్పుడు మాత్రమే తినాలి.

ఇవి గుర్తుంచుకోవాలి..

టమోటాలను కడగకుండా, ఆరబెట్టకుండా ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి.

టమోటాలు పండినప్పుడు, అవి ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల, బాగా పండిన టమోటాలను ఎక్కువగా ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి.

టమోటాలను అతి చల్లని ఉష్ణోగ్రతలలో నిల్వ చేయడం వాటి రుచిని పాడు చేస్తుంది. దీనివల్ల వాటి తొక్క బలహీనపడి, మరింత త్వరగా పాడైపోతాయి.

                                        *రూపశ్రీ.

By
en-us Political News

  
ఆచార్య చాణక్యుడు   గొప్ప రాజనీతిజ్ఞుడు,  వ్యక్తిత్వ విశ్లేషణా నిపుణులు,  ఆర్థిక శాస్త్ర నిపుణులు.  ఆయన వేల సంవత్సరాల కిందటే మనిషి జీవితంలో ఎన్నో విషయాలను ఎంతో స్పష్టంగా, వివరంగా చెప్పాడు.
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటూ ఉంటారు. కానీ ఆర్థిక అవసరం ఏర్పడినప్పుడు మానవ సంబందాలే ఆదుకుంటాయి.  
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విలువలు ఉండాలని కోరుకుంటారు, కానీ ఇది అంత సులభమైన పని కాదు.
నేటి కాలంలో ఇల్లు, కారు, పిల్లల చదువు, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం లోన్ తీసుకోవడం చాలా సాధారణమైంది.
ఈ సమాజంలో ప్రతి వ్యక్తికి కుటుంబంతో ఉండే అనుబంధం చాలా గొప్పది. ఎన్నో విషయాలు కుటుంబం నుండే నేర్చుకుంటారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, తెలివైనవారుగా, క్రమశిక్షణ గలవారుగా , స్వయం సమృద్ధి గలవారుగా ఉండాలని కోరుకుంటారు.
జీవితం అన్నాక సంతోషాలు,  ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే.. కానీ.. కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో "ఏడిస్తే ఏం ప్రయోజనం?", "
పిల్లలు చదువును ఒత్తిడిగా కాకుండా ఆనందంగా భావించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. చాలామంది తల్లిదండ్రులు మంచి మార్కులు రావాలని ఆశపడతారు.
ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత అందంగా కనిపిస్తుంది. ఇంటిని శుభ్రం చేసే క్రమంలో బూజు దులపడం, తుడవడం,  ఇంట్లో ఎక్కడైనా సాలీడు పురుగులు, బొద్దింకలు వంటివి రాకుండా చూడటం చేస్తుంటారు.
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది.
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.
వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.