Publish Date:Nov 22, 2024
జబ్బార్ భాయ్ విచారంగా మౌలానా దగ్గిరికి వచ్చాడు. తన కొడుకులు ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని మౌలానాకు వివరించాడు. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది. కోట్లాది రూపాయల విలువ చేసే ఇల్లు నాకుంది . లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లో నలుగురు కొడుకుల పేర్లు ఉన్నాయి. ఈ ఆస్తి వారికే చెందుతుంది. నా భార్య చనిపోయింది. రెండు పూటల భోజనం దొరకడం లేదు. నలుగురు కొడుకులు తిండి పెట్టడం లేదు. నాకే ఇలా ఎందుకు జరుగుతుంది.
Publish Date:Nov 22, 2024
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్ట్ శుక్రవారం (నవంబర్ 22) పెర్త్‌వేదికగా మొదలైంది. తొలి టెస్ట్ తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్ లో 67 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది.
Publish Date:Nov 22, 2024
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పది రోజుల పాటు సాగాయి. విపక్ష వైసీపీ ప్రతిపక్ష హోదా డిమాండ్ తో సమావేశాలను బహిష్కరించింది.
Publish Date:Nov 22, 2024
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పీఏసీ కమిటీ సభ్యుల ఎన్నికకు పోలింగ్ పూర్తయ్యింది. దీనితో పాటు ప్రజాపద్దులు , అంచనాలు, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ల్లో సభ్యుల నియామకం కోసం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలను వైసీపీ బాయ్ కాట్ చేసింది.
Publish Date:Nov 22, 2024
వైఎస్ జగన్ టార్గెట్ గా ఆయన సోదరి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను. నాడు ప్రభాస్ ఎవడో నాకు తెలియదు నేడు కూడా తెలియదు.
Publish Date:Nov 22, 2024
ఉత్తర ప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ళుగా సాగిస్తున్న బుల్డోజింగ్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా భావించాలి. నిందితుడికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ఒక అధికారి న్యాయమూర్తిగా వ్యవహరించి నిందితుడి ఆస్తిని నేలమట్టం చేయడం అధికారాల విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమే అవుతుందని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
Publish Date:Nov 22, 2024
హైద్రాబాద్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఆర్యన్ రెడ్డి అమెరికాలో గన్ ప్రమాదవశాత్తు పేలి చనిపోయాడు. ప్రమాదవశాత్తు జరిగిందా? ఆర్యన్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తేలాల్సి ఉంది.
Publish Date:Nov 22, 2024
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలం అరాచకం రాజ్యమేలింది. వ్యవస్థలన్నిటినీ గుప్పెట్లో పెట్టుకుని వైసీపీయులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. పార్టీ కోసం పని చేసే వారికి దొడ్డిదారిన ప్రభుత్వ కొలువులు కట్టబెట్టేసి.. ప్రజాధనాన్ని అప్పనంగా దోచిపెట్టేశారు అప్పటి ముఖ్యమంత్రి జగన్. తన కోసం, తన ప్రత్యర్థులపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న వారినీ, సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీల నేతలపై అసభ్య పోస్టులు పెట్టీ, ఫోటోలు మార్ఫ్ చేసీ వేధింపులకు గురి చేసిన వారికీ పెద్ద పీట వేశారు.
Publish Date:Nov 22, 2024
రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా కీలక సమావేశం శుక్రవారం (నవంబర్ 22)న జరగనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశం కానున్నారు.
Publish Date:Nov 21, 2024
పోసాని కృష్ణ మురళి తన విలక్షణ నటనతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు పొందారు. ఏదో మేరకు అభిమానులనూ సంపాదించుకున్నారు. అయితే ఎప్పుడైతే ఆయన రాజకీయాలలోకి ప్రవేశించి.. జగన్ పంచన చేరారో అప్పటి నుంచి ఆయన మాట, తీరు, నడక, నడత పూర్తిగా మారిపోయింది. జగన్ అధికారంలో ఉన్నంత కాలం బుర్ర, బుద్ధి అనే వాటితో అవసరం లేదనీ, కేవలం నోటికి పని చేబితే చాలు వైసీపీలో పబ్బం బ్రహ్మాండంగా గడిచిపోతుందనీ కనిపెట్టేశారు. అంతే అప్పటి నుంచీ పోసాని మంచి చెడు, మర్యాద, మన్నన అనేవి పూర్తిగా మరిచిపోయారు.
Publish Date:Nov 21, 2024
అదానీ వ్యాపార సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరించడం వెనుక రాజకీయ అండదండలున్నాయన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయన వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత తరచూ ప్రశ్నార్థకమౌతూనే ఉంది.
Publish Date:Nov 21, 2024
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (నవంబర్ 22)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 19 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
Publish Date:Nov 21, 2024
ప్రముఖ సినీ రచయిత,వైకాపా నేత పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. కుటుంబ కారణాల రీత్యా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు చెప్పారు.