టీటీడీ కర్రపెత్తనం!

Publish Date:Aug 17, 2023

Advertisement

తిరుమల నడకదారిలో చిన్నారిపై చిరుత దాడి చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది మన తెలుగు రాష్ట్రాలనే కాదు ప్రపంచ నలుమూలల నుండి కలియుగ   దైవం వెంకన్న దర్శనం కోసం వచ్చే భక్తజన కోటిని ఉలికిపాటుకు గురిచేసింది. దీంతో టీటీడీ నిర్లక్ష్యాన్ని, నిష్క్రియాపరత్వాన్ని అంతా దుమ్మెత్తి పోశారు. విపక్షాలైతే.. అసలు తిరుపతి అడవిలో ఏం జరుగుతుంది.. ప్రశాంతంగా అడవిలో బతికే మృగాలు తిరుమల భక్తులపైకి ఎందుకొస్తున్నాయని సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో టీటీడీ ఏదో ఒకటి చేసి విమర్శల నుంచి, ప్రశ్నల నుంచి బయటపడాలని భావించింది. చిరుతలను బంధించాలని ఆదేశించింది. దాడి చేసిన చిరుతను దృష్టిలో పెట్టుకొని ఇందుకోసం ఆపరేషన్ చిరుత స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఈ చిరుతల వేటలో వంద మంది అటవీ సిబ్బంది పాల్గొనగా.. తిరుమలలో ఆపరేషన్ చిరుత ముమ్మరంగా సాగుతోంది. గురువారం బోనులో మరో చిరుత చిక్కగా ఇంకా 3 నుంచి 4 చిరుతలు నడక మార్గంలో తిరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇదిలా ఉండగానే టీటీడీ మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. ముందుగా చిన్నారిపై చిరుత దాడి ఘటన వెలుగులోకి రాగానే టీటీడీ ఆఘమేఘాల మీద ఏవేవో నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించింది. అవన్నీ కఠిన నిర్ణయాలని చెప్పుకొచ్చింది. వాటిని శరవేగంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఏదేదో కఠిన నిర్ణయాలని చెప్పి నడక మార్గంలో తిరుమలకి వెళ్లే భక్తులకు ఊత కర్రలను సిద్ధం చేసింది. కాలినడక మార్గంలో వన్యప్రాణుల సంచారం అధికమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో తిరుమలకు కాలినడక వెళ్లే భక్తులకు చేతి కర్రల పంపిణీ ప్రారంభమైంది. ఒక్కో భక్తుడికి ఒక్కో చేతి కర్రను పంపిణీ చేస్తున్నారు. టీటీడీ వాలంటీర్లు, సిబ్బంది ద్వారా వీటిని సరఫరా చేస్తున్నారు. 

చిరుత దాడితో టీటీడీ కఠిన నిర్ణయాలు అంటే వెంకన్న భక్తులు ఏదేదో ఊహించుకున్నారు. కానీ చివరికి చేతికి ఊత కర్ర ఇవ్వడంతో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. టీటీడీ నిర్ణయంపై సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కర్రలతో పులులు, సింహాలను వేటాడాలా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. భద్రత అంటే కర్రలు ఇవ్వడం కాదు.. రక్షణ గోడలు బలోపేతం చేయాలని   కోరుతున్నారు. ఇంకా చెప్పాలంటే టీటీడీ ప్రకటించిన ఊత కర్ర సోషల్ మీడియాలో అతి పెద్ద ట్రోలింగ్ గా మారింది. నిత్యం వెంకన్న కోసం లక్షల మంది భక్తులు వస్తుంటారు. అలాంటిది ఒక మనిషికి ఓ కర్ర సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ ఈ కర్ర సిద్ధాంతం అమలు చేయాలంటే కొన్ని వేల కర్రలు కావాలి. అది కూడా కొండపైకి పంపించే కర్రలను కొండమీద కలెక్ట్ చేసుకోని మళ్ళీ తిరిగి కొండ దిగువకి తేవాలి. కనీసం ఇలా చేయాలన్నా కొన్ని ఎకరాల్లో అడవిని నాశనం చేయాలి. ఇందు కోసం మరింత సిబ్బంది కావాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కర్ర మీద సామే. 

అందుకే సోషల్ మీడియాలో ఈ నిర్ణయం పై రకరకాల సెటైర్లు పడుతున్నాయి. అయితే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ పాలకవర్గం, వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భక్తులకు కర్రలు కాకుండా తుపాకులు ఇవ్వాలా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాయి. మొత్తానికైతే టీటీడీ ఊతకర్రల నిర్ణయం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తిరుమల అంటే హిందువులకు ఒక నమ్మకం. కొండ ఎక్కితే ఆయనే తన మోర ఆలకించి ఆదుకుంటాడని ఒక ధీమా. కానీ ఇప్పుడు తిరుమలలో అదే కొరవడింది. ఏడుకొండలవాడి కోసం నడకమార్గంలో వచ్చే భక్తులకు భద్రంగా తిరుమల చేరుకుని వెంకన్న దేవుడి దర్శనం చేసుకుంటామా అన్న నమ్మకం   లేకుండా పోయింది. ఎప్పుడు ఏమవుతుందో, ఏ మృగం తమపై దాడి చేస్తుందోనని కొండెక్కే ప్రతి భక్తుడు భయం భయంగా అడుగులేసే పరిస్థితి వచ్చింది.  దీంతో భక్తులు ఏడుకొండలవాడా వెంకటేశ.. అయ్యో ఇదేం దుస్థితయ్యా నీ భక్తులకు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.